రాజమౌళీ.! మీ నాన్నని అదుపులో పెట్టుకో.!

 రాజమౌళీ.! మీ నాన్నని అదుపులో పెట్టుకో.!

RRR Ramarao Rajamouli RamCharan Oscars

Rajamouli Control Vijayendra Prasad.. రామ్ చరణ్ నటుడిగా ఎంత ఎత్తు ఎదిగినా, ‘గ్లోబల్ స్టార్’ అనే గుర్తింపు పొందినా, ఆయన మెగాస్టార్ చిరంజీవి తయుడే.!

‘తండ్రికి తగ్గ తనయుడు’ అన్న గుర్తింపుని ఏ కొడుకు అయినా కోరుకుంటాడు. ‘తండ్రిని మించిన తనయుడు’ అవ్వాలని ఏ తండ్రి అయినా, తన కొడుకు గురించి కోరుకుంటాడు.!

విజయేంద్ర ప్రసాద్, రాజమౌళి కూడా అంతే.! విజయేంద్ర ప్రసాద్ కొడుకు రాజమౌళి.! రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్.!

Rajamouli Control Vijayendra Prasad.. తండ్రీ కొడుకుల మధ్య యెల్లో చిచ్చు.!

రాజమౌళి సినిమాలకి విజయేంద్ర ప్రసాద్ అందించే కథే ప్రాణం.! పాత్రల్ని డిజైన్ చేసేది విజయేంద్ర ప్రసాద్.! దర్శకుడిగా రాజమౌళి, ఆయా పాత్రల్ని మరింత గొప్పగా తీర్చిదిద్దొచ్చుగాక.!

‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో హీరో రామ్ చరణ్ అయితే, సపోర్టింగ్ రోల్ చేసింది జూనియర్ ఎన్టీయార్.. అట.! అలాగని, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా చూసిన సాధారణ ప్రేక్షకులు ఎవరైనా అనుకున్నారా.?

Vijayendra Prasad
Vijayendra Prasad

‘నా అన్న రామ్ చరణ్’ అని జూనియర్ ఎన్టీయార్ ఎంతో గొప్పగా చెప్పుకున్నాడు. ఎన్టీయార్ నటనా ప్రతిభ గురించి రామ్ చరణ్ పలు సందర్భాల్లో చెప్పాడు.

‘ఆ ఇద్దరూ నాకు రెండు కళ్ళు..’ అని రాజమౌళి చాలా సందర్భాల్లో రామ్ చరణ్, ఎన్టీయార్ గురించి చెప్పడం చూశాం.

కానీ, ‘ఆర్ఆర్ఆర్’ విడుదలవుతూనే, ఎన్టీయార్ అభిమానుల ముసుగులో ఓ వర్గం, ‘రాజమౌళి మోసం చేశాడు. ఎన్టీయార్‌కి సైడ్ యాక్టర్ రోల్ ఇచ్చాడు..’ అంటూ మొరగడం మొదలు పెట్టారు. అది ఇప్పటికీ కొనసాగుతూనే వుంది.

ఇద్దరూ ఇద్దరే..

‘జూనియర్ ఎన్టీయార్ పాత్ర చాలా చాలా గొప్పది. చాలా కష్టతరమైనది..’ అని విజయేంద్ర ప్రసాద్ చెప్పిన మాటల్ని కట్ చేసేశారు కన్వీయెంట్‌గా కొందరు.

వాళ్ళే, ‘రామ్ చరణ్ పాత్రలో చాలా వేరియేషన్స్ వుంటాయ్.. ఆ పాత్రకి ఎన్టీయార్ పాత్ర సపోర్టింగ్ క్యారెక్టర్..’ అని చెప్పిన మాటల్నే కొందరు సర్క్యులేట్ చేస్తున్నారు.

Jr NTR Ram Charan RRR
Jr NTR Ram Charan RRR

ఇంకేముంది, ఓ వర్గం మీడియా రెచ్చిపోతోంది. ‘రాజమౌళి మీ నాన్నని అదుపులో పెట్టుకో. మీడియా నుంచి దూరంగా వుంచు..’ అంటూ అల్టిమేటం జారీ చేస్తోంది.

అది కూడా తెగులు మీడియా.! తెగులు సినీ మీడియా.! ఇంత తెగులు పట్టిన తెంపరితనం.. ఇటీవలి కాలంలో ఎప్పుడూ చూసి వుండమేమో.!

పాత్రల గురించే మాట్లాడిన కథకుడు..

ఓ కథకుడిగా, విజయేంద్ర ప్రసాద్ తన కలం నుంచి జాలువారిన సినిమాలోని పాత్రల గురించి మాత్రమే మాట్లాడారు.

తండ్రికి ఇచ్చిన మాట నిలబెట్టుకునే దేశ భక్తుడి పాత్ర రామ్ చరణ్‌ది. తమ సమూహంలోని ఓ చిన్నారిని, బ్రిటిష్ మూకలు ఎత్తుకెళితే, ఆమెను కాపాడే పాత్ర ఎన్టీయార్‌ది.

Ram Charan Jr NTR RRR Friendship
Ram Charan Jr NTR RRR Friendship

దేశ భక్తుడి ధీరత్వానికి.. ఆదివాసీ తెగువ తోడైతే.. ఇదీ, ‘ఆర్ఆర్ఆర్’ సినిమా కథ.! అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్.. వంటి పోరాట యోధుల స్ఫూర్తితో ఆ పాత్రల్ని అత్యద్భుతంగా మలిచాడు దర్శకుడు తెరపై.

ఆ పాత్రల్ని సృష్టించిన విజయేంద్ర ప్రసాద్‌కి రెండు పాత్రలూ సమానమేనని తెలియదా.? ఆయా పాత్రల్లో ఒదిగిపోయిన రామ్ చరణ్, ఎన్టీయార్‌లకి తెలియదా.?

Rajamouli Control Vijayendra Prasad.. ఆయనేమీ చిన్నపిల్లాడు కాదు..

విజయేంద్ర ప్రసాద్ ఏమీ చిన్నపిల్లాడు కాదు.! రాజ్యసభ సభ్యుడు కూడా.! ఎన్నో విజయవంతమైన చిత్రాలకు కథల్ని అందించాడాయన.

అలాంటి విజయేంద్ర ప్రసాద్‌ని అదుపులో పెట్టుకోమని రాజమౌళికి ఉచిత సలహాలు ఇచ్చే స్థాయికి తెగులు సినీ మీడియా దిగజారిపోయిందంటే, అంతకన్నా హాస్యాస్పదం ఇంకేముంటుంది.? నవ్విపోదురుగాక వాళ్ళకేటి సిగ్గు.?

పైగా, ఇదంతా కుల జాడ్యంతో కొట్టుమిట్టాడుతోన్న ఓ వర్గం చేస్తున్న అతి.! ఆ ‘కమ్మ’టి కుల మీడియా పైత్యానికి విరుగుడు ఎలా.? కుక్క కాటుకి చెప్పు దెబ్బ కొట్టేది ఎలా.?

Digiqole Ad

Related post