Table of Contents
Megastar Chiranjeevi Thuntarodu.. ఔను, మెగాస్టార్ చిరంజీవికి తుంటరితనం పోలేదు.! లేకపోతే, ‘మీసాల పిల్ల’ అంటూ, నయనతారతో రొమాంటిక్ పాటేసుకోవడమేంటి.?
చిరంజీవి మాత్రమే కాదు, దర్శకుడు అనిల్ రావిపూడి, కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి, పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్.. అందరూ ఒకర్ని మించిన తుంటరోళ్ళు ఇంకొకరు.!
డెబ్భయ్ ఏళ్ళ వయసులో, మెగాస్టార్ చిరంజీవి అంత తేలిగ్గా, అంత గ్రేస్‌తో స్టెప్పులేసేస్తే, ఎవడికైనా ఎక్కడ కాలాలో అక్కడే కాలిపోతుంది.!
ఇక్కడ, ఎవడికైనా.. అన్న ప్రస్తావన గురించి తర్వాత మాట్లాడుకుందాం.
మెగాస్టార్ చిరంజీవికి అలాంటి డ్రెస్సులేయడమేంటి.? అస్సలు బాలేదు.! చిరంజీవికి అలాంటి కళ్ళద్దాలు పెట్టడమేంటి ఏమాత్రం బాలేదంతే.!
నయనతార అలా కసురుకుంటోంటే, చిరంజీవి బుంగమూతి పెట్టడం నాన్సెన్స్.! ఆ లిరిక్స్ కూడా చిరంజీవి వయసుకు తగ్గట్టు లేవు.!
అసలు ఆ స్టెప్పులేంటి.? ఆ సినిమాటోగ్రఫీ ఏంటి.? ఆ మ్యూజిక్ ఏంటి.? అన్నీ చిరంజీవి వయసుకు తగ్గట్టుగానే కదా వుండాల్సింది.?
Megastar Chiranjeevi Thuntarodu.. ఎవడికైనా.. ఔను, ఎవడికైనా సరే.!
ఇప్పుడు మళ్ళీ ఆ ‘ఎవడికైనా’ గురించి ప్రస్తావించుకుందాం. ‘ఎవడికైనా’ అనగా, ఓ వర్గానికి. అది పచ్చ కుల వర్గం కావొచ్చు.. నీలి కుల వర్గం కావొచ్చు.
ఆ ‘ఎవడికీ’ ఇప్పుడు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తుంటరితనం, ఏడు పదుల వయసులో కూడా, చిరంజీవి ఆ తుంటరితనాన్ని అస్సలు వదలడంలేదు.
లేకపోతే, దశాబ్దాలుగా కొందరికి నిద్ర లేని రాత్రుల్ని మిగిల్చారు చిరంజీవి, తన సక్సెస్‌తో. చిరంజీవిని విమర్శించడానికి, కుల ప్రస్తావన తీసుకురావాలా.? వాళ్ళ బతుకులే అంత.!
తాను ఏం చేయాలో, చిరంజీవి మాత్రమే డిసైడ్ చేసుకుంటారు. తన అభిమానులకు ఏం కావాలో, చిరంజీవి కంటే బాగా ఇంకెవరికి తెలుసు.?
చిరంజీవి.. డాన్స్ చేయాల్సిందే..
వయసు మీద పడ్డ ఏ హీరో నుంచి కూడా, ఆయా హీరోల అభిమానులు డాన్సుల్ని ఆశించరు. చిరంజీవికి అలా కాదు. అభిమానులు, ఆయన్ని ఇంకా కుర్రాడిలానే భావిస్తారు.. డాన్సుల్ని ఆశిస్తారు.
విజయ్ పోలాకి.. అనే అభిమాని, మెగాస్టార్ చిరంజీవి కోసం ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలోని ‘మీసాల పిల్ల’ పాటకి డాన్సులు కంపోజ్ చేసిన సంగతి తెలిసిందే.
చిరంజీవిది ఏడు పదుల వయసు.. అనేది మనసులోకి రాలేదు, కొరియోగ్రాఫర్‌కి. మెగాస్టార్ అంటే, తాను చిన్నప్పుడు చూసిన డాన్సింగ్ స్టార్ వయసు అక్కడే ఆగిపోయిందనుకున్నాడు.
తన అభిమాన హీరోని ఎలా స్క్రీన్ మీద చూడాలనుకున్నాడో, అలా చూపించాడు డాన్స్ కొరియోగ్రాఫర్ విజయ్ పోలాకి. ఆ అభిమానికి తగ్గట్టుగా చిరంజీవి మారిపోయారంతే.
రాతలోనూ తుంటరితనమే..
పాటల రచయిత భాస్కరభట్ల రవికుమార్ కలం నుంచి జాలువారిన పదాలు, ఆ పదాల అమరిక.. ఇవన్నీ చూస్తే, చిరంజీవిని తుంటరిగా చూపించాలన్న తపన కనిపిస్తుంది.
అది, పాటల రచయితకి చిరంజీవి మీదున్న అభిమానం.! తన వయసుని, మెగాస్టార్ వయసునీ మర్చిపోయి, పాటల రచయిత కూడా చిరంజీవిని కుర్రాడిలా చూపించాడు మరి.
ఇదే తుంటరితనం అంటే.! చిరంజీవి అలా గ్రేస్‌తో డాన్సులు వేస్తోంటే, ‘నీలి కుల వర్గానికీ’, ‘పచ్చ కుల వర్గానికీ’ ఎక్కడ లేని కంపరం పుట్టుకొచ్చింది.. అది సహజమే.
‘వాల్తేరు వీరయ్య’ సినిమాకి నెగెటివ్ రివ్యూలు, ట్రోలింగ్.. ఇవన్నీ ఆ ‘రెండు వర్గాల’ నుంచే జరిగాయ్. కట్ చేస్తే, సినిమా సూపర్ హిట్టు.!
ఏడు పదుల వయసైనా.. ఎనిమిది పదుల వయసైనా..
ఇంకో పదేళ్ళ తర్వాత.. అంటే, ఎనభయ్యేళ్ళ వయసు వచ్చాక కూడా, చిరంజీవి ఇలానే డాన్సులు చేస్తారేమో.!
ఎందుకంటే, అప్పుడూ చిరంజీవి అభిామనులు.. చిరంజీవికి ఓ పాటైనా కొరియోగ్రఫీ చేయాలనుకుంటారు. చిరంజీవి కోసం ఓ రొమాంటిక్ సాంగ్ రాయాలనుకునే లిరిసిస్టులు వుంటారు.
Also Read: పవన్ కళ్యాణ్‌కి ‘తమిళ షాక్’.! ఇది తెగులు పైత్యం.!
అన్నిటికీ మించి, చిరంజీవిని అలా ఫుల్ ఎనర్జీతో చూపించాలనుకునే దర్శకులూ వుంటారు. దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.! ఔను, చిరంజీవి అంటే తుంటరోడు.!
ఎంత తుంటరోడంటే.. చిరంజీవి కెరీర్ తొలినాళ్ళలో ఆయన డాన్సుల్ని చూసి, తోచిన రీతిలో గంతులేసిన కుర్రాళ్ళు కూడా ముసలైపోయారుగానీ, చిరంజీవి మనసు వయసు పెరగలేదు.
తుంటరోడు.. జెలసీ…
అప్పటి చిన్న పిల్లలు, నలభైలు దాటి.. యాభైలను టచ్ చేస్తున్నారు.. వాళ్ళకి కాళ్ళు నొప్పులు, నడుం నొప్పులు.! చిరంజీవికి మాత్రం.. అలాంటివేమీ లేవు. వున్నా, ఆయన కనబడనివ్వరు.!
తుంటరోడే కదా చిరంజీవి.. తన అభిమానులకీ జెలస్ తెప్పిస్తున్నారు.! దటీజ్ మెగాస్టార్ చిరంజీవి.! జై చిరంజీవ.!
చివరగా: దాదాపు ముప్ఫయ్ ఏళ్ళ క్రితం.. చిరంజీవి పాటలకి డాన్సులేస్తూ, ‘చిరంజీవి గాడు భలే ఏసాడ్రా..’ అని చెప్పుకున్న ముచ్చట్లు గుర్తుకొచ్చాయ్ ఈ ఆర్టికల్ రాసేటప్పుడు.!
అందుకే, హెడ్డింగులో ‘గాడు’ పెట్టాల్సి వచ్చింది. అప్పటికీ ఇప్పటికీ.. చిరంజీవిలోని ‘తుంటరోడు’, అదే ఎనర్జీతో వున్నాడు.
కాకపోతే, ఇప్పుడు చిరంజీవి ‘గాడు’ కాదు, కోట్లాది మంది అభిమానులకు ఆరాధ్య దైవం.! అదేనండీ, ‘గాడ్’.! జై చిరంజీవ.!
- yeSBee

