Manjima Mohan..గుర్తుందా.? అదేనండీ, అక్కినేని నాగచైతన్య సరసన ‘సాహసం శ్వాసగా సాగిపో’ అనే సినిమాలో నటించింది కదా.? ఆ మలయాళ ముద్దుగుమ్మే.!
అన్నట్టు, ఈ మలయాళ బ్యూటీ ‘ఎన్టీయార్ కథానాయకుడు’, ‘ఎన్టీయార్ మహానాయకుడు’ సినిమాల్లో కూడా నటించిందండోయ్.!
అసలు విషయమేంటంటే, హీరో గౌతమ్ కార్తీక్‌తో తాను ప్రేమలో పడ్డ విషయాన్ని తాజాగా మంజిమ మోహన్ వెల్లడించింది. అటు గౌతమ్ కార్తీక్ కూడా, తాను అలాగే మంజిమ మోహన్ ప్రేమలో వున్నామంటూ ప్రకటించేశాడు.
Manjima Mohan.. చాలాకాలంగా ప్రేమలో వున్నారుగానీ..
మంజిమ, కార్తీక్.. ఇద్దరూ ప్రేమలో పడి చాలకాలమే అయ్యింది. కాకపోతే, దాన్ని ప్రకటించడానికే కాస్త సమయం తీసుకున్నారు.

బహుశా ఇరు కుటుంబాల్నీ ఒప్పించేందుకే ఈ సమయం తీసుకున్నారేమో.! ప్రేమలో పడ్డారు సరే, పెళ్ళెప్పుడు.? అంటే, ప్రేమను ప్రకటించడానికే చాలా సమయం తీసుకున్నారు కాబట్టి, పెళ్ళి గురించి స్పష్టత రావాలంటే ఇంకా చాలా సమయం పట్టొచ్చు.
సీనియర్ నటుడు కార్తీక్ తనయుడే గౌతమ్ కార్తీక్..
మణిరత్నం తెరకెక్కించిన ‘కడలి’ సినిమాలో నటించాడు గౌతమ్ కార్తీక్. దాంతోపాటు, పలు సినిమాల్లోనూ నటించాడుగానీ, స్టార్‌డమ్ అయితే దక్కించుకోలేకపోయాడు.
Also Read: పిల్లల్ని కనడానికి పెళ్ళితో పనేంటి.?
మొత్తమ్మీద, మంజిమ – గౌతమ్ కార్తీక్‌లకు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖుల నుంచి విషెస్ అందుతున్నాయ్.!
ఇంతకీ, ప్రేమతోనే సరిపెడతారా.? ఈ బంధాన్ని పెళ్ళి పీటలదాకా మంజిమ, గౌతమ్ కార్తీక్ తీసుకెళతారా.? వేచి చూడాల్సిందే.!