Table of Contents
Megastar Chiranjeevi Instant Directors.. మెగాస్టార్ చిరంజీవి, సినీ పరిశ్రమ ఎదుర్కొంటోన్న అతి పెద్ద సమస్య గురించి మాట్లాడారు. తెలుగు సినిమా గమనం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలు సర్వత్రా చర్చనీయాంశమవుతున్నాయి.
దర్శకుల్లో కొందరు, ఆన్ స్పాట్ డైలాగ్స్ అండ్ సీన్స్ చెబుతుండడం పట్ల చిరంజీవి చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమలో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.
‘చిరంజీవి వ్యాఖ్యలు తప్పు.. అలా సినీ పరిశ్రమలో జరగదు..’ అని ఎవరూ చెప్పలేని పరిస్థితి. ఎందుకంటే, ఈ విషయమై చాలామంది బాధితులున్నారు, అయితే మారిన ట్రెండ్ నేపథ్యంలో అంతా సర్దుకుపోతున్నారంతే.
బౌండెడ్ స్క్రిప్ట్.. అనే మాటకు కాలం చెల్లిందా.? అన్న పరిస్థితులు సినీ పరిశ్రమలో కనిపిస్తున్నాయి. ఏదో స్క్రిప్ట్ అనుకుంటోంటే, తెరపై ఇంకోటేదో ఆవిష్కృతమవుతోంది.
Megastar Chiranjeevi Instant Directors.. కొంప ముంచుతున్న ఇన్‌స్టంట్ మేకింగ్.!
గత కొంతకాలంగా వస్తోన్న సినిమాల్ని చూస్తోంటే, దర్శకుడి ఆలోచనకీ.. సినిమాపై తెరకెక్కిన విషయానికీ అస్సలు పొంతన కనిపించదు. అది ప్రేక్షకులకే అర్థమవుతోంది.
‘ఆ దర్శకుడు ఇలాంటి సినిమా ఎలా తీశాడు.?’ అని అనుకోని సినిమా ఇటీవలి కాలంలో ఒక్కటీ రాలేదనడం అతిశయోక్తి కాదు.. అది హిట్టు సినిమా అయినా, ఫ్లాప్ సినిమా అయినా.!
తప్పులు జరుగుతున్నాయ్. కెప్టెన్ ఆఫ్ ది షిప్ దర్శకుడిదే ఆ బాధ్యత అంతా. ఇందులో ఇంకో మాటకు తావు లేదు.
కానీ, దర్శకుడికి అంత స్వచ్ఛ ఇప్పుడు ఎంతమంది నిర్మాతలు, హీరోలు ఇస్తున్నారు.? అన్నది కూడా ఆలోచించాల్సిన విషయమే మరి.!
కాంబినేషన్ల పైత్యమే అసలు సమస్య
కథ, కాకరకాయ్.. ఇవేవీ లేకుండానే కాంబినేషన్లు సెట్ అయిపోతున్నాయ్. ఓ హీరోతో ఓ కథ అనుకుంటున్న దర్శకుడు, ఆ హీరో హ్యాండ్ ఇచ్చేసరికి ఇంకో హీరో దగ్గరకు వెళ్ళక తప్పడంలేదు.

సో, సీన్ మారిపోతుంది. టైమ్ తక్కువగా వుంటోంది మార్పులు చేయడానికి. ఆన్ సెట్స్ మార్పులు చేర్పులు చేసుకోవాల్సిందే.
డైలాగ్స్ విషయానికొస్తే, క్వాలిటీ తగ్గిపోయి.. ఆన్ స్పాట్ ఇంప్రవైజేషన్స్ చేసుకోవాల్సి వస్తోంది. అప్పటికప్పుడు కొత్త ట్రాకులూ రాసుకుంటున్న పరిస్థితి.
తప్పు సరిదిద్దుకుంటారా.? లేదా.?
పరిశ్రమ పెద్దగా.. పరిశ్రమ బిడ్డగా.. ఏ కోణంలో చిరంజీవి చెప్పినా, ‘మార్పు రావాలి’ అన్న మాటైతే నిజం. తప్పు జరుగుతోన్నమాట వాస్తవం.
Also Read: రణవీరుడి వస్త్ర సన్యాసం.! ఏం చూపించినవ్ గురూ.!
హీరోలూ కొందరు దర్శకుల మీద తెస్తోన్న అనవసర ఒత్తిడి కారణంగా ఇటీవలి కాలంలో పెద్ద పెద్ద ప్రాజెక్టులు సర్వనాశనమైపోతున్నాయన్నదీ కాదనలేని వాస్తవం.
అన్ని సమస్యలపైనా, అన్ని విభాగాల మధ్యా చర్చ జరగాలి. అప్పుడే తెలుగు సినిమా నుంచి మరింత క్వాలిటీ ఔట్‌పుట్ వస్తుంది.