Meera Chopra Safed.. మీరా చోప్రా గుర్తుందా.? అదేనండీ, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన ‘బంగారం’ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించింది కదా.?
నిజానికి, ‘బంగారం’ (Bangaram Movie) సినిమాలో హీరోయిన్ వుండదు. చివర్లో, పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan)కి జోడీగా కనిపిస్తుంది త్రిష.. అదీ జస్ట్, కొన్ని సెకెన్ల పాటు తెరపై కనిపిస్తుందంతే.
ఆ సినిమాలో మీరా చోప్రా (Meera Chopra) కీలక పాత్రలో కనిపించింది. నితిన్ హీరోగా నటించిన మరో సినిమాలోనూ మీరా చోప్రా నటించింది.
ప్చ్.. బ్యాక్ టు బ్యాక్ డిజాస్టర్ల నేపథ్యంలో మళ్ళీ తెలుగు తెరపై మీరా చోప్రా కనిపించలేదు. నితిన్ సినిమా విషయంలో నిర్మాతల్ని ఇబ్బంది పెట్టిందంటూ మీరా చోప్రాపై బోల్డన్ని గాసిప్స్ వచ్చాయి.
Meera Chopra Safed.. ఈ సారి సరికొత్తగా..
అసలు విషయానికొస్తే, తాజాగా ‘సఫేద్’ అనే సినిమాలో నటించింది మీరా చోప్రా. ఆ సినిమాలో ఇదిగో, ఇలా విభిన్నమైన పాత్రలో దర్శనమిచ్చింది మీరా చోప్రా.
అన్నట్టు, మీరా చోప్రా పలు పేర్లతో సౌత్‌లో కొన్ని సినిమాలు చేసింది. కానీ, చివరికి ‘మీరా చోప్రా’ అనే పేరునే ఫిక్స్ అయిపోయింది.

సినిమా కెరీర్‌లో అయినా, రియల్ లైఫ్‌లో అయినా.. తాను డైనమిక్ అనీ, ఆ డైనమిజం నచ్చక కొందరు అవకాశాలు ఇవ్వకపోయి వుండొచ్చని ఓ ఇంటర్వ్యూలో సెలవిచ్చిందీ బ్యూటీ.!
నటిగా విభిన్నమైన పాత్రల్ని ఎంచుకుంటున్న తాను, విమర్శకుల ప్రశంసలు తన చిత్రాలకు దక్కుతుండడాన్ని ఎంజాయ్ చేస్తున్నానని చెబుతోంది.
Also Read: సమంత ‘TRALALA’ ప్రయాణం! సొంత కుంపటి.. కాస్త భిన్నంగా!
ఇక, ‘బంగారం’ సినిమాలో క్యూట్ అండ్ లవ్లీగా కనిపించిన మీరా చోప్రాని, ‘సఫేద్’ సినిమా పోస్టర్స్‌లో చూసి, ‘బంగారం లాంటి హీరోయిన్ ఇలా అయిపోయిందేంటి.?’ అని తెలుగు సినీ అభిమానులు ముక్కున వేలేసుకుంటున్నారు.
విధవ పాత్రలో నటించింది ‘సఫేద్’ సినిమా కోసం మీరా చోప్రా.!