Table of Contents
Marriage And Divorce.. రెండు మనసులు కలిస్తే, వివాహం.! ఆ రెండు మనస్సులు విడిపోతే, విడాకులు.! జస్ట్ ఇంతే.! ఇంతకంటే సింపుల్‌గా వివాహం, విడాకుల గురించి ఏం చెప్పగలం.?
ఆగండాగండీ, మనసులు మాత్రమే కాదు శరీరాలు కూడా కలవాలి.. అప్పుడే, ఒకర్ని ఒకరు అర్థం చేసుకున్నట్లన్న భావన నేటి యువతరంలో కనిపిస్తోంది.
అదేంటీ, వివాహం అంటే రెండు మనసులతోపాటు, రెండు కుటుంబాలు కూడా కలవాలని పెద్దలు చెబుతుంటారు కదా.! పెద్దల మాట చద్దన్నం మూట.. అనేది ఒకప్పుడు.!
ఇప్పుడైతే, లెక్కలు మారిపోయాయ్.! రెండు మనసులు, రెండు శరీరాలు కలవడానికి.. వివాహ బంధమే అవసరం లేదు.! ఇది నయా ట్రెండ్.!
కలిస్తే వివాహం.. విడిపోవాలంటే విడాకులు..
రెండు మనసులు, రెండు శరీరాలు, రెండు కుటుంబాలు.. ఇవన్నీ చక్కగా కుదిరి, కలిసి.. వివాహం జరిగినా, విడిపోవడానికి పెద్దగా సమయం పట్టడంలేదు.
పెళ్ళయిన గంటల వ్యవధిలోనే విడాకుల గురించి సమాలోచనలు చేస్తున్న జంటలు చాలానే వున్నాయ్ ఈ రోజుల్లో.! ఆర్నెళ్ళు కలిసి కాపురం చేస్తే గొప్ప.! పిల్లలు పుట్టే వరకూ కలిసి వుంటే, అద్భుతమే.
లేటు వయసులో కూడా విడాకులు సర్వసాధారణమైపోయాయ్.! ఆ వయసులో విడిపోయి, కొత్త తోడు వెతుక్కోవడం.. అనేది నయా ఫ్యాషన్.!
ఇప్పుడిదంతా ఎందుకంటే, ప్రముఖ క్రికెటర్ చాహల్ నుంచి, అతని భార్య ధనశ్రీ 60 కోట్ల రూపాయల విలువైన ‘భరణం’ కోరుతోందంటూ పెద్దయెత్తున రచ్చ జరుగుతోంది గనుక.
అంత సీన్ లేదు, అసలు అలాంటి ఆలోచనలు లేవు.. అంటూ, ధనశ్రీ తరఫు నుంచి ఓ ప్రకటన కూడా వచ్చింది. అయినా, గాసిప్స్ ఆగడంలేదు.
Marriage And Divorce.. కట్నం, భరణం.. భయానకం.!
ఈ రోజుల్లో విడాకులనగానే, ముందుగా భరణం ఎంత.? అన్న ప్రశ్న తెరపైకొస్తోంది. గతంలో, వివాహం.. అనగానే, కట్నం గురించిన ప్రస్తావన వచ్చినట్లే ఇది కూడా.!
భరణం లేకుండా, విడాకులు దాదాపు అసాధ్యం. ‘పరస్పర అంగీకారంతో విడాకులు..’ అనే ప్రకటన రావాలంటే, తెరవెనుక స్థాయిని బట్టి లక్షల నుంచి కోట్ల వరకూ.. చెల్లింపులు జరగాల్సిందే.
భరణం.. అంటే, విడాకుల కోసం భర్త నుంచి భార్య డిమాండ్ చేసేది. సో, ఇక్కడ లాభపడేది అమ్మాయిలే, నష్టపడేది అబ్బాయిలే.. అన్న ఆవేదన మగ మహారాజుల్లో కనిపిస్తోంది.
చాహల్, ధనశ్రీ.. ఇద్దరూ ప్రేమించి పెళ్ళి చేసుకున్నారు.. మరి, విడాకులెందుకు.?
పెళ్ళంటే నూరేళ్ళ మంటరా.!
నాన్సెన్స్, విడాకులు తీసుకోవడానికి కూడా కారణాలు కావాలా.? పప్పులో ఉప్పు తక్కువైతే విడాకులే.. అన్నట్లుంటుుంది విడాకుల వ్యవహారం.! అంతలా విడాకులు కామెడీ అయిపోయాయ్.!
అందుకేనే, ఇప్పుడు యువత పెళ్ళి గురించి అంత సీరియస్‌గా ఆలోచించడంలేదు. వాళ్ళ దృష్టిలో వివాహం.. అనేది జస్ట్ ఓ ఈవెంట్ మాత్రమే.
కోట్లు ఖర్చు చేసి వివాహ వేడుకని ప్లాన్ చేయడం, ఆ తర్వాత మొహమాటం లేకుండా, విడాకులకి అప్లయ్ చేయడం.. ఇదీ ఇప్పుడు నడుస్తున్న ట్రెండ్.!
ఈ భరణం అన్న ప్రస్తావన లేకుండా, పెళ్ళి సమయంలోనే ‘ముందస్తు ఒప్పందాలు’ కూడా జరుగుతున్నాయి ఈ మధ్య.! నిజం.. నిజ్జంగా నిజమిది.!
భారతీయ వివాహ వ్యవస్థకు ప్రపంచ వ్యాప్తంగా ఓ గొప్ప గుర్తింపు, గౌరవం వున్నాయి. కానీ, క్రమంగా భారతీయ వివాహ వ్యవస్థ.. అనేది, తన వెలుగును కోల్పోతోంది.
ఔను, విడాకులెందుకు.? అన్న ప్రశ్న కంటే ముందు.. అసలు పెళ్ళెందుకు.? అన్న ఆలోచన నేటి యువతరంలో పెరుగుతోంది.!