అసలేంటి సంగతి.? ఈ ఏడాదైనా వస్తావా పుష్పా.?

Allu Arjun
Pushpa The Rule Postponed.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్, రష్మిక మండన్న జంటగా తెరకెక్కుతున్న ‘పుష్ప 2 ది రూల్’ సినిమా ఎప్పటికి వస్తుందో ఎవరికీ తెలియని పరిస్థితి.
ఆగస్ట్‌లో రావాల్సిన ‘పుష్ప 2 ది రూల్’ సినిమాని తాజాగా, డిసెంబర్ 6వ తేదీకి వాయిదా వేశారు.! ఎందుకిలా.? అసలేం జరుగుతోంది.?
సినిమా అన్నాక వాయిదా తప్పదు.! ఇదీ ఇప్పుడు ప్రముఖంగా సినీ పరిశ్రమలో వినిపిస్తున్న వాదన. ఏమో, పరిశ్రమలో ఏం జరుగుతోందో ఎవరికీ అర్థం కావడంలేదు.
అన్ని సినిమాలదీ అదే పరిస్థితి..
పవన్ కళ్యాణ్ నటిస్తున్న మూడు సినిమాలు ఎప్పటికి పూర్తవుతాయో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ప్రభాస్ నటించిన ‘కల్కి’ ముక్కీ మూలిగీ ఎలాగోలా విడదులవుతోంది.!
ఇక, జూనియర్ ఎన్టీయార్ సినిమా ‘దేవర’ సంగతి దేవుడికే ఎరుక.! రామ్ చరణ్ సినిమా ‘గేమ్ ఛేంజర్’ పరిస్థితి కూడా అంతే. ఇవన్నీ ఎప్పుడో విడుదలవ్వాల్సిన సినిమాలు.

రోజులు మారాయ్.! ఇప్పుడు సినిమాలకి థియేటర్లతో మాత్రమే కాదు, ఓటీటీతోనూ లింకే.! ఓటీటీ సంస్థలకు అనుకూలంగా సినిమాలు రూపొందుతున్నాయ్.!
సో, సినిమాల రిలీజుల్ని కూడా ఓటీటీ సంస్థలు డిసైడ్ చేసే స్థాయికి పరిశ్రమ ఎదిగిందో, దిగజారిందో అర్థం కావడంలేదు.
Pushpa The Rule Postponed.. పుష్ప కష్టాలు అన్నీ ఇన్నీ కావు..
వాస్తవానికి, ‘పుష్ప’ సినిమాని ఒక్క భాగంగానే తీయాలనుకున్నారు. కానీ, దాన్నో సిరీస్‌గా మార్చిపారేశారు.! ఫలితం, ఈ సాగతీత.
‘పుష్ప ది రైజ్’ షూటింగ్ చేస్తున్నప్పుడే, రెండు పార్టులకు సంబంధించి 90 శాతానికి పైగా షూటింగ్ జరిగిపోయిందన్న ప్రచారం జరిగింది. అదే నిజమైతే, ఇప్పుడెందుకు ఇంత డిలే.?
రేంజ్ పెరిగింది కాబట్టి, మార్పులు చేర్పులు జరిగాయి. బడ్జెట్ కూడా పెరిగిపోయింది.! అద్గదీ అసలు సంగతి.! బడ్జెట్ పెరిగింది సరే, బిజినెస్ పరిస్థితేంటి.?
ఇప్పుడెలా.?
బిజినెస్సూ పెరిగింది.. అదీ ప్రీ రిలీజ్ వ్యవహారం.! ఇప్పుడేమో, థియేటర్లలో సినిమాలు ఎక్కువ రోజులు ఆడే పరిస్థితి లేదాయె. అసలంటూ థియేటర్ల వైపు జనం చూడటంలేదాయె.!
Also Read: నివేదా పేతురాజ్.. డిక్కీలో ఏముంది పాపా.?
మరెలా.? ఇదో మిలియన్ డాలర్ క్వశ్చన్.! ఇంతకీ, ఈ ఏడాదిలో ‘పుష్ప 2 ది రూల్’ సినిమాని చూడగలుగుతామా.? ఇప్పటికైతే ఖరారైన డేట్ 6 డిసెంబర్ 2024.
ఏమో, ముందు ముందు ఏం జరుగుతుందో.!
