Table of Contents
ManOfMasses JrNTR Vs Ramcharan.. యంగ్ టైగర్ ఎన్టీయార్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. ఈ ఇద్దరి మధ్యా ఎలాంటి గొడవలూ లేవు. కానీ, ఈ ఇద్దరు హీరోల అభిమానుల్లో ‘కొందరి’ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది.
‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ ట్యాగ్ చుట్టూ ఆ కొందరు అభిమానుల మధ్య జరుగుతున్న గొడవ రోజు రోజుకీ ముదిరి పాకాన పడుతోంది. ఎవరూ తగ్గడంలేదు.
సమయం.. సందర్భం.. ఇవేవీ అనవసరం.! ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ హ్యాష్ ట్యాగ్‌తో ఇరువురి పేర్లనూ తగిలించి ఆయా హీరోల అభిమానులు సోషల్ మీడియా వేదికగా రచ్చ రచ్చ చేసేస్తున్నారు.
ManOfMasses JrNTR Vs Ramcharan.. బ్రదర్స్ మధ్యన పంచాయితీనా.?
‘మేం బాగానే వుంటాం.. అభిమానులు కూడా అలాగే వుండాలని కోరుకుంటున్నాం..’ అని రామ్ చరణ్ చెప్పినా, ఎన్టీయార్ చెప్పినా.. అభిమానులు మాత్రం తగ్గేదే లే.. అంటున్నారు.

మెగా పవర్ స్టార్ అనే ‘గుర్తింపు’ రామ్ చరణ్‌కి వుంది కదా.? ‘యంగ్ టైగర్’ అనేది ఎన్టీయార్ పేరు ముందర వుంది కదా.? మళ్ళీ ఈ ‘మ్యాన్ ఆఫ్ మాసెస్’ గోలేంటి.?
నిజానికి, ఈ తరహా పంచాయితీ.. ఈ ఇద్దరు హీరోల అభిమానుల మద్యనే వుందనుకుంటే పొరపాటే.
మెగాస్టార్ నుంచి ఉస్తాద్ వరకూ..
‘మెగాస్టార్’ అనే ట్యాగ్‌ని చిరంజీవి నుంచి లాగేసి, కళ్యాణ్ రామ్‌కి తగిలించేయాలని కొందరు ‘బింబిసార’ సమయంలో చాలా చాలా కష్టపడ్డారు. కానీ, కుదరలేదాయె.
ఇక, ‘ఉస్తాద్’ అనేది రామ్ పోతినేని తాలూకు ‘గుర్తింపు’ అంటూ ఇంకొందరు రచ్చకెక్కారు. పవన్ కళ్యాణ్ – రామ్ పోతినేని అభిమానుల మధ్య జరిగిన గొడవ అది.
మ్యాన్ ఆఫ్ మాసెస్.. ఇదేమీ ఆస్కార్ పురస్కారం కాదు. భారత రత్న.. పద్మ పురస్కారాల్లంటిది అసలే కాదు.! అయినా, హీరోలకు లేని నొప్పి.. అభిమానులకేంటి.?
Mudra369
ఒకప్పుడు సుప్రీం హీరో.. ఆ తర్వాత మెగాస్టార్.. ఇదీ చిరంజీవికి అభిమానులిచ్చిన గుర్తింపులు. మహేష్‌బాబుని సూపర్ స్టార్ అంటుంటాం.
స్టైలిష్ స్టార్ కాస్తా ఐకాన్ స్టార్ అయ్యాడోచ్..
స్టైలిష్ స్టార్ అనే ప్రస్తావన తొలుత తెచ్చింది చిరంజీవి. కానీ, దాన్ని కొన్నాళ్ళ క్రితం మార్చేసుకున్నాడు అల్లు అర్జున్. ఐకాన్ స్టార్ అని పెట్టేసుకున్నాడాయన.
Also Read: అన్‌స్టాపబుల్ స్నేహం: బాలయ్య, పవన్.. ఓ ఆత్మీయ బంధం!
దాదాపు ప్రతి హీరోకీ.. ఈ తరహా ఏదో ఒక ‘గుర్తింపు’ని ఆయా హీరో పేరు ముందర తగిలించేయడం అభిమానులకి అలవాటైపోయింది. దాన్ని సినిమా టైటిల్ కార్డ్స్‌లోనూ వేసేస్తున్నారు.
వేస్తే వేసుకున్నారు.. అది నాది.. ఇది నీది.. అని హీరోలైతే కొట్టుకోవట్లేదు కదా.? అభిమానులకెందుకు ఈ అత్యుత్సాహం.? అంటే, అదంతే.!