Table of Contents
Meenakshi Chaudhary New Luck.. ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ అనే ఓ చిన్న సినిమాతో హీరోయిన్‌గా తెలుగు తెరకు పరిచయమైన హర్యానా బ్యూటీ మీనాక్షి చౌదరి.
తొలి సినిమాతోనే తాను సమ్‌థింగ్ స్పెషల్ అనిపించుకుంది ఈ అందాల భామ.
అప్పుడు అనుకుని వుండదు సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన తాను హీరోయిన్‌గా నటిస్తానని. సుశాంత్ హీరోగా తెరకెక్కిన ‘ఇచ్చట వాహనాలు నిలపరాదు’ సినిమా మీనాక్షిని నటిగా బాగానే ప్రమోట్ చేసింది.
అందాల పోటీ నుంచి వచ్చిన మీనాక్షికి మంచి ఒడ్డూ పొడుగూ, అందంతో పాటూ యాక్టింగ్ టాలెంట్ కూడా వుండడంతో ఇండస్ట్రీలో బాగానే నిలదొక్కుకుంది.
అసలు సిసలు టర్నింగ్ అదే.!
డెబ్యూ మూవీ తర్వాత ‘హిట్ ది సెకండ్ కేస్’, రవితేజతో ‘ఖిలాడీ’ సినిమాలు మీనాక్షికి మంచి పేరు తెచ్చిపెట్టాయ్.
సడెన్‌గా సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన ‘గుంటూరు కారం’ సినిమాలో ఛాన్స్ దక్కడంతో అమ్మడి కెరీర్ టర్న్ తీసుకుంది.
ఇప్పుడు తెలుగుతో పాటూ తమిళంలోనూ దూసుకెళ్తోంది. అక్కడా ఇక్కడా సమాంతరంగా అవకాశాలు దక్కించుకుంటోంది.
అది కూడా స్టార్ ఛాన్సులే కావడం విశేషం. ఈ ఏడాది వరుస తెలుగు సినిమాలతో పాటూ, తమిళంలో స్టార్ హీరో విజయ్ సరసన ‘గోట్ (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) సినిమాలో నటించింది మీనాక్షి.

అలాగే మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ తెలుగులో నటించిన ‘లక్కీ భాస్కర్’ సినిమాలోనూ మీనాక్షి చౌదరినే హీరోయిన్. ఈ సినిమాలో సుమతిగా మంచి స్కోప్ వున్న పాత్ర దక్కింది మీనాక్షికి.
అన్నట్లు ‘మట్కా’ కోసం వరుణ్ తేజ్‌తో నటించి మెగా కాంపౌండ్‌నీ టచ్ చేసిందీ అందాల భామ. ఇదే టైమ్‌లో బ్యాక్ టు బ్యాక్ మీనాక్షి నుంచి వరుసగా సినిమాలు రావడం విశేషం.
ఓ వైపు విజయ్, దుల్కర్ సల్మాన్, వరుణ్ తేజ్ ఇలా స్టార్ హీరోలతో పాటూ, ఓ మోస్తరు స్టార్ హీరో అయిన విశ్వక్ సేన్‌తోనూ నటించి మెప్పించింది. అదే ‘మెకానిక్ రాఖీ’. ఓటీటీలో మంచి ఆదరణ దక్కించుకుందీ సినిమా.
Meenakshi Chaudhary New Luck.. ఆ ఒక్క తప్పూ చేయకుండా వుండాల్సింది కానీ.!
వీటిలో ఏ ఒక్క సినిమా కూడా ఫెయిల్యూర్ టాక్ తెచ్చుకోకపోవడం మీనాక్షికి కలిసొచ్చే అంశమే. అయితే, ఆమె కెరీర్‌లో ఈ ఏడాది ఒకే ఒక్క ఫ్లా అని చెప్పొచ్చు.
అదేనండీ ‘గుంటూరు కారం’. నిజానికి మహేష్ వంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ రావడం చాలా గొప్ప విషయమే. కానీ, ఈ సినిమాలో మీనాక్షి పాత్ర పూర్తిగా విమర్శల పాలైంది.

కానీ, ఆ సినిమాతోనే మీనాక్షి కెరీర్ టర్న్ అయ్యింది కూడా. అలా ఈ ఏడాది వరుస సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకుల్లో చెరగని ముద్రే వేసుకున్న మీనాక్షి చౌదరి కొత్త సంవత్సరంలోనూ బోనీ కొట్టబోతోంది.
వెంకటేష్ హీరోగా సంక్రాంతికి వస్తున్న అసలు సిసలు సంక్రాంతి సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’లోనూ మీనాక్షి చౌదరినే హీరోయిన్ కావడం విశేషం.
సీనియర్, జూనియర్.. నాకలాంటి బేధాల్లేవ్.!
ఇలా అంది వచ్చిన ప్రతీ అవకాశాన్నీ సద్వినియోగం చేసుకుంటూ తన డైరీని ఫుల్ ఫిల్ చేసుకుంటోంది మీనాక్షి చౌదరి.
ఇక్కడ గమనించాల్సిందేమంటే, అటు విజయ్, ఇటు విక్టరీ వెంకటేష్ ఇలా సీనియర్ హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంటూనే విశ్వక్ సేన్, నవీన్ పోలిశెట్టి వంటి చిన్న హీరోల సినిమాలకీ మీనాక్షి సై సై అంటోంది.
నవీన్ పోలిశెట్టితో ‘అనగనగా ఒక రాజు’ అనే డిఫరెంట్ కామెడీ జోనర్ మూవీలో మీనాక్షి చౌదరి నటిస్తోంది. ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టితో బ్యూటిఫుల్ రొమాంటిక్ మూడ్‌లో వున్న పోస్టర్ ఒకటి ఇటీవల ట్రెండ్ అయ్యింది.
