మెగాస్టార్ చిరంజీవి ముందుకు ‘రెమ్యునరేషన్ (Megastar Chiranjeevi Remuneration) తగ్గించుకోవచ్చు కదా..’ అన్న ప్రశ్న వచ్చింది. ‘ఎందుకు తగ్గించుకోవాలి.?’ అంటూ ఎదురు ప్రశ్నించారాయన.
‘సినిమా బడ్జెట్‌లో హీరోల రెమ్యునరేషనే చాలా చాలా ఎక్కువ.. అది తగ్గించుకోండి..’ అంటూ నిస్సిగ్గుగా కొందరు రాజకీయ నాయకులు, పైగా మంత్రులు ఉచిత సలహాలిచ్చేశారు.
పవన్ కళ్యాణ్ (Power Star Pawan Kalyan) మీద రాజకీయ మంటతో సోకాల్డ్ పొలిటీషియన్లు చేసిన చెత్త కామెంట్లు అవి. మంత్రులు తమ గౌరవ వేతనాలు, లగ్జరీల తగ్గించుకుంటారా.? తగ్గించుకోరు కదా.?
నిజమే.. విన్ విన్ సిట్యుయేషన్ వుండాలి.. అదెప్పుడూ వుంటుంది కూడా. నాకే కావాలని ఎవరూ అనుకోరు.. అనుకుంటే, సినీ పరిశ్రమలో రాణించడం కష్టం
చిరంజీవి
పైగా, మంత్రులు అదనపు హంగులు సమకూర్చుకుంటుంటారు.. అదీ ప్రభుత్వ ఖజానా నుంచి. సరే, రాజకీయాల్ని పక్కన పెట్టేద్దాం.
Megastar Chiranjeevi Remuneration.. నిర్ణయించేది నిర్మాతే..
సినిమాల గురించే మాట్లాడుకోవాల్సి వస్తే, ఏ హీరోకి ఎంత రెమ్యునరేషన్ ఇవ్వాలనేది నిర్మాత డిసైడ్ చేస్తాడు.

చిరంజీవి (Megastar Chiranjeevi) అడిగితే వంద కోట్ల రెమ్యునరేషన్ ఏ నిర్మాత కూడా ఇవ్వరు. ఆయా హీరోల బాక్సాఫీస్ స్టామినాని బట్టే రెమ్యునరేషన్లు డిసైడ్ అవుతాయి.
‘నిజమే.. విన్ విన్ సిట్యుయేషన్ వుండాలి.. అదెప్పుడూ వుంటుంది కూడా. నాకే కావాలని ఎవరూ అనుకోరు.. అనుకుంటే, సినీ పరిశ్రమలో రాణించడం కష్టం..’ అని చిరంజీవి చెప్పుకొచ్చారు.
Also Read: Anasuya Bhardwaj: సూపుల్తో గుచ్చేసి సంపెయ్యమాకె.!
కనిపించరుగానీ.. మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఒక్కో ప్రశ్నకీ గూబ గుయ్యిమనేలా సమాధానమిచ్చేస్తున్నారు. ఎవరికి.? అన్నది మాత్రం.. ఆ దెబ్బ తిన్నవారికి మాత్రమే తెలుస్తుంది.
ఓ సినిమాకి ఎంత బడ్జెట్ పెట్టాలి.? హీరోయిన్ రెమ్యునరేషన్ ఎంత.? ఎవరు దర్శకుడైతే బావుంటుంది.? సంగీత దర్శకుడిగా ఎవర్ని ఎంపిక చేయాలి.?
ఏ హీరోతో సినిమా చేస్తే మార్కెట్ వుంటుంది.? ఇలా చెప్పుకుంటూ పోతే బోల్డంత వ్యవహారం. అది సినిమాకి సంబంధించిన విషయం. ఇందులో రాజకీయ నాయకుల జోక్యమేంటి సిగ్గు లేకపోతేనూ.!