Meera Jasmine Test.. ‘చిట్టి నడుమునే చూస్తున్నా.. చిత్ర హింసలు ఛస్తున్నా..’ అంటూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో తెగ పొగిడించేసుకున్న ముద్దుగుమ్మ మీరా జాస్మిన్ గుర్తుంది కదా.
‘గుడుంబా శంకర్’ సినిమాలో పవన్ సరసన హీరోయిన్‌గా నటించిందీ అందాల బొమ్మ. అంతకు ముందే, ‘భద్ర’ సినిమాతో హీరోయిన్‌గా తెలుగు సినిమాకి పరిచయమైంది.
పవన్ కళ్యాణ్, బాలయ్య వంటి స్టార్ హీరోలతో స్ర్కీన్ షేర్ చేసుకున్న మీరా జాస్మిన్.. ఎక్కువ కాలం తెలుగులో హీరోయిన్‌గా కొనసాగలేదు.
Meera Jasmine Test.. జస్ట్ చిన్న బ్రేక్ త్వరలోనే వచ్చేస్తా.!
కానీ, ఓ మోస్తరు స్టార్‌డమ్‌తో సైడ్ అయిపోయింది. అప్పట్లో మీరా జాస్మిన్ (Meera Jasmine) ఓ సెన్సేషనే అని చెప్పొచ్చేమో. పెళ్లి చేసుకుని ఫ్యామిలీతో విదేశాల్లో సెటిలైపోయింది. అలా యాక్టింగ్‌కి దూరమైపోయింది.
అడపా దడపా ఇతర భాషా సినిమాల్లో గెస్ట్ రోల్స్‌తో మెప్పించింది కానీ, తెలుగులో ఎక్కడా కనిపించింది లేదీ అమ్మడు.

అయితే, ఈ మధ్య సోషల్ మీడియాలో మీరా జాస్మిన్ హల్‌చల్ మామూలుగా లేదు. స్టార్ హీరోయిన్‌గా వెలిగినప్పుడు కూడా చేయలేనంత గ్లామర్ దాడితో పిచ్చెక్కించేస్తోంది.
రకరకాల హాట్ పోజులతో ఫోటో షూట్లు చేయించుకుంటూ సోషల్ మీడియాని హీటెక్కించేస్తోంది. ఈ హంగామా చూసి, పాప మళ్లీ సినిమాల్లోకి వచ్చే ప్రయత్నాలు చేస్తోందని అనుకున్నారంతా.
ప్యాన్ ఇండియా రీ ఎంట్రీ.!
అవును నిజమే.! మీరా జాస్మిన్ (Meera Jasmine) రీ ఎంట్రీ షురూ చేసింది. ఓ ప్యాన్ ఇండియా మూవీలో మీరా జాస్మిన్ నటిస్తోంది. ఆ సినిమా పేరే ‘టెస్ట్ (Test)’.
తమిళ హీరో మాధవన్ లీడ్ రోల్ పోషిస్తున్న ఈ సినిమాలో సిద్దార్ధ్, నయనతార ఇంపార్టెంట్ రోల్స్ పోషిస్తున్నారు. ఇదే సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ కోసం మీరా జాస్మిన్ ఎంపికైందట.
Also Read: Anasuya Bharadwaj: అనసూయ ముద్దు.! దాటేసిందా హద్దు.?
చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని ప్రకటించింది. ఇంకేముంది.! రీ ఎంట్రీ అయితే షురూ అయ్యిందిగా.! ఇకపై మీరా జాస్మిన్‌ని టాలీవుడ్‌లోనూ చూసే అవకాశాలు కనిపిస్తున్నాయ్.
అన్నట్లు ఆల్రెడీ మీరా జాస్మిన్ ఓ టాలీవుడ్ సినిమాలో నటించేసిందండోయ్. ఆ సినిమా పేరే ‘విమానం’. అయితే, ఈ సినిమాలో మీరా జాస్మిన్ చాలా తక్కువ నిడివి వున్న పాత్రలోనే కనిపించనుంది.

అదీ ఓ ఎయిర్ హోస్టెస్ పాత్ర అని తెలుస్తోంది ఈ సినిమాలో. తమిళ నటుడు సముద్ర ఖని ప్రధాన పాత్రలో రూపొందిన ఈ సినిమాలో అనసూయ భరద్వాజ్ తదితరులు ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు.
‘విమానం’ సినిమా ఈ వారం ప్రేక్షకుల ముందుకు రానుంది. హీరోయిన్‌గా తెలుగు తెరను వీడి వెళ్లిపోయిన మీరా జాస్మిన్ (Meera Jasmine) లాంగ్ గ్యాప్ తర్వాత మళ్లీ తెలుగు ప్రేక్షకుల్ని పలకరిస్తున్న సినిమా ఇది.
ఈ సినిమా తర్వాత మీరా జాస్మిన్ వరుసగా టాలీవుడ్‌లో సినిమాలు చేస్తుందేమో.! ఒకవేళ చేస్తే ఎలాంటి పాత్రలను ఎంచుకుంటుందో చూడాలి మరి.