Megastar Chiranjeevi Remuneration 65Cr.. మెగాస్టార్ చిరంజీవి రెమ్యునరేషన్ ఎంత.? ఈ విషయమై భిన్న వాదనలున్నాయ్. 30 కోట్లకి కాస్త అటూ ఇటూగా వుంటుందని నిన్న మొన్నటిదాకా ప్రచారం జరిగింది.
అయితే, ‘వాల్తేరు వీరయ్య’ సినిమాకే 50 కోట్ల రెమ్యునరేషన్‌ని చిరంజీవి తీసుకున్నారనీ, ఆ తర్వాత అది 65 కోట్లకు చేరిందనీ, ‘భోళా శంకర్’ రచ్చ నేపథ్యంలో బయటపడింది.
ఇంతకీ, ఇదంతా నిజమేనా.? రోజుకి రెండు కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు ‘బ్రో’ సినిమా విషయమై పవన్ కళ్యాణ్ ఓ రాజకీయ వేదికపై చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారానికి కారణమయ్యాయ్.
50 కోట్ల పై మాటే..
మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు సినిమా పరిశ్రమలో తిరుగులేని స్టార్.! సక్సెస్, ఫెయిల్యూర్.. వీటికి అతీతంగా ఎదుగుతూ వచ్చింది చిరంజీవి స్టార్‌డమ్.
చిరంజీవికి వయసైపోయిందనీ, ఆయన ఇక రిటైర్మెంట్ తీసుకోవాలని ‘శంకర్ దాదా సిందాబాద్’ సమయంలోనే కొందరు బోడి సలహాలిచ్చారు.

రాజకీయాల్లోకి వెళ్ళాక, సినిమాలకు దూరమైన చిరంజీవి, రీ-ఎంట్రీలో 100 కోట్ల క్లబ్బులోకి తన సినిమాని చేర్చి, ‘ఖైదీ నెంబర్ 150’తో సూపర్ హిట్ కొట్టారు.
ఈ నేపథ్యంలో 50 కోట్ల పైన రెమ్యునరేషన్ తీసుకుంటున్న హీరోల్లో చిరంజీవి తన పేరుని చేర్చడమంటే చిన్న విషయం కాదు.
Megastar Chiranjeevi Remuneration 65Cr.. తిరిగిచ్చేశారా.?
‘ఆచార్య’ సినిమా విషయంలో చిరంజీవి కొంత రెమ్యునరేషన్ వదులుకున్నమాట వాస్తవం. అదెంత.? అన్నదానిపై భిన్న వాదనలున్నాయి.
ఇక, ‘భోళా శంకర్’ సినిమా విషయంలోనూ, నిర్మాత శ్రేయస్సుని ఆకాంక్షించి దాదాపు పది కోట్లు వదులుకున్నారన్నది తాజా ఖబర్.
Also Read: కర్ర పెత్తనం.! ‘పులి’ రాజా.. పారిపో.!
సినిమాలకు చిరంజీవి తీసుకునే రెమ్యునరేషన్ ప్యాటర్న్ మిగతా హీరోలతో పోల్చితే భిన్నంగా వుంటుంది. అది ఆయనతో సినిమాలు చేసే నిర్మాతలకు చాలా అనుకూలంగా వుంటుంది.
అందుకే, ఫ్లాప్ వచ్చినా.. ఏ నిర్మాత కూడా చిరంజీవిని వదులుకునేందుకు ఇష్టపడరు. ‘భోళా శంకర్’ నిర్మాత అనిల్ సుంకర కూడా అంతే.

సో.. ఎలా చూసినా, తదుపరి సినిమాకి చిరంజీవి రెమ్యునరేషన్ కనీసంగా డెబ్భయ్ కోట్లకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదన్నమాట.
ఫలితం తేడా వస్తే, నిర్మాతని ఆదుకునేందుకు చిరంజీవి సిద్ధంగా వుంటారు గనుక.. చిరంజీవితో ఎలాంటి రిస్క్ చేయడానికైనా నిర్మాతలెప్పుడూ సిద్ధంగానే వుంటారు.
అన్నట్టు.. సినిమా హిట్టయితే, నిర్మాతకు వచ్చే లాభాలు.. అనూహ్యంగానే వుంటాయ్ మరి.!