Mass Jathara No Sense.. ఎవరన్నా తిడతారేమోనని కంగారు పడి, తమని తామే తిట్టేసుకుంటే ఎలా వుంటుంది.? ‘మాస్ జాతర’ టీమ్ వ్యవహారం కూడా అలానే వుంది.!
మొన్నామధ్యన ఓ పాటొచ్చింది.. దాదాపు బూతులే, ఆ పాటలో వున్నాయ్.! జనం నానా రకాలుగా తిట్టుకున్నారు ఆ పాటని.! ఇప్పుడే, ఇంకో పాట వచ్చింది.
‘సూపర్ డూపర్’ అంటూ సాగే పాట ఇది. రవితేజ, శ్రీలీల.. చాలా ఎనర్జీతో డాన్స్ చేసేశామని అనుకున్నట్టున్నారు.. పాటలో, రొట్ట కొట్టుడు స్టెప్పులు మామూలే.!
Mass Jathara No Sense.. సెన్సూ.. కామన్ సెన్సూ.. లేనే లేవట.!
శేఖర్ కొరియోగ్రఫీ.. రవితేజ పాట, శ్రీలీల పక్కనుంటే.. ఆ రొట్ట కొట్టుడు అలాగే వుంటుంది.! ‘ధమాకా’ తర్వాత శ్రీలీల, రవితేజ నుంచి వస్తోన్న ఇంకో సినిమా ‘మాస్ జాతర’.!
ఈ సినిమాకి టైటిల్ కూడా రవితేజ పెట్టేసుకున్నాడట. అలాగని, ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చారు సుమీ.!
ఇక, ‘సూపర్ డూపర్’ పాట విషయానికొస్తే, ‘సెన్సు లేదు.. కామన్ సెన్సు లేదు..’ అంటూ ఇందులోని లిరిక్స్‌లో రాసుకొచ్చారు. అసలు లిరిసిస్ట్ లేడు, కొరియోగ్రాఫర్ లేడు.. అని కూడా పేర్కొన్నారు.
హీరో హీరోయిన్.. డాన్సులేస్తూ, పై డైలాగుల్ని పాడేసుకున్నారుగానీ.. పాటకి కొరియోగ్రాఫర్ వున్నాడు, లిరిసిస్ట్ కూడా వున్నాడు.!
ముందు ముందు, సినిమా పాటలకి లిరిసిస్ట్ అవసరం లేదు.. నోటికొచ్చిన పదాలు రాసేసుకుని, అదే పాట.. అంటే సరిపోద్ది.! ‘మాస్ జాతర’లోని ‘సూపర్ డూపర్’ పాట ఇస్తున్న సందేశమిదే.!
ప్రమోషన్స్ కూడా చేయాల్సిన పనిలేదట.. మౌత్ టాక్‌తో సూపర్ హిట్ అయిపోతుందట.. అలాగని, లిరిక్స్‌లో ప్రస్తావించారు.
Also Read: సన్ గ్లాసెస్ వాడుతున్నారా? మీరివి తప్పకుండా తెలుసుకోవాల్సిందే!
కట్ చేస్తే, సినిమా ప్రమోషన్స్ కోసం బోల్డంత ఖర్చు చేయాల్సి వస్తోంది.! ఏంటో, ఈ సినీ మాయ.!
బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తర్వాత రవితేజ నుంచి వస్తున్న సినిమా ఇది. సేమ్ టు సేమ్ హీరోయిన్ శ్రీలీల పరిస్థితి కూడా అదే.!
నిర్మాత నాగవంశీ గురించి ప్రత్యేకంగా చెప్పాలా.?
