Home » మంచు లక్ష్మి గెలిచింది.! సినీ ఎర్నలిస్టు పొగరు అణిచేసింది.!

మంచు లక్ష్మి గెలిచింది.! సినీ ఎర్నలిస్టు పొగరు అణిచేసింది.!

by hellomudra
0 comments
Manchu Lakshmi Prasanna

Manchu Lakshmi Vs Devipriya.. ఔను, మంచు లక్ష్మి గెలిచింది.!

ఇంటర్వ్యూ ముసుగులో అభ్యంతకర ప్రశ్నలు వేయడమే పాత్రికేయం.. అనే భ్రమల్లో వున్న ఓ సినీ ఎర్నలిస్టుకి గూబ గుయ్యిమంది.!

కొద్ది రోజుల క్రితం, మంచు లక్ష్మీ ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా, ఓ యూ ట్యూబ్ ఛానల్‌కి ఇంటర్వ్యూ ఇచ్చిన సంగతి తెలిసిందే.

ఇంటర్వ్యూ సందర్భంగా, వయసుకీ వస్త్ర ధారణకీ లింకు పెట్టి, అభ్యంతకరమైన రీతిలో ప్రశ్నలు సంధించాడు, వయసు మీద పడిన ఓ సినీ ఎర్నలిస్ట్.

గతంలో సిీన నటి స్వాతి రెడ్డిని ఆమె వ్యక్తిగత జీవితానికి సంబంధించిన ప్రశ్నలు గుచ్చి గుచ్చీ మరీ.. ఆమెను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశాడు ఈ సినీ ఎర్నలిస్ట్.

సినీ నటుల్ని ఉద్దేశించి, ‘మీ స్థాయి ఎంత.?’ అని ఆయా ప్రెస్ మీట్లలో ప్రశ్నించడం.. ఇంకా చాలా నాన్సెన్స్ జరుగుతోంది గత కొంతకాలంగా ఆ సినీ ఎర్నలిస్టు నుంచి.

కొందరు గట్టిగా మాట్లాడగలుగుతున్నారు.. తెరవెనుకాల, ఆయా వివాదాలపై క్షమాపణలు చెప్పడం, కాళ్ళు పట్టుకోవడం.. ఇవన్నీ చేస్తున్నాడా సినీ ఎర్నలిస్టు.

Manchu Lakshmi Vs Devipriya.. బ్లాక్‌మెయిల్ పాత్రికేయ వ్యభిచారం..

బ్లాక్‌మెయిల్ జర్నలిజం చేస్తున్నాడనీ, పాత్రికేయ వ్యభిచారి అనీ.. సదరు సినీ ఎర్నలిస్టుకి సినీ జర్నలిస్టుల్లో ఓ ఘనమైన పేరుంది.

అందరూ కాండ్రించి మొహాన ఉమ్మేయాలనుకునేవారే.. కానీ, ‘ముసలాడు కదా..’ అని కాస్తంత చూసీ చూడనట్లు వదిలేస్తున్నారంతే.

కానీ, ఇక్కడ మంచు లక్ష్మి విషయంలో మాత్రం, సదరు సినీ ఎర్నలిస్టుకి గూబ గుయ్యిమనిపోయింది. ‘నేనెందుకు క్షమాపణ చెప్పాలి.?’ అని, అందరి దగ్గరా బీరాలు పలికాడు.

కానీ, చివరికి వివరణ ఇచ్చుకోక తప్పలేదు. అయితే, వివరణ ఎవడిక్కావాలి.? క్షమాపణ చెప్పి తీరాల్సిందిగా, అట్నుంచి కౌంటర్ ఎటాక్ వచ్చింది.

చేసేది లేక, బేషరతు క్షమాపణ చెబుతూ, ఓ వీడియో విడుదల చేశాడు సదరు సినీ ఎర్నలిస్టు. దాంతో, ఈ వివాదానికి ఇప్పటికి ముగింపు పడ్డట్లయ్యింది.

కాగా, ఈ మొత్తం వ్యవహారంపై.. మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ స్పందిస్తూ, ఇక్కడితో ఈ వివాదాన్ని ముగిస్తున్నట్లు పేర్కొన్నారు.

మంచు లక్ష్మి స్పందన యధాతథంగా.. తెలుగులోనూ, ఇంగ్లీషులోనూ..

ఒక వ్యక్తి నుంచి క్షమాపణ పొందడానికి నాకు మూడు వారాలు పట్టింది. నేను ఈ సారి మౌనంగా ఉండాలని అనుకోలేదు.

ఎందుకంటే నా కోసం నేను నిలబడకపోతే, నా తరఫున ఎవరూ నిలబడరని నాకు తెలుసు. ఈ అనుభవం నన్ను లోతుగా గాయపరిచింది.

నాకు కావల్సింది కేవలం ఒక నిజమైన క్షమాపణ, బాధ్యతను స్వీకరించడం మాత్రమే. ఇలాంటి చిన్న చిన్న ప్రతిఘటనలే ఆడవాళ్ళ గొంతుని మూగబోకుండా కాపాడుతాయి.

నాకంటే ముందు ధైర్యం గా మాట్లాడిన ఆడవాళ్ల వరుసలోనే నేనూ నిలబడి ఉన్నాను… వారి ధైర్యమే నాకీ రోజు బలాన్నిస్తుంది. పత్రికా రంగం వృత్తిపై నాకు చాలా గౌరవం ఉంది.

ప్రజలకు నిజం తెలియజేయడంలో ప్రాణం పెట్టే జర్నలిస్టులు ఈ సమాజానికి వెలుగు చూపే దీపాల్లాంటి వారు.

కానీ ఆ శక్తిని సార్థకమైన సంభాషణల కంటే వ్యక్తిగత దాడుల కోసం వాడినప్పుడు, అది ఎంతో బాధని కలిగిస్తుంది. నేను ఇంక ఈ విషయాన్ని ప్రశాంతంగా ముగిస్తున్నాను.

ఇకపైన కూడా ఆత్మగౌరవంతో నడవబోతున్నాను.. నిజాయితీతో తన కథని వినిపించే ప్రతి మహిళకు గౌరవం తెలియజేస్తూ…

It took me three weeks to receive an apology from this individual. I refused to stay silent because I believe that if I don’t stand up for myself, no one else will.

This experience deeply hurt me all I sought was a sincere apology and accountability. These small acts of resistance are what ensure that women’s voices are not silenced.

I stand on the shoulders of all the women who have spoken up before me, whose courage gives me strength today.

I have immense respect for the field of journalism and the many journalists who dedicate their lives to truth-telling. It is one of the most noble professions.

Women Power..

But when that power is used for personal attacks instead of meaningful dialogue, it becomes deeply painful.

I choose to close this chapter now with dignity and peace and move forward with renewed strength and respect for every woman who continues to raise her voice with integrity.

సదరు ఎర్నలిస్టు అసలు పేరేమో వేదుల మూర్తి.! కానీ, ‘దేవీప్రియ’ అంటూ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తుంటాడు. మహిళల్ని గౌరవించడం మాత్రం అస్సలు చేతకాదు.

ఇలాంటి ఎర్నలిస్టుల్ని ఆదర్శంగా తీసుకుంటున్నారేమో, మహిళా జర్నలిస్టులు కూడా ఎర్నలిస్టుల్లా మారిపోయి,

‘మీ పర్సనాలిటీకి హీరోగా ఛాన్స్ ఎలా వచ్చింది.?’ అని హీరోల్ని అభ్యంతకరమైన రీతిలో ప్రశ్నించేస్తున్నారు.

మొన్నామధ్య ఓ మహిళా సినీ ఎర్నలిస్ట్, సినీ నటి అనన్య నాగళ్ళ మీద అత్యంత అసభ్యకరమైన రీతిలో ప్రశ్నలు సంధించింది.

అనన్య నాగళ్ళ ఆ ప్రశ్నకు కొంత ఇబ్బంది పడగా, ఆ తర్వాత ఆ సినీ ఎర్నలిస్టుతో ఆమెకు క్షమాపణ చెప్పించారు తోటి జర్నలిస్టులు.

సినీ మీడియా ముసుగులో మాఫియా..

అసలు ఇలాంటి ఎర్నలిస్టుల్ని, సినీ మీడియాలోకి ఎలా రానిస్తున్నారు.? అన్నదీ ఆలోచించాల్సిన విషయమే.

ఆయా మీడియా సంస్థలు, పాత్రికేయమే చేస్తున్నాయా.? పాత్రికేయ వ్యభిచారమే పరమావధిగా పనిచేస్తున్నాయా.? అన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ అయిపోయింది.

ప్రముఖ నటుడు మోహన్‌బాబు కుమార్తె గనుక, మంచు లక్ష్మి పోరాడగలిగింది. అనన్య నాగళ్ళ పోరాడలేకపోయింది.. బహిరంగ క్షమాపణ చెప్పించుకోలేకపోయింది.

స్వాతి రెడ్డి (కలర్స్ స్వాతి) సైతం, ఏమీ చేయలేకపోయింది. నేహా శెట్టి పరిస్థితీ అంతే. సినీ పరిశ్రమ ఇలాంటి విషయాల్లో బాధ్యత తీసుకోవాల్సి వుంది.

You may also like

Leave a Comment

Welcome to Mudra369, your one-stop destination for stories that matter, trends that inspire, and updates that keep you ahead. At Mudra369, we believe in delivering content that informs, entertains, and empowers.

Edtior's Picks

Latest Articles

Website Hosting Sponser

Fully Managed WordPress Hosting

© 2020-25, Mudra369 – All rights reserved. Designed By: KiTek Group