LIGER Hunt Theme: పాన్ ఇండియా ‘ఫైటర్’ విజయ్.!
Liger Hunt Theme.. విజయ్ దేవరకొండ.. ఇకపై ‘రౌడీ హీరో’ కాదు, కాబోయే పాన్ ఇండియా సూపర్ స్టార్. ‘లైగర్’ సినిమాతో పాన్ ఇండియా విక్టరీ కొట్టేందుకు సిద్ధమవుతున్నాడు విజయ్ దేవరకొండ.
పూరి జగన్నాథ్ (Director Puri Jagannath) దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ‘లైగర్’ సినిమాలో విజయ్ దేవరకొండ సరసన బాలీవుడ్ బ్యూటీ అనన్య పాండే (Ananya Panday) హీరోయిన్‌గా నటిస్తున్న సంగతి తెలిసిందే.
Liger Hunt Theme.. సాలా క్రాస్ బ్రీడ్.!
తాజాగా ‘లైగర్’ సినిమా నుంచి ‘హంట్ థీమ్ సాంగ్’ విడుదల చేశారు మేకర్స్. పూరి జగన్నాథ్ మేకింగ్ స్టైల్ ఎలా వుంటుందో, ఆయన సినిమాల ప్రమోషన్ తీరు ఎలా వుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
అన్నిటికీ మించి, పూరి జగన్నాథ్ సినిమాల్లో హీరో అంటే, ఆ ‘పంచ్’ వేరే లెవల్‌లో వుంటుంది.
విజయ్ దేవరకొండ తన స్టైల్‌ని పూరి జగన్నాథ్ కోసం మార్చుకున్నాడా.? లేదంటే, పూరి జగన్నాథ్ స్వయంగా విజయ్ దేవరకొండ స్టైల్‌ని అంది పుచ్చుకున్నాడా.?
ఇవేవీ కాదు.. ఇద్దరూ కలిసి ‘లైగర్’ రూపంలో ‘లైక్ నెవర్ బిఫోర్’ అనే స్థాయిలో ఔట్‌పుట్ ఇస్తున్నారా.? అన్నది ముందు ముందు తేలుతుంది.
‘లైగర్’ థీమ్ సాంగ్ అయితే, పూరి – విజయ్.. ఈ ఇద్దరి మిక్సింగ్ అన్నట్టే వుంది. హై ఓల్టేజ్ యాక్షన్ సన్నివేశాలు ఇందులో వుండబోతున్నాయని థీమ్ సాంగ్‌ని చూస్తేనే అర్థమవుతుంది.
హ్యాపీ బర్త్ డే విజయ్ దేవరకొండ
విజయ్ దేవరకొండ (Happy Birth Day Vijay Deverakonda) పుట్టిన రోజు నేడు. ఈ నేపథ్యంలో ‘లైగర్’ థీమ్ సాంగ్‌ని మేకర్స్ విడుదల చేశారు. రౌడీస్ క్షణాల్లో ఈ థీమ్ సాంగ్‌ని వైరల్ చేసేయకుండా వుంటారా.?
Also Read: Bigg Boss NON STOP బాగోతం.! సమాజానికి హానికరం.?
‘సాలా క్రాస్ బ్రీడ్..’ అంటూ సినిమాపై ఇప్పటికే రౌడీస్ అంచనాల్ని ఆకాశానికెత్తేసిన సంగతి విదితమే. ఈ ఏడాది విడుదలైన, విడుదలవుతున్న చిత్రాలన్నిటిలోకీ ‘లైగర్’ వెరీ వెరీ స్పెషల్ అని నిస్సందేహంగా చెప్పొచ్చు.