Megastar Chiranjeevi మెగాస్టార్ చిరంజీవికి ఏదన్నా పురస్కారం దక్కితే.. ఆ పురస్కారం తాలూకూ గౌరవం పెరుగుతుంది. నిజానికి, పురస్కారాలకు గౌరవం కూడా అలాగే లభిస్తుంటుంది.
పురస్కార గ్రహీతలు ఎంత గొప్పవారైతే, ఆ పురస్కారాలకు గౌరవం అంతలా పెరిగి, ఆ పురస్కారాలు.. మరింత సమర్థులకు ముందు ముందు దక్కుతాయి.
తాజాగా మెగాస్టార్ చిరంజీవిని, ‘ఇండియన్ ఫిలిం పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022’ పురస్కారం వరించింది.
Megastar Chiranjeevi ప్రధాని మోడీ నుంచి అభినందనలు..
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, తెలుగు రాష్ట్రాల గవర్నర్లు, పలువురు కేంద్ర మంత్రులు, ఇతర రాజకీయ ప్రముఖులూ మెగాస్టార్ చిరంజీవిని అభినందిస్తూ, సినీ పరిశ్రమకు ఆయన చేసిన సేవల్ని కీర్తిస్తూ సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు.
ప్చ్.! ఇక్కడే కొందరికి కడుపు మంట ఎక్కువైపోయింది. ఏడుపు ఆపుకోలేకపోతున్నారు. ఈ పురస్కరాన్ని రాజకీయాలతో ముడిపెడుతున్నారు.

గతంలో రజనీకాంత్ తదితర సినీ ప్రముఖులు ఈ పురస్కారాన్ని అందుకున్నారు. కానీ, అప్పుడు రాని రాజకీయాల ప్రస్తావన, ఇప్పుడే ఎందుకు వస్తోంది.?
కుల జాడ్యం.. అత్యంత ప్రమాదకరం.!
దేశంలో ఎక్కడా లేని విధంగా కులజాడ్యం తెలుగునాట పెరిగిపోయింది. అందునా, ఆంధ్రప్రదేవ్‌లో ఇది మరీ ఎక్కువగా కనిపిస్తోంది.
చిరంజీవి అంటే గిట్టని కొందరు వ్యక్తులు, మీడియా సంస్థలు, రాజకీయ పార్టీలు.. తమ పైత్యాన్ని తమ తమ సామాజిక వర్గానికి చెందిన యువతకు అంటించేందుకు విశ్వ ప్రయత్నాలూ చేస్తున్నారు.
Also Read: ఆల్‌రౌండర్ విశ్వక్‌సేన్.! ఆఫ్ట్రాల్ అర్జున్.! అంతేనా.?
ఆ రెండు సామాజిక వర్గాలకు చెందిన రెండు ప్రధాన రాజకీయ పార్టీలకు చెందిన మద్దతుదారులు సోషల్ మీడియా వేదికగా చిరంజీవిపై విషం కక్కుతున్నారు.
దీనికి, సోకాల్డ్ రాజకీయ పార్టీలకు చెందిన మీడియా సంస్థలు తమవంతుగా సహకరిస్తుండడం గమనార్హం.
చిరంజీవి శిఖరం.! ఆయన ముందు ఏవేవో మొరుగుతుంటాయ్.. వాటిని పట్టించుకోవాల్సిన అవసరమే లేదు.!
కానీ, ప్రతిసారీ అదే మొరుగుడంటే, ఎవరికైనా చిరాకు రాకుండా వుంటుందా.? ప్చ్.. ఏం చేస్తాం.? అదంతే, ఆ ఏడుపుని ఎవరూ ఆపలేరంతే.