Megastar Chiranjeevi Big Brother మెగాస్టార్ చిరంజీవి.. వయసు మీద పడిందిగానీ, ఎలా మాట్లాడాలో మాత్రం ఆయనకు తెలియడంలేదు.!
ఒక్క పని చేస్తే మంచిది.! ఇకపై చిరంజీవి సినిమాలు చేయడం మానెయ్యాలి. దాంతోపాటుగా, చిరంజీవి మాట్లాడటం కూడా మానెయ్యాలి.!
ఔను, కొందరు ఇదే కోరుకుంటున్నారు.! మెగాస్టార్ చిరంజీవి ఏదన్నా సినిమాలో నటిస్తే ఏడుపు.. ఆయన ఏదన్నా వేదికపై నాలుగు మంచి మాటలు చెబితే ఏడుపు.!
Megastar Chiranjeevi Big Brother చిరంజీవి వల్ల నష్టం ఎవరికి.?
‘ఆచార్య’ సినిమా నష్టాలు తెచ్చింది. కానీ, మెగాస్టార్ చిరంజీవి ఆ ఒక్క సినిమానే చెయ్యలేదు. నూట యాభైకి పైగా సినిమాల్లో నటించారాయన.. నటిస్తూనే వున్నారాయన.
తెలుగు సినిమా బాక్సాఫీస్‌కి కొత్త నిర్వచనం చెప్పిన మెగాస్టారుడు చిరంజీవి. ఇప్పుడు కొందరు కుర్ర కుంకలు ‘స్టార్‌డమ్’ అని విర్రవీగుతున్నారు.. దానికి ఆద్యుడే మెగాస్టార్ చిరంజీవి.
ఎంత ఎదిగినా ఒదిగి వుండడం చిరంజీవి నైజం. అదే ఆయన వ్యక్తిత్వం. ‘చిరంజీవి ఇంటికొచ్చి కడుపు నిండా తిని.. ఆ తర్వత ఆ ఇంటి మీదే రాళ్ళేసినా’ చిరంజీవి తట్టుకుని నిలబడగలరు.
పెద్దోడని ఎవరన్నారు.? ఎప్పటికీ చిరంజీవే.!
చిరంజీవిని పరిశ్రమ పెద్దగా కొందరు చూస్తున్నారు. కొందరికి అది ఇష్టం లేదు. ‘నేనేమీ పరిశ్రమ పెద్దని కాదు. పరిశ్రమలో నేనూ ఒకడ్ని.. నాకు చేతనైనంత సాయం ఆపదలో వున్నవారికి చేస్తాను’ అంటారాయన.
పరిశ్రమ పెద్దరికాన్ని చిరంజీవి వదులుకున్నారు. కానీ, ఆ పెద్దరికాన్ని చిరంజీవికి ఇచ్చి, ఆ పెద్ద మనసుని గౌరవించేవాళ్ళెందరో వున్నారు.

‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవి, రవితేజ కలిసి నటించారు. చిరంజీవి ముందర రవితేజ చిన్నోడే కదా.. వయసులో అయినా, స్టార్‌డమ్‌లో అయినా.!
Also Read: పవనేశ్వరా.! ఇదీ అన్‌స్టాపబుల్ ‘పవర్’ అంటే.!
‘చిన్న హీరో’ అన్న మాట రవితేజని ఉద్దేశించి నోట వచ్చిందట. అంతే, పిచ్చిక్కిపోయినట్లు వెకిలి రాతలు రాసేశారు.
‘అన్నయ్యా..’ అని అభిమానంగా చిరంజీవిని పిలిచే రవితేజకీ, ‘నా తమ్ముడు పవన్ కళ్యాణ్ లాంటోడే..’ అని రవితేజని ఉద్దేశించి చెప్పే చిరంజీవికీ లేని ‘పెద్దా చిన్నా’ బాధ, సోకాల్డ్ లఫూట్ గాళ్ళకెందుకు.?