Vijay Antony Daughter.. ఔను, ఏ తండ్రికీ రాకూడని కష్టమిది. సంగీత దర్శకుడు, నటుడు, నిర్మాత.. ఒక్కమాటలో చెప్పాలంటే బహుముఖ ప్రజ్ఞాశాలి అతడు.! అతనికి రాకూడని కష్టం వచ్చి పడింది.
అల్లారు ముద్దుగా పెంచుకున్న కుమార్తె, అకాల మరణం చెందితే.. ఆ తండ్రి గుండె బద్దలైపోకుండా వుంటుందా.?
విజయ్ ఆంటోనీ.. పరిచయం అక్కర్లేని పేరిది. అంతకు ముందు వరకూ అతను కేవలం సంగీత దర్శకుడు మాత్రమే. ‘బిచ్చగాడు’ సినిమాతో స్టార్ హీరో అయిపోయాడు.
సినిమాలు, సామాజిక సేవా కార్యక్రమాలు.. వీటి ద్వారా విజయ్ ఆంటోనీ మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నాడు.
Vijay Antony Daughter.. అందమైన కుటుంబంలో.. అంతులేని విషాదం..
అందమైన కుటుంబం.. అని విజయ్ ఆంటోనీ కుటుంబం గురించి అందరూ చెబుతుంటారు. అలాంటిది, ఆ కుటుంబం మీద ఏ పాపిష్టి కళ్ళు పడ్డాయో.. ఇప్పడా కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది.
విజయ్ ఆంటోనీ కుమార్తె అకాల మరణం చెందింది. బలవన్మరణానికి పాల్పడిందామె. ఆమె వయసు కేవలం 16 సంవత్సరాలు మాత్రమే.

మానసిక ఒత్తిడి నేపథ్యంలోనే విజయ్ ఆంటోనీ కుమార్తె బలవన్మరణానికి పాల్పడినట్లు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది.
ఇటీవల ఓ సందర్భంలో, ఎలాంటి సమస్య వచ్చినా ధైర్యం కోల్పోకూడదు.. ‘యువత – బలవన్మరణాలు’ అంశంపై మాట్లాడాడు విజయ్ ఆంటోనీ.
Also Read: ఎలుకాయ నమః బతికేద్దాం ఇంకొన్నేళ్ళు నిస్సిగ్గుగా.!
ఇంతలోనే, ఆయన కుటుంబంలోనే.. ఆయన కుమార్తె బలవన్మరణానికి పాల్పడింది. ఆ చిట్టి తల్లికి ఎంత కష్టమొచ్చిందో.! ఆమె, తన కుటుంబానికి మిగిల్చిన శోకం.. వర్ణనాతీతం.!
విజయ్ ఆంటోనీ తండ్రి కూడా బలవన్మరణానికి పాల్పడ్డారు.. అదీ విజయ్ ఆంటోనీ ఏడేళ్ళ పిల్లవాడిగా వున్నప్పుడే.!