Megastar Chiranjeevi ‘మా ఇంట్లో తిన్నారు.. నన్ను తిడుతున్నారు..’ ఇదీ మెగాస్టార్ చిరంజీవి తాజా వ్యాఖ్యల సారాంశం.
ఎవరి మీదనో తెలుసు కదా.? ఇంకెవరి మీద, వైసీపీ ఎమ్మెల్యే, సినీ నటి, మంత్రి రోజా మీద.!
‘రాజకీయాలంటే ఇలాగే వుండాలా.? ఇంత సంస్కార హీనంగానా.?’ అంటూ చిరంజీవి అసహనం వ్యక్తం చేశారు. రాజకీయం వేరు, సినిమా వేరు.. అయినాగానీ, ఇలా ఎలా విమర్శిస్తారన్నారు చిరంజీవి.
కొన్నాళ్ళ క్రితం చిరంజీవి ఇంటికి రోజా వెళ్ళారు.. అదీ కుటుంబ సమేతంగా. ఈ క్రమంలో ఆమె ఉబ్బి తబ్బిబ్బయ్యారు.
Megastar Chiranjeevi చేస్తున్న సేవ ఇదీ..
ఇంతలోనే, రోజా రాజకీయ విమర్శలు చేశారు. చిరంజీవి సహా ఆయన సోదరుల వల్ల జనాలకు ఎలాంటి లాభం లేదని విమర్శించేశారు.
ఎందుకు లేదు.? బ్లడ్ బ్యాంక్ అలాగే ఐ బ్యాంక్.. వీటికి తోడుగా ఆక్సిజన్ బ్యాంకులు ఏర్పాటు చేసి, కోట్లు ఖర్చు చేసి మరీ జనానికి సేవ చేస్తున్నాను కదా.? అంటూ చిరంజీవి వ్యాఖ్యానించారు.

పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) మూడు పెళ్ళిళ్ళ వ్యవహారంపైనా చిరంజీవి ఓ ప్రశ్నకు తనదైన స్టయిల్లో సమాధానమిచ్చారు.
నో రాజకీయమ్.!
‘ప్రజలకు అన్నీ తెలుసు.. వాడేంటో తెలుసు.. వాడు మంచి పని చేయాలనుకుంటున్నాడు.. మంచి పొజిషన్లో వుండాలని అన్నగా కోరుకుంటా..’ అంటూ చిరంజీవి చెప్పడం గమనార్హం.
Also Read: Blue Stray Dog.. ‘ఫీట్లు’ నాక్కోక, నీకెందుకు ట్వీట్లు.!
రాజకీయాలకు దూరంగా వున్నాననీ, అటు వైపు అస్సలు చూడనని చిరంజీవి (Chiranjeevi) తేల్చి చెప్పేశారు.
‘వాడు నా తమ్ముడు. నా బిడ్డ లాంటోడు. రాజకీయంగా ఉన్నతమైన స్థితిలో వుండాలని నేను కోరుకుంటాను. అందులో తప్పేముంది.?’ అని చిరంజీవి వ్యాఖ్యానించడం కొసమెరుపు.
‘నా సాయం వాడికి అక్కర్లేదు. రాజకీయాల్లోకి వచ్చి ఇబ్బంది పడొద్దని చెబుతుంటాడు. వాడికి ఆ కేపబిలిటీ వుంది. ఒంటరిగానే సాధించగలడు..’ అని చిరంజీవి తన తమ్ముడు పవన్ కళ్యాణ్ మీద నమ్మకాన్ని వ్యక్తం చేశారు.