Table of Contents
Megastar Chiranjeevi Political Pakodi రాజకీయమంటే పకోడీ వ్యాపారమైపోయింది.! నియోజకవర్గంలో రోడ్ల మీద శ్రద్ధ లేదు.! ప్రజా సమస్యలపై అసలే బాధ్యత లేదు.!
కానీ, సినిమా హీరోల రెమ్యునరేషన్ల గురించి చట్టసభల్లో మాట్లాడేస్తున్నారు కొందరు రాజకీయ మేధావులు.! అదే అసలు సమస్య.!
గుట్కా రాజకీయాలు, పకోడీ రాజకీయాలే కాదు.. పక్కలేసే రాజకీయాలు చేసేటోళ్ళు కూడా, మెగాస్టార్ చిరంజీవి మీద విమర్శలు చేయడమా.? అని చిరంజీవి అభిమానులు ప్రశ్నించడంలో వింతేముంది.?
Megastar Chiranjeevi Political Pakodi.. గుట్కా పకోడీ.!
గుట్కా పాండు.. గుడిసేటి గుట్కా.! ఇలా చాలా పేర్లున్నాయ్ ఆ ప్రజా ప్రతినిథికి.! సదరు, పకోడీ పాండు.. ఈ మధ్యనే, చిరంజీవి మీద ‘గుట్కా’ నోరు పారేసుకున్నాడు.!
నవ్విపోదురుగాక.? అన్న చందాన అడ్డగోలు విమర్శలు చేశాడాయన.! లేకపోతే, చిరంజీవిని (Mega Star Chiranjeevi) ‘పకోడీగాడు’ అనడమేంటి.?
తీరా, చిరంజీవి పుట్టినరోజునాటికి ఆ ‘పాండు’ అనూహ్యంగా ‘తూచ్’ అనేశాడు.! ‘చిరంజీవిని విమర్శిస్తే ఏమవుతుందో నాకు తెలియదా.? నేనెందుకు అలా అంటాను.?’ అంటూ అమాయకత్వం నటించాడు.
తొర్రిగాడి సంగతేంటి.?
సరే పాండూ.! చేసిన తప్పుకి లెంపలేసుకున్నట్టే వున్నావ్.. ఇంతకీ, మీ తొర్రిగాడి సంగతేంటి.? అని మెగాభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

‘నేనూ చిరంజీవి అభిమానినే. కానీ, మమ్మల్ని రాజకీయంగా విమర్శిస్తే మేం ఊరుకుంటామా.?’ అంటూ రెచ్చిపోయాడా తొర్రి పొలిటీషియన్.!
వస్తాడు.. రేపో మాపో వస్తాడు.! ‘అబ్బే, అన్నయ్య అంటే నాకు అభిమానం’ అంటూ కథలు చెప్తాడు.! అన్నది మెగాభిమానుల గట్టి నమ్మకం.
తిన్నింటి వాసాలు లెక్కెట్టే పుష్పం.!
చిరంజీవి ఇంట్లో నచ్చిన వంటకాన్ని ప్రత్యేకంగా వండించుకుని మరీ తినే, ఓ రాజకీయ పుష్పం.. చిరంజీవి వల్ల ఎవరికి లాభం.? అంటూ ప్రశ్నించేసింది మొన్నీమధ్యనే.
Also Read: సచ్చిపోతే.. సూపించొద్దు.! పోసాని రూటే సెపరేటు.!
డిక్కీ బలిసిన విమర్శలు చేయడంలో ఆ రాజకీయ పుష్పం ప్రదర్శించే పైత్యం అంతా ఇంతా కాదు.! ఆ ఎర్రి పుష్పం కూడా తన తప్పు తెలుసుకునే రోజు తొందరలోనే వస్తుందా.? ఎందుకు రాదని ప్రశ్నిస్తున్నారు మెగా ఫ్యాన్స్.!
ఇక్కడో విషయం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.. ఆకాశం మీద ఉమ్మేస్తే ఏమవుతుంది.? తిరిగొచ్చి మొహాన పడుతుంది.! ఇది పొలిటికల్ పకోడీగాళ్ళు తెలుసుకుంటే మంచిది.!