ఊరికే మెగాస్టార్లు అయిపోరు.! థియేటర్లలో అభిమానులకు పూనకం వచ్చేస్థాయిలో వాళ్ళనలా తనదైన ప్రత్యేకమైన స్టైల్‌తో మెస్మరైజ్ చేయడం కేవలం కొందరికి మాత్రమే సాధ్యం. ఆ కొందరిలోనూ చాలా చాలా స్పెషల్.. ఆయనే మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi).
ఏజ్ ఈజ్ జస్ట్ నెంబర్.. అవును, మెగాస్టార్ చిరంజీవి విషయంలో ఇది ముమ్మాటికీ నిజం. దాదాపు 9 ఏళ్ళపాటు సినిమాలకు దూరమైన చిరంజీవి, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో రీ-ఎంట్రీ ఇచ్చారు.. అంతకు ముందు, ఆ తర్వాత.. చిరంజీవి ఒకేలా వున్నారంటారు చాలామంది. ఇంకాస్త ఎనర్జీ కొత్తగా సంతరించుకున్నారేమో అనిపిస్తుంది.
ఇది బాస్ Megastar Chiranjeevi పూనకం..

తాజాగా బాబీ దర్శకత్వంలో చిరంజీవి హీరోగా నటించనున్న సినిమాకి సంబంధించి స్పెషల్ లుక్ విడుదల చేశారు. మాస్ పూనకం.. ఊర మాస్ పూనకం.. కాదు కాదు, ఇది బాస్ పూనకం.. అనే స్థాయిలో వుందీ లుక్. ఎలా.? ఇదెలా సాధ్యం.? చిరంజీవికి మాత్రమే ఇదెలా సాధ్యమవుతోంది.? అని అంతా ముక్కున వేలేసుకుంటున్నారు.
‘మూలవిరాట్టు దర్శనం..’ అంటూ దర్శకుడు బాబి చెప్పుకొచ్చాడంటే, ఏదో ఆషామాషీగా ఆయన నోట ఆ మాట వచ్చేయలేదు. నిజంగానే ‘మూలవిరాట్టు’ అనేలానే మెగాస్టార్ చిరంజీవిని తాజా లుక్‌లో చూపించాడు దర్శకుడు బాబి అలియాస్ కె.ఎస్. రవీంద్ర.
Also Read: అభద్రతాభావంపై రష్మికాస్త్రం.. అసలేమైంది చెప్మా.?
‘ఆచార్య’ విడుదలకు సిద్ధమవుతోంది. ‘భోళా శంకర్’ పట్టాలెక్కుతోంది.. వీటితోపాటే ‘గాడ్ ఫాదర్’ సినిమా. ఇంతలోనే, ఇదిగో.. బాస్ పూనకం.. అంటూ కొత్త సినిమా అనౌన్స్‌మెంట్.. ప్రారంభోత్సవం. అభిమానులు ఆ బాస్ పూనకాల్లోనే (Megastar Chiranjeevi) మునిగి తేలాలంతే.