Table of Contents
Megastar Chiranjeevi Vishwambhara VFX.. ఎలాగైనా మెగాస్టార్ చిరంజీవి సినిమాని తొక్కెయ్యాలి.. అంటూ చాలాకాలంగా ప్రయత్నాలు జరుగుతూనే వున్నాయి.
రాజకీయాల్లోకి వెళ్ళి, చాలాకాలం సినిమాలు మానేసి.. తిరిగి సినిమాల్లోకి చిరంజీవి రీ-ఎంట్రీ ఇచ్చాక, ఈ కుట్రలు ఇంకా ఎక్కువైపోయాయ్ చిరంజీవి మీద.
అంతకు ముందూ చిరంజీవి సినిమా మీద దుష్ప్రచారం చేయడం అనేది వున్నా, ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాతో వంద కోట్ల క్లబ్‌లో చిరంజీవి చేరిక, పరిస్థితి మరింత దారుణంగా తయారైంది.
Megastar Chiranjeevi Vishwambhara VFX.. వాల్తేరు వీరయ్యపైనా విషం చిమ్మిన వైనం..
‘వాల్తేరు వీరయ్య’ సినిమా విషయంలో ఏం జరిగిందో చూశాం. దారుణమైన ట్రోలింగ్ జరిగింది.. కానీ, సినిమా సూపర్ డూపర్ హిట్టయ్యింది.
సినిమా అన్నాక హిట్టూ.. ఫ్లాపూ సహజం.. ట్రోలింగ్ వల్ల సినిమాలు ఆడకపోవడం అనేది జరగదు. కాకపోతే, కొంతమంది పైశాచికానందం.. అంతే.! అది వాళ్లకీ తెలుసు.
తాజాగా, ‘విశ్వంభర’ సినిమా మీద పెయిడ్ నెగెటివిటీ షురూ అయ్యింది. కొన్ని ‘కుల’ మీడియా సంస్థలు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయి.
వీటిల్లో పచ్చ ‘కుల’ మీడియా సంస్థలతోపాటు, నీలి ‘కుల’ మీడియా సంస్థలూ వున్నాయి. మరీ ముఖ్యంగా ఈ నీలి ‘కుల’ మీడియా సంస్థల పైత్యం మరీ ఎక్కువ.
నచ్చడం.. నచ్చకపోవడం.. ఇవి వేరే..
‘విశ్వంభర’ సినిమా టీజర్ ఇటీవల విడుదలైంది. చాలామందికి నచ్చింది, కొంతమందికి నచ్చలేదు. నచ్చడం, నచ్చకపోవడం.. అన్నది వారి వారి ఇష్టాఇష్టాలను బట్టి వుంటుంది.
అయితే, వచ్చింది జస్ట్ ‘టీజర్’ మాత్రమే. వీఎఫ్ఎక్స్ విషయంలో సోకాల్డ్ కుల మాఫియా.. అదే, కుల మీడియా.. పిచ్చి రాతలు మొదలు పెట్టింది.
సినిమా ఔట్ పుట్‌కి సంబంధించి ఫస్ట్ కాపీ రావడానికి చాలా సమయం పడుతుంది. వీఎఫ్ఎక్స్ ఆధారిత సినిమాలకి.. చివరి నిమిషం వరకూ ‘వర్క్’ జరుగుతూనే వుంటుంది.
Megastar Chiranjeevi Vishwambhara VFX.. ఎందుకింత ఏడుపు.?
అలాగే ‘విశ్వంభర’ విషయంలోనూ జరుగుతోంది. టీజర్‌లో వీఎఫ్ఎక్స్ విషయమై సాధారణంగా అయితే ఎలాంటి లోటుపాట్లూ లేవు. కానీ, అంతకు మించి ఫైనల్ వెర్షన్‌లో అద్భుతాలుంటాయన్నది నిర్వివాదాంశం.
ఈలోగా, ‘విశ్వంభర’ సినిమాని ఎలాగైనా ‘కిల్’ చేసెయ్యగలమన్న కోణంలో నీలి ‘కుల’ మాఫియా, విశ్వ ప్రయత్నాలూ చేస్తోంది. దీని వెనుక రాజకీయ కుట్ర కూడా సుస్పష్టం.
నీలి పాత్రికేయం.. నెత్తుటి కూడు.!
ఓ పార్టీ విసిరే ఎంగిలి మెతుకుల కోసం కక్కుర్తి పడుతున్న నీలి ఎర్నలిస్టులు, ఆ నీలి మాఫియా.. అదే నీలి మీడియా ద్వారా ‘విశ్వంభర’ సినిమాపై విషం కక్కుతున్న వైనం హీనాతి హీనం.
Also Read: అదేదో.. చెప్పి చెయ్యొచ్చు కదా సమంతా.?
ప్రతి ఆర్టికల్ కోసం నీలి పార్టీ నుంచి వచ్చే నెత్తుటితో కలిసిన కరెన్సీ నోట్లు అందుకుంటున్న మీడియా సంస్థల్ని మాఫియా.. అంటే అందులో తప్పేముంటుంది.?
రోత రాతలు రాసే ఎర్నలిస్టులు తాము నెత్తుటి కూడు తింటూ, తమ కుటుంబ సభ్యులకీ అదే నెత్తుటి కూడు తినిపిస్తున్నామని తెలుసుకోకపోతే ఎలా.?