Waltair Veerayya Collections.. చిరంజీవి మెగా మాస్ స్టామినా ఇదీ.! ఔను, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో ఇది ఇంకోసారి నిరూపితమయ్యింది. తొలి రోజు వసూళ్ళు అదిరిపోయాయ్.
జనవరి 12న ‘వీర సింహా రెడ్డి’ విడుదల కావడంతో, తెలుగు రాష్ట్రాల్లో జనవరి 13న విడుదలైన ‘వాల్తేరు వీరయ్య’కి తగినన్ని థియేటర్లు దొరకని పరిస్థితి వుందన్నది నిర్వివాదాంశం.
ఇకపై చిరంజీవి ఎలాంటి సినిమాలు చేయాలన్న విషయమై ‘వాల్తేరు వీరయ్య’ ఓ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చినట్లయ్యిందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.
Mudra369
ఈరోజు ‘వారసుడు’ సినిమాతో దిల్ రాజు మెజార్టీ థియేటర్లను ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) నుంచి లాగేసుకునే అవకాశమూ వుంది. కానీ, ఒక్క రోజుల్లోనే ‘రచ్చ రంబోలా’ అయిపోయింది.
Waltair Veerayya Collections.. వసూళ్ళ ప్రభంజనం..
తొలి రోజు వసూళ్ళ ప్రభంజనం సృష్టించింది ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya). రెండో రోజూ అదే ప్రభంజనం కొనసాగనుంది.
‘వారసుడు’పై బజ్ లేకపోవడంతో, చాలా చోట్ల ‘వాల్తేరు వీరయ్య’ అభిమానులే కాదు, ‘వీర సింహా రెడ్డి’ (Veera Simha Reddy) అభిమానులూ ఆ ‘వారసుడు’ థియేటర్ల వ్యవహారంపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మధ్యాహ్నానికి ‘వారసుడు’ థియేటర్లలో చాలా వరకు తిరిగి ‘వాల్తేరు వీరయ్య’కి వెళ్ళిపోయేలా వున్నాయ్. పరిస్థితి అలా వుంది మరి.!
ఓవర్సీస్‌లో 1 మిలియన్‌కి చేరువలో..
శనివారం.. అంటే, ఈ రోజు ‘వాల్తేరు వీరయ్య’ (Waltair Veerayya) 1 మిలియన్ క్లబ్బులో చేరిపోయేందుకు అవకాశాలు సుస్పష్టంగా కనిపిస్తున్నాయి.

‘ఆచార్య’, ‘గాడ్ ఫాదర్’ సినిమాలతో నిరాశపడ్డ మెగా అభిమానులకు ‘వాల్తేరు వీరయ్య’ ఫుల్ జోష్ తీసుకొస్తున్నాడు ఓవ్సీస్‌లో కూడా.
Also Read: రామ్ చరణ్ కథలోకి విజయ్ దేవరకొండ.?
ఇకపై చిరంజీవి (Megastar Chiranjeevi) ఎలాంటి సినిమాలు చేయాలన్న విషయమై ‘వాల్తేరు వీరయ్య’ ఓ స్పష్టమైన సంకేతాన్ని ఇచ్చినట్లయ్యిందన్నది సర్వత్రా వినిపిస్తోన్న వాదన.
ఓవరాల్‌గా ఇప్పుడున్న జోరు చూస్తోంటే.. ‘వాల్తేరు వీరయ్య’కి (Waltair Veerayya) వంద కోట్ల క్లబ్‌లోకి చేరడం అనేది జస్ట్ కేక్ వాక్ అంతే.!