‘గేమ్ ఛేంజర్’.! ఎట్టకేలకు రామ్ చరణ్ పూర్తి చేశాడుగానీ.!

 ‘గేమ్ ఛేంజర్’.! ఎట్టకేలకు రామ్ చరణ్ పూర్తి చేశాడుగానీ.!

Ram Charan Game Changer

Ramcharan Game Changer Release.. ఏడాదికి రెండు మూడు సినిమాలు చేసేందుకు ప్రయత్నిస్తానని చెప్పి, ఏడాదికి ఓ సినిమాని కూడా తీసుకురాలేకపోతున్నారు టాలీవుడ్ స్టార్ హీరోలు.

ఎందుకీ పరిస్థితి.? అంటే, సినిమా రేంజ్ పెరిగిపోయింది గనుక.. ఆచి తూచి సినిమాలు చేయాలన్న కోణంలో, ప్యాన్ ఇండియా మోజులో పడి.. ఏ సినిమా చేయాలో తెలియక తంటాలు పడుతున్నారు.

ఆ హీరో, ఈ హీరో.. అన్న తేడాల్లేవ్.. అందరిదీ అదే పరిస్థితి. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ (Global Star Ram Charan) ఇందుకు అతీతం ఏమీ కాదు.

Ramcharan Game Changer Release.. ఎన్నాళ్ళకెన్నాళ్ళకి..

‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ‘ఆచార్య’ వచ్చిందిగానీ, అది వచ్చి కూడా చాలాకాలమే అయిపోయింది. చరణ్ (Global Star Ram Charan) నుంచి తదుపరి సినిమా ఎప్పుడొస్తుంది.?

శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఎప్పుడో రావాల్సిన సినిమా ఇది. ఇంకా సినిమా షూటింగ్ పూర్తవలేదు.

Ram Charan Game Changer
Ram Charan Game Changer

కాకపోతే, ఎలాగోలా తన పార్ట్ షూటింగ్ కంప్లీట్ చేసుకున్నాడు రామ్ చరణ్. ఇంకో పది పదిహేను రోజుల షూటింగ్ వుంటుందని దర్శకుడు శంకర్. దాంతో, ‘గేమ్ ఛేంజర్’కి సంబంధించి మొత్తం షూట్ పూర్తవుతుందట.

ఈ ఏడాది వచ్చే అవకాశం లేనట్టే..

ఈ ఏడాది ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) వస్తుందా.? అన్న ప్రశ్నకైతే స్ట్రెయిట్‌గా దర్శకుడు శంకర్ (Director Shankar) సమాధానం చెప్పలేకపోయాడు.

Also Read: ‘ఓజీ’ వచ్చేస్తోంది.! డిప్యూటీ సీఎం కళ్యాణ్‌కి కల్ట్ చూపించాలె.!

ఇక, షూటింగ్ పూర్తిచేసుకున్న విషయాన్ని రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) సోషల్ మీడియా వేదికగా వెల్లడించడంతో మరోమారు ‘గేమ్ ఛేంజర్’ హాట్ టాపిక్ అయ్యింది.

ఈ మేనియా ఇలా వుంటుందని తెలిసీ, ‘గేమ్ ఛేంజర్’ (Game Changer) ని ఇంత ఆలస్యం ఎందుకు చేశారో ఏమోనని అభిమానులు గుస్సా అవుతున్నారు.

Digiqole Ad

Related post