Mangalavaaram Payal Rajput.. పాయల్ రాజ్‌పుత్ ప్రధాన పాత్రలో అజయ్ భూపతి తెరకెక్కించిన చిత్రం ‘మంగళవారం’.! త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుందీ సినిమా.
తాజాగా, ‘మంగళవారం’ టీమ్ ఈ సినిమా నుంచి ట్రైలర్ విడుదల చేసింది. చిత్ర నిర్మాతల్లో ఒకరైన స్వాతి రెడ్డి, మెగాస్టార్ చిరంజీవి కుమార్తె శ్రీజకి స్నేహితురాలు.
ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి, ఈ ట్రైలర్‌ని విడుదల చేశారు. సినిమా మంచి విజయాన్ని సాధించాలని ఆకాంక్షించారు.
Mangalavaaram Payal Rajput.. మంగళవారం కథా కమామిషు ఏంటి.?
మంగళవారం వస్తే చాలు.. ఊళ్ళో మరణాలు చోటు చేసుకుంటాయ్.! ఆ మరణాల వెనుక మిస్టరీ ఏంటన్నదే ఈ సినిమా.
కొన్నాళ్ళ క్రితం సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలో నటించిన ‘విరూపాక్ష’ సినిమా వచ్చింది కదా.! దాదాపు ఆ ఫ్లేవర్ ఈ సినిమాలో కనిపిస్తోంది.

అజయ్ భూపతి తెరకెక్కించిన ‘ఆర్ఎక్స్ 100’ సినిమాతోనే పాయల్ రాజ్‌పుత్ తెలుగు తెరకు పరిచయమైన సంగతి తెలిసిందే.!
కాస్తంత బోల్డ్ కంటెంట్.. ఇంకాస్త వైల్డ్ కంటెంట్.. వెరసి, ‘మంగళవారం’ ప్రేక్షకుల్ని మెప్పిస్తుందా.? వేచి చూడాలిక.!
Also Read: శ్రీలీల పెళ్ళి గోల.! ఎలా పుట్టిస్తార్రా ఈ పుకార్లు.?
అన్నట్టు, ఊరంతా మేక వన్నె పులులే.. అంటూ బ్యాక్‌గ్రౌండ్‌లో ఓ వాయిస్ వినిపిస్తోంది ట్రైలర్‌లో.! అంటే, ఊరిని అంతం చేయడానికే ఓ వ్యక్తి లేదా శక్తి కంకణం కట్టుకుందన్నమాట.!
బోల్డన్ని శవాలు తగలబడుతున్న వైనాన్ని కూడా ట్రైలర్‌లో చూపించడం గమనార్హం.