Table of Contents
ఎన్నో ఏళ్ళుగా అంతా ఎదురుచూస్తోన్న ఓ అద్భుత ఘట్టం త్వరలో సాక్షాత్కరించబోతోంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ (Allu Aravind Geetha Arts) నిర్మాతగా, ‘రామాయణం’ (Ramayanam Telugu Cinema) తెరకెక్కబోతోంది.
నిజానికి ‘రామాయణం’ (Ramayan) ను సినిమాగా తెరకెక్కించాలనే ఆలోచన, అదీ తెలుగు సినీ పరిశ్రమ నుంచి ఎప్పుడో ప్రారంభమయ్యింది.. కానీ, కొన్ని ప్రత్యేక కారణాలతో అలా అలా వెనక్కి వెళుతూ వచ్చింది.
ఆలోచన రాగానే సరిపోదు.. అందుకు తగ్గ వనరులు సమకూర్చుకోగలగాలి.. మార్కెటింగ్ సహా పరిస్థితుల్ని అంచనా వేయగలగాలి. అందుకే, రామాయణం (Ramayanam) విషయంలో కొంత ఆలస్యం జరిగింది.
అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందబోయే ఈ సినిమాకి అల్లు అరవింద్‌తోపాటు మధు మంతెన (Madhu Manthena), నమిత్ మల్హోత్రా (Namit Malhotra) నిర్మాతలుగా వ్యవహరిస్తారు. ఈ ప్రాజెక్ట్ గురించిన అధికారిక ప్రకటన ఎట్టకేలకు బయటకొచ్చింది.
వెండితెర అద్భుతం.. Ramayanam Telugu Cinema
నిజానికి దీన్నొక సినిమాగా కాదు, ఇదొక వెండితెర అద్భుతం అనంటే సబబేమో. ఎందుకంటే, ఇప్పటిదాకా ఇండియన్ సినిమా హిస్టరీలో ఇంతటి ప్రతిష్టాత్మక సినిమా ఇంకోటి పట్టాలెక్కే అవకాశం ఇప్పటిదాకా ఎవరికీ రాలేదు.
‘రామాయణం’ను అత్యున్నత సాంకేతిక హంగులతో తెరకెక్కించడమంటే అదో పెద్ద సాహసం. నటీ నటులు, సాంకేతిక హంగులు.. ఒకటేమిటి.? ఇదో పెద్ద ప్రసహనం. నిజానికి, ఇదొక చారిత్రక ఘట్టం అనడం సబబు.
డబ్బు ఒక్కటే సరిపోదు, టైమ్ కూడా కలసి రావాలి. టైమ్ ఒక్కటే కాదు, అన్నీ కలిసొస్తే తప్ప ఇంతటి అద్భుతమైన కార్యాన్ని చేపట్టడం వీలు కాదు. ఏమో, ఇప్పటికి పరిస్థితులు అన్నీ అనుకూలించాయని అనుకోవాలేమో.
బాహులి చూపిన మార్గం.. Ramayanam Telugu Cinema
నిజానికి, ఈ సినిమాకి ‘బాహుబలి’ దారి చూపిందనడం సబబేమో. ఎందుకంటే, సరిగ్గా మార్కెట్ చెయ్యగలిగితే, వంద కోట్లు ఏం ఖర్మ.? వెయ్యి కోట్లు గ్రాస్ కొల్లగొట్టే సత్తా మన తెలుగు సినిమాకి వుందని నిరూపితమయ్యింది ‘బాహుబలి’తో.
1000 కోట్లు అనేదే ఊహకు అందని విషయం. అయితే, ‘బాహుబలి‘ అంతకు మించి వసూలు చేసింది ‘బాహుబలి’. ఇండియన్ సినిమా సత్తాని ప్రపంచ వేదికలపై చాటి చెప్పిన ఘనత ఖచ్చితంగా బాహుబలికే దక్కతుంది.
రాజమౌళి కేవలం దర్శకుడు మాత్రమే కాదు.. ఈ సినిమాని తనదైన ఆలోచనలతో మార్కెట్ చేయగలిగిన మొనగాడు కూడా. తెలుగు సినిమాకే కాదు, ఇండియన్ సినిమాకి కూడా మార్కెటింగ్ టెక్నిక్స్ నేర్పిన ఘనుడు రాజమౌళి.
అన్నట్టు, ప్లానింగ్ విషయంలో మిస్టర్ కూల్ అండ్ పెర్ ఫెక్ట్ అయిన అల్లు అరవింద్ (Allu Aravind) ఈ సినిమాని నిర్మిస్తుండడంతో మరో అద్భుతం టాలీవుడ్ నుంచి ఇండియన్ సినిమాకి అందబోతోందని ఫిక్సయిపోవచ్చు.
‘బాహుబలి’ రెండు.. రామాయణం మూడు..
ఒకప్పుడు సినిమా అంటే, ఒక్కటే. ఇప్పుడలా కాదు. సినిమా అంటే, అది ఎన్ని భాగాలుగా వచ్చినా ప్రేక్షకులు ఆదరిస్తారని ‘బాహుబలి’ నిరూపించింది. ఆ బాటలోనే ‘రామాయణం’ (Ramayanam Telugu Cinema) చిత్రాన్ని ఒకటి కాదు, అంతకు మించిన భాగాల్లో తెరకెక్కించబోతున్నారు.
అయితే, ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా మూడు భాగాలుగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే, 2021లో ‘రామాయణం’ తొలి పార్ట్ విడుదలవుతుంది.
దర్శక రత్నాలు ఇద్దరు..
ఒకరు కాదు, ఇద్దరు దర్శకులు ఈ వెండితెర అద్భుతం కోసం పని చేయబోతున్నారు. అందులో ఒకరు ‘దంగల్’ ఫేం నితీష్ తివారీ కాగా, మరొకరు ‘మామ్’ ఫేం రవి ఉద్యవార్. ‘దంగల్’ సినిమా ఓ అద్భుతం.
ఇండియాలోనే కాదు, విదేశాల్లోనూ సత్తా చాటింది ‘దంగల్’. ‘బాహుబలి’ వచ్చేదాకా, అత్యధిక వసూళ్ళు సాధించిన ఇండియన్ సినిమా ‘దంగల్’. అలాంటి చిత్రాన్ని మనకందించిన నితీష్ తివారీ నుంచి ఈ ‘రామాయణం’ వస్తోందంటే, మరో అద్భుతం కాకుండా వుంటుందా? అది.
మరోపక్క, నితీష్ తివారీకి ‘మామ్’ దర్శకుడు ఉద్యవార్ జతవుతున్నాడు. ఇద్దరు దర్శకులు ఓ సినిమాకి పనిచేయడమంటే చిన్న విషయం కాదు. కానీ, ఇంత భారీ చిత్రాలకు అది తప్పనిసరి కాకపోవచ్చు.
అతిలోక సుందరి ‘శ్రీదేవి’ నటించిన చివరి సినిమా ‘మామ్’. దేశవ్యాప్తంగా ప్రేక్షకులు ‘మామ్’ సినిమాకి బ్రహ్మరథం పట్టారంటే, ఆ సినిమాలోని విషయం అలాంటిది.. దర్శకుడి ప్రతిభ అంత గొప్పది.
హీరో ఎవరు? రామ్ చరణ్‌కి ఆ ఛాన్సుందా.?
అభిమానులు అప్పుడే ‘రామాయణం’ సినిమాలో రాముడిగా నటించబోతున్నాడని ఫిక్సయిపోయారు. నిజానికి చాలా కాలం క్రితమే ‘రామాయణం’ పేరుతో ఓ పోస్టర్‌ని తయారు చేసేశారు మెగా పవర్ స్టార్ అభిమానులు. దానికి సంబంధించిన డిజైన్‌నే మీరిక్కడ చూస్తున్నది.
అభిమానులు సృష్టించిన ఈ డిజైన్ అచ్చంగా సినిమా కోసం దర్శక నిర్మాతలు తయారుచేసిందా.? అన్పించకమానదు. అంత పెర్‌ఫెక్ట్‌గా తయారైందది. అయితే, ప్రస్తుతానికి నటీనటుల వివరాల్ని నిర్మాతలు వెల్లడించలేదు.
ఒకవేళ రామ్‌చరణ్ రాముడిగా నటిస్తే, రావణుడిగా బెస్ట్ ఆప్షన్ ఇంకెవరో కాదు.. యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆల్రెడీ ‘జై లవకుశ’ సినిమాలో మోడ్రన్ రావణుడి పాత్రలో యంగ్ టైగర్ అదరగొట్టేశాడు కదా.! లెట్స్ వెయిట్ అండ్ వాచ్ ఫర్ రామాయణాస్ కంప్లీట్ డిటెయిల్స్.