Man Made Disaster Jagan.. తుపాన్లు అనేవి ప్రకృతి విపత్తు కేటగిరీలోకి వస్తాయి.! మనుషులు ఆపగలిగేవి కావివి.!
కాకపోతే, ప్రాణ నష్టాన్ని తగ్గించడానికి, మానవ ప్రయత్నం గట్టిగా చేయాల్సి వుంటుంది.
ఆస్థి నష్టాన్ని ప్రకృతి విపత్తుల సమయంలో నివారించలేం. అది, అసాధ్యం.! ఇది అందరికీ తెలిసిన విషయమే. ఆస్తి నష్టమంటే, అందులో పంట నష్టం కూడా వుంటుంది.
తుపాన్ల వేళ, పంట నష్టం అనేది సర్వసాధారణం. చెట్లు నేలకొరుగుతాయ్.. పంటలు నాశనమవుతాయి. వీటిని నివారించగలిగే పరిస్థితే వుండదు.
Man Made Disaster Jagan.. ఆటలో అరటి పండు వైఎస్ జగన్..
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంపై దండెత్తింది మొంథా తుపాను.! భారీ నష్టమే కలిగించింది మెంథా తుపాను. బెంగళూరు నుంచి గన్నవరం విమానాశ్రయానికి జగన్ వచ్చేందుకూ అడ్డంకిగా మారింది ఈ తుపాను.
తుపాను వంక పెట్టి, ప్రయాణాన్ని రద్దు చేసుకున్న జగన్, తీవ్ర విమర్శలు రావడంతో.. తుపాను తీవ్రత కాస్త తగ్గగానే, బెంగళూరు నుంచి విజయవాడకు చేరుకున్నారు.
తుపాను హెచ్చరికలు కొన్ని రోజుల ముందు నుంచీ వున్నాయి. ముందే, జగన్ విజయవాడ వచ్చి వుండొచ్చు కదా.? పోనీ, రోడ్డు మార్గాన అయినా వచ్చి వుండొచ్చు కదా.? అన్నది వేరే చర్చ.
తీరిగ్గా, విజయవాడకు చేరుకున్న జగన్ రెడ్డి, తనకు మాత్రమే సాధ్యమైన ప్రెస్ మీట్ యధావిదిగా పెట్టారు. తాను చెప్పాలనుకున్న సోది అంతా, చెప్పుకున్నారు.
పనిలో పనిగా, కూటమి ప్రభుత్వంపై రాజకీయ విమర్శలు చేశారు. రాజకీయాలన్నాక విమర్శలు సహజమే. కాబట్టి, విమర్శల విషయంలో జగన్ని ఏమీ అనలేం.
కానీ, మ్యాన్ మేడ్ డిజాస్టర్.. అంటూ, తుపాను విధ్వంసం వేళ వైఎస్ జగన్ వ్యాఖ్యానించడమే హాస్యాస్పదమై కూర్చుంది.
ఎవరు స్క్రిప్టు రాసిస్తున్నారోగానీ, అది తనను డ్యామేజ్ చేస్తోందని జగన్ రెడ్డి గుర్తెరగాలి. లేకపోతే, తుపాన్లను మ్యాన్ మేడ్ డిజాస్టర్లని అనడమేంటి.?
మ్యాన్ మేడ్ డిజాస్టర్ ఇదీ..
ముఖ్యమంత్రిగా వున్న సమయంలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, రాజధాని అమరావతిని అస్సలు ఒప్పుకోలేదు. మూడు ముక్కలాట ఆడారు, రాష్ట్రంతో.
మూడు రాజధానులన్నారు.. అమరావతిపై అప్పటి మంత్రులతో విషం చిమ్మించారు. కమ్మరావతి అన్నారు, ముంపు ప్రాంతమన్నా, ఎడారి అన్నారు, స్మశానమనీ అన్నారు వైసీపీ నేతలు.
ఓ రాష్ట్రానికి ఐదేళ్ళపాటు రాజధాని వుందో లేదో తెలియని పరిస్థితి అంటే, ఇది కదా.. మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే.!
వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ జీవితంలో, చెరిగిపోని మచ్చ అంటే, ఆంధ్ర ప్రదేశ్ రాజధాని అమరావతిపై ఆయన చూపిన నిర్లక్ష్యం.
జగన్ హయాంలో, ఉప్పాడ తీరం కోతకి గురి కాకుండా ఏం చర్యలు తీసుకున్నట్లు?. తీసుకోలేదాయె.. పూర్తి స్థాయి నిర్లక్ష్యం ప్రదర్శించారాయె. ఇది కదా, మ్యాన్ మేడ్ డిజాస్టర్ అంటే.!
చెప్పుకుంటూ పోతే, ఒకటా.? రెండా.? వైఎస్ జగన్ మేడ్ డిజాస్టర్లు కోకొల్లలు వున్నాయ్.!
