Megastar Chiranjeevi MSVPG.. మెగాస్టార్ చిరంజీవి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో ఇటీవల ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సినిమా ఘన విజయాన్ని అందుకుంది కూడా.!
350 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్ళు దాటి, 400 కోట్ల రూపాయల రికార్డు దిశగా ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమా దూసుకుపోతోంది.
గత కొన్నాళ్ళుగా సినిమాకి దూరమైపోయిన ఫ్యామిలీ ఆడియన్స్‌ని ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో, తిరిగి రప్పించారు మెగాస్టార్ చిరంజీవి.
రోజులు గడుస్తున్నాయ్.. బాక్సాఫీస్ దగ్గర సగటు సినీ అభిమాని సందడి కొనసాగుతూనే వుందంటే, అది ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో థియేటర్లకు ప్రేక్షకుల్ని చిరంజీవి రప్పించిన తీరుకి నిదర్శనం.
సహజంగానే ఈ విజయం, తెలుగు సినిమాకి కొండంత ఉత్సాహం ఇస్తుందన్నది నిర్వివాదాంశం. పాన్ ఇండియా సినిమాల ట్రెండ్‌లో పడి, నేల విడిచి సాము చేస్తోంది తెలుగు సినిమా.
Megastar Chiranjeevi MSVPG.. ఫ్యామిలీ ఆడియన్స్‌ని థియేటర్లకు రప్పించగలిగితేనే..
పైగా, ఫ్యామిలీ ఆడియన్స్ పెదవి విరిచే సినిమాలే వస్తున్నాయి ఇటీవలి కాలంలో. ఇప్పుడు ట్రెండ్ మళ్ళీ మారబోతోంది. ఫ్యామిలీ ఆడియన్స్‌ని మెప్పించే సినిమాలు రాబోతున్నాయి.
‘మంచి ఫ్యామిలీ కథతో సినిమా చేద్దాం..’ అనే మాట అగ్ర హీరోల నుంచి యంగ్ హీరోల వరకూ వినిపిస్తోందిప్పుడు. ఆహ్వానించదగ్గ మార్పే కదా ఇది.!
ఎప్పుడైతే, ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్లకు క్యూ కడతారో, అప్పుడే సినిమా బాగు పడుతుంది. రిపీట్ వాల్యూ వున్నప్పుడే కదా, ఓటీటీ డీల్స్ కూడా బావుంటాయ్.
Also Read: మిల్కీ బ్యూటీ తమన్నా ట్రెండీ సిగ్నేచర్.!
ఎలా చూసినా, ‘మన శంకర వర ప్రసాద్ గారు’ సినిమాతో, తెలుగు సినిమాకి మళ్ళీ కొత్త కళ వచ్చిందన్నది నిర్వివాదాంశం.
దర్శకుడు అనిల్ రావిపూడికీ, ఈ సినిమాలో స్పెషల్ రోల్ చేసిన వెంకటేష్‌కీ స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకోవాలి.
అన్నిటికీ మించి, చిత్ర నిర్మాణ సంస్థల్ని మరింత ప్రత్యేకంగా అభినందించి తీరాల్సిందే ఎవరైనా.
