Mega Victory Mass Song.. తెలుగు సినీ పరిశ్రమకి మూల స్థంభాల్లా నిలిచిన ఆ నలుగురు అగ్ర హీరోల్లో ఇద్దరు, ఒకేసారి వెండితెరపై కనిపిస్తే.?
‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో, దర్శకుడు అనిల్ రావిపూడి, ఆ ఇద్దర్నీ ‘పండగ’లా తెరపై చూపించేస్తున్నాడు.!
మెగాస్టార్ చిరంజీవి, నయనతార జంటగా నటిస్తోన్న ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే.
గత సంక్రాంతికి, విక్టరీ వెంకటేష్‌తో ‘సంక్రాంతికి వస్తున్నాం’ అంటూ సూపర్ హిట్ కొట్టాడు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈసారి డబుల్ ధమాకా.!
Mega Victory Mass Song మెగా విక్టరీ మాస్ ఎనర్జీ..
చిరంజీవితో వెంకటేష్, ‘మన శంకర వర ప్రసాద్’ సినిమా కోసం గెస్ట్ రోల్‌లో కనిపించబోతున్నాడు. తెరపై చిరంజీవి, వెంకటేష్ ఫుల్ ఎనర్జీతో మాస్ స్టెప్పులేసేశారు.
తాజాగా, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా నుంచి ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’ లిరికల్ వీడియోని టీమ్ విడుదల చేసింది.
తెలిసిందేగా.. డాన్సుల్లో గ్రేస్ అంటే, మెగాస్టార్ చిరంజీవి అని. విక్టరీ వెంకటేష్ చూపించే జోష్ సంగతి సరే సరి.! ఇద్దరూ కలిసి, చేసిన సందడి అంతా ఇంతా కాదు ‘మెగా విక్టరీ మాస్ సాంగ్’లో.!
‘ఏంది బాసూ సంగతి.. అదిరిపోద్ది సంక్రాంతి.. ఏంది వెంకీ సంగతి… ఇరగదీద్దాం సంక్రాంతి’ అంటూ ఇటు చిరంజీవి అటు వెంకీ పోటీ పడి డాన్సులేసేశారు.
థియేటర్లలో ఈ ఇద్దర్నీ ఇలా వెండితెరపై చూస్తే, ఇరువురి అభిమానులే కాదు, సగటు సినీ అభిమాని సీట్లలోంచి లేచి, ఫుల్ జోష్‌తో డాన్సులేసెయ్యడం ఖాయం.
ఇలా సీనియర్ హీరోలు, ఏడాదికి ఓ సినిమాలో అయినా కనిపిస్తే.. ఆ కిక్కే వేరప్పా.! సినీ పరిశ్రమలో సగం గొడవలు తీరిపోతాయ్.. అందులో నో డౌట్.!
ఈ విషయంలో దర్శకుడు అనిల్ రావిపూడిని అభినందించి తీరాలి.. ఈ కాంబినేషన్‌ని సెట్ చేసినందుకు.!
అతి ముఖ్యమైన విషయమేంటంటే, మార్కెట్‌లోకి కొత్త కుర్రాళ్ళొచ్చారు.. ‘జెన్-జి’ యంగ్‌స్టర్స్‌లో చిరంజీవి, వెంకటేష్.. సంక్రాంతికి ఫుల్ ఆఫ్ ఎనర్జీతో.. అదరగొట్టేయబోతున్నారు.
