Table of Contents
Pawan Kalyan Murugan Tamilnadu.. వ్యూస్ పెరగాలంటే, థంబ్ నెయిల్స్ అదిరిపోవాలి.! అందుకే, విషయం వున్నా లేకపోయినా ‘షాక్’ అనే టైటిల్ అయితే పెట్టేయాలి.!
మీడియాలో పెరిగిపోయిన భావదారిద్ర్యానికి ఇంతకన్నా నిదర్శనం ఇంకేం కావాలి.? యూ ట్యూబ్ ఛానళ్ళు అయినా, మెయిన్ స్ట్రీమ్ మీడియా అయిినా.. అందరిదీ ఒకటే దారి.!
అక్కడసలు విషయమేంటి.? ఏం జరుగుతోంది.? అది, ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తుంది.. ఇవన్నీ అనవసరం. ‘షాక్’ అనేయాల్సిందే.. షాక్ తినేయాల్సిందే.
Pawan Kalyan Murugan Tamilnadu.. తమిళనాడులో అసలేం జరిగింది..
మురుగన్ భక్తుల సమ్మేళనం (మురుగన్ మానాడు) కొద్ది రోజుల క్రితం తమిళనాడులో జరిగింది. తమిళనాడు బీజేపీ, పలు ఆధ్మాత్మిక సంస్థలు ఈ కార్యక్రమాన్ని నిర్వహించాయి.
సనాతన ధర్మ పరిరక్షకుడిగా యావత్ భారతదేశం కొనియాడుతున్న ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్, ఈ మురుగన్ భక్తుల సమ్మేళనంలో పాల్గొన్నారు.

వేదికపై కొందరు వక్తలు, హిందూ ధర్మం గురించి చెప్పారు. ఈ క్రమంలో సనాతన ధర్మంపై విషం చిమ్ముతున్న కొందరికి తీవ్ర హెచ్చరికలూ జారీ చేశారు.
అలా తీవ్ర హెచ్చరికల నేపథ్యంలో, తమిళనాడు ప్రభుత్వం చర్యలకు సిద్ధమైంది. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారంటూ తమిళనాడు బీజేపీ నేతలపై కేసులు నమోదయ్యాయి.
పవన్ కళ్యాణ్ ప్రస్తావన ఏదీ.. ఎక్కడ.?
పవన్ కళ్యాణ్‌కి షాక్.. తమిళనాడులో పవన్ కళ్యాణ్‌పై ఫిర్యాదు, కేసు నమోదు.. అంటూ, తెగులు మాఫియా.. అదేనండీ, తెలుగు మీడియాలో ప్రచారం షురూ అయ్యింది.
ప్రస్తుతానికి అందుబాటులో వున్న సమాచారం ప్రకారం, ఎక్కడా.. ఏ కేసులోనూ.. పవన్ కళ్యాణ్ పేరు ప్రస్తావించబడలేదు. మరెందుకు, తెగులు మీడియా ‘షాక్’ అంటూ అతి చేస్తున్నట్లు.?
దీన్నే మీడియా పైత్యం.. మీడియా భావదారిద్ర్యం.. అంటారు. విషయం లేని చోట, వివాదాన్ని సృష్టించడం తెగులు మీడియాకి వెన్నతో పెట్టిన విద్య.
పవన్ కళ్యాణ్ మీద కేసు నమోదైతే ఏమవుతుంది.?
రాజకీయ నాయకులకు కేసులు కొత్త కాదు కదా.! హత్య కేసుల్లోనూ, హత్యాచారం కేసుల్లోనూ రాజకీయ నాయకులకు సులువుగా ‘వెసులుబాట్లు’ దొరుకుతున్న రోజులివి.
Also Read: రాజకీయోన్మాదం: ఎవర్ని, ఎందుకు ‘రప్పా.. రప్పా..’ నరుకుతారు.?
అలాంటిది, హిందూ ధర్మం గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడితే, అరెస్టు చేసేస్తారా.? తన దాకా వస్తే, న్యాయ పోరాటం పవన్ కళ్యాణ్ చేయకుండా వుంటారా.?
ఇవన్నీ మన తెగులు మీడియాకి తెలియవని అనుకోలేం. కాకపోతే, పవన్ కళ్యాణ్ అంటే ఓ రకమైన రోగం ఈ తెలుగు మీడియాలో ఓ వర్గానికి. అదీ అసలు సమస్య.