Manchu Manoj Seggadda.. సీనియర్ నటుడు మోహన్‌బాబు, ఆయన పెద్ద కుమారుడు విష్ణు.. ఈ ఇద్దరితో పోల్చితే, మంచు మనోజ్ కాస్త డిఫరెంట్.!
సోషల్ మీడియాలో మోహన్‌బాబు, విష్ణు.. ఈ ఇద్దర్నీ తరచూ ట్రోల్ చేస్తుంటారు కొందరు. మనోజ్ మీద ట్రోలింగ్ అనేది చాలా చాలా అరుదైన విషయం. పెద్దగా వివాదాల జోలికెళ్ళడు మరి.!
మీడియా మీద సెటైరేస్తే సరిపోతుందా.?
సమాధానం చెప్పలేక, తప్పించుకునే క్రమంలో నోరు జారిన మనోజ్.!
సెగ్గడ్డకి వైద్య చికిత్స అవసరం.! మీడియా గోకితే నయమవుతుందా.?
Mudra369
ఏమయ్యిందో, మంచు మనోజ్ (Manchu Manoj) కూడా వివాదాలతోనే పబ్లిసిటీ పొందాలనే నిర్ణయానికి వచ్చినట్టున్నాడు.
Manchu Manoj Seggadda.. వైరల్ కంటెంట్ ఇచ్చేశాడు.!
వైరల్ కంటెంట్ మీడియాకి ఇస్తే, ఆ తర్వాత విపరీతమైన పబ్లిసిటీ వచ్చేస్తుంటుంది. ఈ కిటుకు తెలుసుకున్నట్టున్నాడు మనోజ్.
ఓ ఆసుపత్రి ప్రారంభోత్సవానికి తన తండ్రి మోహన్‌బాబుతో కలిసి వెళ్ళిన మనోజ్, అక్కడ తనకు మీడియా నుంచి ఎదురైన ప్రశ్నలకు వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు.

‘ఇటీవలి పరిణామాలపై స్పందించండి..’ అని మీడియా అడిగితే, ‘సెగ్గడ్డ వచ్చింది.. ఇదిగో, ఇక్కడ.. గోకండి..’ అంటూ మనోజ్ వెటకారం చేయడం వివాదాస్పదమవుతోంది.
అంతకు ముందు మోహన్‌బాబు, మీడియా అడిగిన ప్రశ్నకు సమాధానమిస్తూ, ‘మీరందరూ నాకు కావాల్సిన వాళ్ళు.. మీ ఇంట్లో మీ భార్యకీ, మీకు వున్న సంబంధమేంటని అడిగితే.?’ అంటూ అర్థం కాని మాట చెప్పేసి వెళ్ళిపోయారు.
Also Read: ‘రావణాసుర’ ఇన్‌సైడ్ రిపోర్ట్.! బాక్సాఫీస్ ‘ధమాకా’యేనా.?
పెద్దాయన మోహన్‌బాబు, ఇంట్లో సమస్యపై ఇంతకన్నా భిన్నంగా ఏం సమాధానం చెబుతారు.?
అసలు ఆ రచ్చకి కారణం మనోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్. విష్ణు, ఓ ఇంట్లోకి చొరబడి గొడవ చేస్తున్న వీడియో. దానిపై స్పందించాల్సిన మనోజ్, ‘సెగ్గడ్డ వచ్చింది.. గోక్కోండి..’ అనడమే హాస్యాస్పదం.
వైరల్ కంటెంట్ కోసం ఎగబడే మీడియా కూడా, ఈ తరహా సందర్భాలపై ఆత్మవిమర్శ చేసుకోవాల్సి వుంది.