Manchu Manoj Chettu Jaathi.. మంచు మనోజ్.. మంచు కుటుంబం నుంచి ఒకింత దూరంగా విసిరి వేయబడ్డాడు.! ఇది ఓపెన్ సీక్రెట్.
‘మంచు’ కుటుంబంలో ఆస్తుల పంచాయితీ గురించి నానా రచ్చా జరుగుతోంది.! మనుషుల్ని పెట్టి కొట్టించుకున్న వ్యవహారాల్ని మీడియా సాక్షిగా చూశాం.
హీరోగా అవకాశాలు తగ్గడంతో, మల్టీ స్టారర్ సినిమాలపైనా.. నెగెటివ్ రోల్స్‌పైనా ఫోకస్ పెట్టాడు మంచు మనోజ్.
‘మిరాయ్’ సినిమాలో మంచు మనోజ్ నెగెటివ్ రోల్ చేసిన సంగతి తెలిసిందే. ‘మిరాయ్’ విడుదలకు సిద్ధమయ్యింది. ఈ సినిమాపై చాలా అంచనాలు పెట్టుకున్నాడు మనోజ్.
Manchu Manoj Chettu Jaathi.. చెట్టు కథేంటి.? జాతి కథేంటి.?
‘మిరాయ్’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో, మంచు మనోజ్ మాట్లాడుతూ, ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశాడు. ‘చెట్టు పేరు చెప్పుకుని.. జాతి పేరు చెప్పుకుని.. ఆ టైప్ కాదు నేను..’ అనేశాడు మనోజ్.
చెట్టు పేరు.. అంటే, ‘మంచు’ పేరు. మరి, ‘జాతి’ పేరు అంటే ఏంటబ్బా.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్‌గా మారిందిప్పుడు.
అవకాశం దొరికితే చాలు, అన్న మంచు విష్ణు మీద మనోజ్ సెటైర్లు వేయడం ఈ మధ్యకాలంలో ఎక్కువైపోయింది. ఆ కోవలోనే తాజాగా ఈ ‘చెట్టు, జాతి’ వ్యాఖ్యల్ని మనోజ్ చేశాడా.?
మంచి నటుడే.. కానీ.!
మొన్నీమధ్యనే ‘భైరవం’ సినిమాలో కనిపించాడు మనోజ్. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, నారా రోహిత్.. ఈ సినిమాలో ఇతర ప్రధాన తారాగణం.
‘భైరవం’ సినిమాలో కూడా నెగెటివ్ షేడ్స్ వున్న పాత్రలోనే మనోజ్ నటించిన సంగతి తెలిసిందే. మంచి నటుడే, కానీ.. ఎందుకో నిలదొక్కుకోలేకపోతున్నాడు.
Also Read: బిగ్ బాస్ తెలుగు ‘రియాల్టీ షో’ తొమ్మిదో సీజన్.. ఈసారైనా.?
‘మంచు’ అనే చెట్టు లేదా జాతి.. ఆ బ్రాండ్ లేకపోయి వుంటే, మనోజ్ పరిస్థితి ఏంటట.? అన్నది ‘మంచు’ అభిమానుల్లో కొందరి సూటి ప్రశ్న.!
వివాదాస్పద వ్యాఖ్యల వల్ల మంచు మనోజ్‌కి అదనంగా ఒరిగేదేమీ వుండదు. కెరీర్ మీద ఫోకస్ పెట్టి, ఒకింత బాధ్యతగా వ్యవహరిస్తే అతనికే మంచిది.
‘మంచు’ కుటుంబంలో గొడవలుంటే, అవి మీడియాకి ఎక్కేదాకా రాకుండా, నాలుగ్గోడల మధ్య చక్కదిద్దుకోవాల్సిన బాధ్యత మోహన్ బాబు మీదనా వుంది.
