ప్రత్యక్ష రాజకీయాల్లోకి అల్లు అర్జున్.?
Allu Arjun Active Politics.. సినీ నటుడు అల్లు అర్జున్, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడట. ఏంటీ, ఇది నిజమేనా.?
ఔను, ‘పుష్ప’ స్టార్ అల్లు అర్జున్ (Pushpa Star Allu Arjun) ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి తీరాల్సిందేనంటోంది ‘అల్లు అర్జున్ ఆర్మీ’.!
పిలవకపోయినా వచ్చా.. వద్దన్నా వచ్చా.. అంటూ వైసీపీ అభ్యర్థి కోసం నంద్యాల వెళ్ళినప్పుడు వ్యాఖ్యానించాడు అల్లు అర్జున్. దేనికి వెళ్ళావ్.? ఓడించడానికే కదా.? అంటే, అవుననే అనుకోవాలేమో.!
Mudra369
ఒకవేళ అల్లు అర్జున్, ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనుకుంటే, అందులో తప్పేముంది.? అది ఆయన ఇష్టం. రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు.
ఏదన్నా రాజకీయ పార్టీలో అల్లు అర్జున్ చేరొచ్చు.. లేదంటే, సొంత రాజకీయ పార్టీ ఏర్పాటు చేసుకోవచ్చు. ఆయన వెసులుబాటుని బట్టి, ఏదైనా చేసుకోవచ్చు.
Allu Arjun Active Politics.. రాజకీయ తెరపై అల్లు అర్జున్ ప్రయాణమిలా..
2009 ఎన్నికల సమయంలో ప్రజారాజ్యం పార్టీ తరఫున ఎన్నికల ప్రచారంలో కనిపించాడు అల్లు అర్జున్. 2019 ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వెంట అల్లు అర్జున్ కనిపించిన సంగతి తెలిసిందే.
అటవీ శాఖ మంత్రి హోదాలో ఆంధ్ర ప్రదేశ్ డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ ఇటీవల కర్నాటక వెళ్ళి, ఎర్ర చందనం స్మగ్లింగ్ గురించీ, స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమాల గురించీ మాట్లాడితే, అల్లు అర్జున్ ఆర్మీతోపాటు అల్లు అర్జున్ ‘మామ’ ఎందుకు భుజాలు తడుముకున్నారన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్.
Mudra369
కానీ, 2024 ఎన్నికల్లో మాత్రం, అల్లు అర్జున్ వైసీపీ నేత శిల్పా రవితో కలిసి కనిపించారు. వైసీపీకి ఓటెయ్యమని చెప్పలేదుగానీ, శిల్పా రవిని గెలిపించాలని అభ్యర్థించారు అల్లు అర్జున్.
అదే సమయంలో, జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కి అనుకూలంగా సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఒకట్రెండు పోస్టులు పెట్టిన సంగతి తెలిసిందే.
కవ్వింపు చర్యలేలా.?
వైసీపీ అభ్యర్థి కోసం ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వెళ్ళడం వివాదానికి కారణమయ్యింది. ఇట్నుంచి కవ్వింపు చర్యలు షురూ అవడంతో, అట్నుంచి కౌంటర్ ఎటాక్ మొదలైంది.
ఈ గందరగోళం నడుమ, ఇప్పుడు ఎలాగైనా అల్లు అర్జున్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి రావాలనీ, కొత్త రాజకీయ పార్టీ పెట్టాలనీ ‘అల్లు అర్జున్ ఆర్మీ’ డిమాండ్ చేసేస్తోంది.
ముందే చెప్పుకున్నట్లు రాజకీయాల్లోకి ఎవరైనా రావొచ్చు. కాకపోతే, ప్రస్తుతానికి ఇదంతా అల్లు అర్జున్ ఆర్మీ (Allu Arjun Army) అత్యుత్సాహమే.
అదే సమయంలో, అల్లు అర్జున్ భార్య స్నేహా రెడ్డికి తండ్రి అయిన కంచర్ల చంద్రశేఖర్ రెడ్డి మాత్రం, తన అల్లుడిని రాజకీయాల్లోకి తీసుకురావాలని తెగ ఆరాటపడుతున్నట్టున్నారు.
Also Read: లేటెస్ట్ ట్రోల్ మెటీరియల్ రుహానీ శర్మ.! కానీ, ఎందుకిలా.?
ఈ విషయమై అల్లు అర్జున్ ఏమనుకుంటున్నాడో.. తన ‘ఆర్మీ’కి అల్లు అర్జున్ ఎలా సమాధానం చెప్పుకుంటాడో.. రాజకీయాల విషయమై అతనెలాంటి నిర్ణయం తీసుకుంటాడో వేచి చూడాలి.