Meenakshi Chaudhary Maheshbabu.. ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ మీనాక్షి చౌదరి.
సుశాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమాలో మీనాక్షి (Meenakshi Chaudhary)అప్పియరెన్స్‌కి యూత్ ఫిదా అయిన సంగతి తెలిసిందే.
అందాల పోటీ నుంచి వచ్చి, వెండి తెరకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ, తనదైన గ్లామర్, యాక్టింగ్ టాలెంట్‌తో మేకర్లను బాగానే ఎట్రాక్ట్ చేసిందనుకోండి.
Meenakshi Chaudhary Maheshbabu.. ఘాటైన గ్లామర్ ‘కారం’.!
‘ఖిలాడీ’ సినిమాతో మీనాక్షి చౌదరికి మంచి పేరొచ్చింది. యాక్టింగ్‌తో పాటూ, గ్లామర్‌లోనూ ఎలాంటి మొహమాటాల్లేకపోవడంతో, టాలీవుడ్‌లో బాగానే పాతుకుపోయేలా కనిపిస్తోంది మీనాక్షి.

అయినా ఏమాత్రం తొందరపడకుండా, ఆచి తూచి అడుగులు వేస్తోంది. ఈ క్రమంలోనే ఓ బంపర్ ఛాన్స్ కొట్టేసింది మీనాక్షి చౌదరి (Meenakshi Chaudhary).
అదే ‘గుంటూరు కారం’. ఇంతవరకూ చేసినవి తక్కువ సినిమాలే అయినా, ఇంత త్వరగా మహేష్ బాబు సినిమాలో చాన్స్ అంటే, మీనాక్షి లక్కు మామూలుగా లేదనే చెప్పొచ్చు.
తన లక్కీ ఛామ్ అయిన పూజా హెగ్ధేని హీరోయిన్‌గా కన్‌ఫామ్ చేసుకున్నాకే త్రివిక్రమ్ ఈ సినిమాని పట్టాలెక్కించారు. అనుకోని కారణాలతో పూజా హెగ్ధే తప్పుకోవడంతో పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయ్.
ఎందుకో ఈ సైలెన్స్ ‘కారం’.!
అందులో మీనాక్షి చౌదరి పేరు కూడా వుంది. అయితే, ఇంతవరకూ చిత్ర యూనిట్ ఆ విషయాన్ని కన్‌ఫామ్ చేయలేదు. మీనాక్షి విషయం సీక్రెట్‌గా వుంచి సైలెంట్‌గా షూటింగ్ కానిచ్చేస్తున్నారు.
తాజాగా ఓ సినిమా ప్రమోషన్‌లో భాగంగా ‘‘గుంటూరు కారం’ సినిమాలో నటిస్తున్నాను.. నా ఫస్ట్ షూట్ మహేష్‌తోనే ఫ్యాన్స్‌తో పాటూ నేనూ ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్నా ఈ సినిమా కోసం..’ అని చెప్పేసింది.

టంగ్ స్లిప్ అయ్యిందో.. లేక కావాలనే లీక్ చేసిందో ఏమో తెలీదు కానీ, మొత్తానికి మీనాక్షి (Meenakshi Chaudhary) కన్‌ఫామ్ చేసేసింది.
ఈ సినిమాలో ఆల్రెడీ శ్రీలీల (Sree Leela) హీరోయిన్‌గా నటిస్తోంది. శ్రీలీలను మొదట, సెకండ్ హీరోయిన్‌గా తీసుకున్న సంగతి తెలిసిందే.
పూజా హెగ్ధే తప్పుకున్నాకా, ఆ ప్లేస్‌లో సంయుక్తను అనుకున్నారు. ఆ తర్వాత మీనాక్షి పేరు వినిపించింది. ఇంతవరకూ కన్‌ఫామేషన్ లేదు కానీ, తాజాగా మీనాక్షి కన్‌ఫామ్ చేసేసింది.
Also Read: Krithi Shetty.. గేర్ మార్చింది! బేబమ్మ టాలెంట్ చూపించేస్తోంది!
మెయిన్ లీడ్ హీరోయిన్ చాన్స్ ఎవరికి దక్కుతుందన్న అంశంపై సస్పెన్స్ ఇంకా అలాగే కొనసాగుతోంది. ఏది ఏమైతేనేం, ‘గుంటూరు కారం’లో గ్లామర్ ఘాటు నెక్స్‌ట్ లెవల్‌లో వుండబోతోందనయితే తెలుస్తోంది.