Table of Contents
అభిమానులకి మెగా కానుక అందింది దీపావళి పండక్కి. ఓ రోజు ముందుగానే ఈ దీపావళి కానుకని ఇచ్చేశారు నిర్మాత డి.వి.వి. దానయ్య. డివివి ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతోన్న సినిమాకి టైటిల్ కన్‌ఫామ్ అయ్యింది. ‘వినయ విధేయ రామ’ అంటూ మెగా పవర్ స్టార్ ఫస్ట్ లుక్ వచ్చేసింది.
పక్కా మాస్ లుక్‌తో వినయ విధేయ రాముడ్ని (Vinaya Vidheya Rama) అభిమానులకు దీపావళి (Deepavali) కానుకగా అందించాడు దర్శకుడు బోయపాటి శ్రీను. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన బోయపాటి, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్‌ని (Mega Power Star) ఎలా చూపించబోతున్నాడో ఫస్ట్ లుక్‌తోనే ఓ ఐడియా వచ్చేసింది. ఓ చేత్తో ఓ ఆయుధం, ఇంకో చేత్తో మరో ఆయుధం.. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు వినయ విధేయ రాముడు ఫస్ట్ లుక్‌లో. కాస్ట్యూమ్స్, బ్యాక్‌గ్రౌండ్ అప్పీయరెన్స్.. అన్నీ అద్భుతహ అనేలా వున్నాయ్.
మెగా పవర్ స్టార్ సరసన ‘భరత్’ బ్యూటీ
సూపర్ స్టార్ మహేష్‌బాబు (Super Star Mahesh Babu) హీరోగా నటించిన ‘భరత్ అనే నేను’ (Bharat Ane Nenu) సినిమాతో తెలుగు తెరపైకి ఎంట్రీ ఇచ్చిన బాలీవుడ్ భామ కియారా అద్వానీ (Kiara Advani) ఈ సినిమాలో రామ్‌చరణ్ (Ram Charan) సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. తొలి సినిమాతోనే హీరోయిన్‌గా మంచి మార్కులేయించుకున్న ఈ బ్యూటీ, మెగా పవర్ స్టార్‌తో మరో హిట్ కొట్టేందుకు సిద్ధంగా వుంది. స్వతహాగా మంచి డాన్సర్ అయిన కియారా, రామ్‌చరణ్‌తో కలిసి డాన్సులు అదరగొట్టేసిందట. ఈ అందాల భామ గ్లామర్ మోతాదు కూడా ఈ సినిమాలో కాస్త ఎక్కువగానే వుంటుందని సమాచారమ్.
విలన్‌గా వివేక్ ఒబెరాయ్
బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ (Vivek Oberoi), ఈ సినిమాలో విలన్‌గా నటిస్తున్నాడు. తెలుగులో వివేక్ ఒబెరాయ్ ‘రక్తచరిత్ర’ సినిమాలో కన్పించిన సంగతి తెల్సిందే. ఆ సినిమాలో పరిటాల రవి పాత్రలో నటించి మెప్పించాడు వివేక్ ఒబెరాయ్. సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ (Ramgopal Varma) ఈ ‘రక్తచరిత్ర’ను రూపొందించిన సంగతి తెల్సిందే. ఇక, చరణ్ హాస్పిటాలిటీ తనకు బాగా నచ్చిందంటూ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా వివేక్ ఒబెరాయ్, చరణ్‌తో కలిసి వున్న ఓ ఫొటోని సోషల్ మీడియాలో షేర్ చేశాడు.
రాక్ స్టార్ డీఎస్‌పీ సంగీతం
మెగా కాంపౌండ్‌లో సినిమా చేస్తే, ఆటోమేటిక్‌గా దేవిశ్రీప్రసాద్ (Rock Star Devi Sri Prasad) స్పెషల్‌గా ట్యూన్ అయిపోతుంటాడు. మెగా కాంపౌండ్‌లో డీఎస్‌పీకి వున్న మ్యూజికల్ బ్లాక్‌బస్టర్స్ అన్నీ ఇన్నీ కావు. చరణ్‌తోనూ, పలు మ్యూజికల్ హిట్స్ వున్నాయి దేవిశ్రీప్రసాద్‌కి. ఇటీవల ‘రంగస్థలం’ సినిమాతో చరణ్ – దేవిశ్రీప్రసాద్ మ్యూజికల్ కాంబో సూపర్ విక్టరీ కొట్టిన సంగతి తెల్సిందే. ‘వినయ విధేయ రామ’ (Vinaya Vidheya Rama)కి కూడా రాక్ స్టార్ డీఎస్‌పీ (Rock Star DSP) సూపర్బ్ మ్యూజిక్ ఇచ్చాడట.
టీజర్ కూడా వచ్చేస్తోంది
‘వినయ విధేయ రామ’ ఫస్ట్ లుక్‌తో అభిమానులకు దీపావళి శుభాకాంక్షలు అందించిన నిర్మాత డివివి దానయ్య, దీపావళి తర్వాత మరో గిఫ్ట్ రెడీ చేస్తున్నారు. అదే ‘వినయ విధేయ రామ’ టీజర్. సినిమా రిలీజ్‌కి దగ్గర పడ్తున్న దరిమిలా, శరవేగంగా పనులు పూర్తి చేసేస్తున్నారు. షూటింగ్ పార్ట్ దాదాపుగా పూర్తయిపోయింది.. రెండు పాటల మినహా. అవీ పూర్తి చేసేసి, ప్రమోషన్స్‌లో వేగం మరింత పెంచబోతున్నారట. ‘రంగస్థలం’ (Rangasthalam) సినిమాతో 100 కోట్ల క్లబ్‌లోకి చేరడమే కాక, ‘నాన్ బాహుబలి’ (Non Bahubali Record) రికార్డ్ దక్కించుకున్న చరణ్, తన రికార్డ్‌ని తానే బ్రేక్ చేయడానికి ‘వినయ విధేయ రామ’ అంటూ వచ్చేయబోతున్నాడు. ఆల్ ది బెస్ట్ టు ‘వినయ విధేయ రామ’ టీమ్.