Mega Brothers Political Power.. మెగాస్టార్ చిరంజీవి.. పరిచయం అక్కర్లేని పేరిది.! ఆయన చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్.! సేమ్ టు సేమ్, పవన్ కళ్యాణ్ గురించి కూడా కొత్తగా పరిచయం చేయాల్సిన పనిలేదు.
ఇక, పెద్ద తమ్ముడు నాగబాబు కూడా అన్నయ్య చిరంజీవి నుంచి ‘బహుమతి’ అందుకున్నారు.! చిన్న తమ్ముడు పవన్ కళ్యాణ్‌కి ‘పెన్ను’ బహుకరించి, ప్రజా సేవ.. అనే యజ్ఞానికి పంపించారు చిరంజీవి.
ఇప్పుడేమో, పెద్ద తమ్ముడు నాగబాబుకి కూడా ‘పెన్ను’ బహుకరించి, ఎమ్మెల్సీగా పదవీ ప్రమాణ స్వీకారినికి చిరంజీవి పంపించారు.
Mega Brothers Political Power.. ప్రజా రాజ్యం పార్టీ అధినేతగా..
ముగ్గురు మొనగాళ్ళు.. ఔను, చిరంజీవి అలాగే పవన్ కళ్యాణ్, నాగబాబు.. ముగ్గురు మొనగాళ్ళే.! అటు జాతీయ స్థాయిలోనూ, ఇటు రాష్ట్ర స్థాయిలోనూ చట్ట సభల్లో మెగా బ్రదర్స్ అడుగు పెట్టేసినట్లే.
ప్రజా రాజ్యం పార్టీ అధినేత హోదాలో, తిరుపతి ఎమ్మెల్యేగా చిరంజీవి, ఉమ్మడి తెలుగు రాష్ట్ర అసెంబ్లీలో సందడి చేసిన సంగతి తెలిసిందే.

ఆ తర్వాత రాజ్యసభకు ఎంపికై, కేంద్ర మంత్రి హోదాలో లోక్ సభ, అలాగే రాజ్యసభల్లో తన మెగాస్టార్ చిరంజీవి అడుగు పెట్టడం తెలిసిన విషయాలే.
ఇక, ఏపీ డిప్యూటీ సీఎం హోదాలో పవన్ కళ్యాణ్, ఆంధ్ర ప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు. డిప్యూటీ సీఎం గనుక, పవన్ కళ్యాణ్ శాసన మండలిలోనూ కనిపిస్తున్నారు.
మెగా పవర్ రాజకీయ ప్రయాణం..
తాజాగా, నాగబాబు ఎమ్మెల్సీగా ఎన్నికైన దరిమిలా, ఆయన శాసన మండలిలో అడుగు పెట్టనున్నారు. మంత్రి పదవి కూడా వస్తే, అసెంబ్లీలోనూ నాగబాబు కనిపిస్తారు.

ప్రజా రాజ్యం పార్టీ నుంచి జనసేన దాకా.. మెగా బ్రదర్స్ రాజకీయ ప్రయాణం.. మార్పు కోసం, ప్రజల కోసం.. అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
Also Read: కుక్క పని కుక్కే చెయ్యాలి.! గాడిద చెయ్యకూడదు.!
రాజకీయాలకు చిరంజీవి దూరమైనా, రాజకీయాల్లో చిరంజీవి పేరు వినిపించని రోజు లేదంటే అతిశయోక్తి కాదేమో. ఔను, ఆయన గాడ్ ఫాదర్.!