మెగాస్టార్ చిరంజీవి (Happy Birthday Mega Star Chiranjeevi) పుట్టినరోజు అంటే అభిమానులకి అది ‘పెద్ద పండగ’ కిందే లెక్క. గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి అభిమానుతు తమ అభిమాన హీరో పుట్టినరోజు వేడుకలకు సంబంధించి ముందస్తు సెలబ్రేషన్స్ చాలా గట్టిగానే చేసేస్తున్నారు.. అదీ సోషల్ మీడియాలో.
ఇక, తాజాగా ఓ అద్భుతమైన డిజైన్, మెగాస్టార్ చిరంజీవి అభిమానుల కోసం వచ్చేసింది. తన కెరీర్లో చిరంజీవి ఎన్నో అద్భుతమైన చిత్రాలు చేశారు. అందులోంచి కొన్నిటిని మాత్రమే ప్రస్తావించాలంటే ఎంత కష్టమైన పనో కదా.!
మెగాస్టార్ చిరంజీవి నటించిన చాలా చాలా అద్భుతమైన చిత్రాల్లోంచి కొన్నిటిని ప్రత్యేకంగా ఎంపిక చేసి, వాటితో స్పెషల్ డిజైన్ చేశారు మెగాస్టార్ చిరంజీవి (Mega Star Chiranjeevi) పుట్టినరోజు కానుకని.
ఇందులో ‘ఖైదీ’ నుంచి ‘సైరా నరసింహారెడ్డి’ వరకు పలు చిత్రాల ప్రస్తావనను ఆయా సినిమాల్లోని స్టిల్స్ ద్వారా చూపించారు. ఒక్కో మెట్టూ ఎక్కుతూ చిరంజీవి, తెలుగు సినీ పరిశ్రమలో అత్యున్నత శిఖరాన్ని అందుకున్న వైనాన్ని ఒక్క డిజైన్‌లో చూపించేయడం గమనార్హం.
ఈ డిజైన్‌కి సర్వత్రా ప్రశంసలు దక్కుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి తనయుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Mega Power Star Ram Charan) ఈ డిజైన్ని సోషల్ మీడియా ద్వారా విడుదల చేశాడు. ఘరానా మొగుడు, స్వయం కృషి, ఇంద్ర, ఖైదీ నెంబర్ 150 తదితర సినిమాల ప్రస్తావన ఈ డిజైన్‌లో వుంది.
దాంతోపాటుగా, ‘రక్తదానం చేయండి.. ప్రాణాలు కాపాడండి’ అనే స్లోగన్ కూడా వుంచారు. ‘ప్లాస్మా దానం చేయండి.. ప్రాణాలు కాపాడండి’ అని కూడా పేర్కొన్నారు. కరోనా కాలం కదా.. ‘స్టే హోం స్టే సేఫ్’ అని కూడా ప్రస్తావించారు.
ఈ డిజైన్ సంగతి ఇలా వుంటే, ఇంకోపక్క సోషల్ మీడియాలో కుప్పలు తెప్పలుగా అభిమానులు తమ అభిమాన హీరో మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు (Happy Birthday Mega Star Chiranjeevi) నేపథ్యంలో డిజైన్ చేసిన డిజైన్లు, వీడియోలు, మోషన్ పోస్టర్స్ సర్క్యులేట్ అవుతున్నాయి. వీటితోపాటుగా, పలువురు సెలబ్రిటీలు విడుదల చేసిన కామన్ మోషన్ పోస్టర్ కూడా అత్యద్భుతంగా సందడి చేసేస్తోంది సోషల్ మీడియాలో.