మెగా స్టేట్మెంట్: జనసేనకి 5 కోట్ల ‘చిరు’ విరాళం.!

 మెగా స్టేట్మెంట్: జనసేనకి 5 కోట్ల ‘చిరు’ విరాళం.!

Chiranjeevi Pawan Kalyan Jana Sena Party

Chiranjeevi Mega Statement Janasena.. తమ్ముడికి అన్నయ్య ఐదు కోట్లు ఇస్తే.. అదేమంత పెద్ద విషయం కాదు.! నిజమే, ఇచ్చింది మెగాస్టార్ చిరంజీవి. అందుకున్నది జనసేన అధినేత పవన్ కళ్యాణ్.!

తమ్ముడికి అన్నయ్య చిరంజీవి ఇవ్వాలనుకుంటే, పది కోట్లు.. పాతిక కోట్లయినా ఇవ్వగలరు.! ఇచ్చే వుంటారు కూడా.!

కానీ, జనసేన పార్టీకి విరాళంగా మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ షూటింగ్ స్పాట్‌లో.. అదీ, ఆంజనేయస్వామి విగ్రహం సాక్షిగా ఐదు కోట్ల రూపాయల చెక్ ఇచ్చారంటే.. దానర్థమేంటి.?

Chiranjeevi Mega Statement Janasena.. విరాళం కాదది, స్టేట్మెంట్.!

అన్నదమ్ములు విడిపోయారు.. ఒకరంటే ఒకరికి పడటంలేదు.! తమ్ముడి రాజకీయం అన్నయ్యకి నచ్చడంలేదు. అన్నయ్య మీద తమ్ముడి గుస్సా.. ఇదీ చాన్నాళ్ళుగా వైసీపీ మార్కు దుష్ప్రచారం.!

‘చిరంజీవి అంటే, నాకు అన్నయ్య మాత్రమే కాదు.. తండ్రి తర్వాత తండ్రి అంతటి వ్యక్తి..’ అని పలు సందర్భాల్లో పవన్ కళ్యాణ్ చెప్పారు.

అలాగే, ‘నా కొడుకు చరణ్ ఎంతో, నా తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా నాకు అంతే.. వాడూ నా బిడ్డ లాంటివాడే..’ అని చిరంజీవీ చాలా సందర్భాల్లో చెప్పారు.

Chiranjeevi Pawan Kalyan Jana Sena Party Nagababu
Chiranjeevi Pawan Kalyan Jana Sena Party Nagababu

సో.. ఇక్కడ విషయం సుస్పష్టం.! తమ్ముడికి అండగా ఈ అన్నయ్య వున్నాడన్న స్టేట్మెంట్ మెగాస్టార్ చిరంజీవి నుంచి ఐదు కోట్ల రూపాయల విరాళం రూపంలో వచ్చిందన్నమాట.!

అవును, ఇచ్చింది చిరు విరాళమే.. కానీ, దాని వెనుక మెగా స్టేట్మెంట్ దాగి వుంది. ఆ స్టేట్మెంట్‌ని జనసైనికులు అర్థం చేసుకున్నారు.

మరీ ముఖ్యంగా మెగాభిమానులందరికీ ఈ మెగా స్టేట్మెంట్ చాలా బాగా అర్థమయ్యింది. అంతకన్నా బాగా, ఎవరికి అర్థం కావాలో వాళ్ళకి.. అంటే, నరనరానా విషాన్ని నింపుకున్న సోకాల్డ్ హేటర్స్‌కి విషయం చాలా బాగా అర్థమయ్యింది.

Digiqole Ad

Related post