Mehreen Pirzada Beauty In Red: ‘చెప్పానా.. నేను చెప్పానా..’ అంటూ చాలా క్యూటుగా ‘కృష్ణగాడి వీర ప్రేమగాధ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది బొద్దుగుమ్మ మెహ్రీన్ పిర్జాదా.
తక్కువ సినిమాలతోనే ఎక్కువ గుర్తింపు తెచ్చుకున్నా, ఎందుకో అగ్ర హీరోయిన్.. అన్న ట్యాగ్ అయితే దక్కించుకోలేకపోయింది ఈ బ్యూటీ.
‘ఎఫ్2’ సినిమాతో ‘హనీ ఈజ్ ది బెస్ట్..’ అంటూ మరోమారు క్యూటు క్యూటుగా కుర్రకారుకి గాలమేసిన ఈ బ్యూటీ, తెలుగులోనే కాదు, తమిళ సినిమాల్లోనూ, హిందీ సినిమాల్లోనూ నటించింది.
Mehreen Pirzada Beauty In Red పెళ్ళికి ముందే.. తెగతెంపులు.!
ఆ మధ్య పెళ్ళి పీటలెక్కడానికీ సిద్ధమయ్యిందిగానీ, అనూహ్యంగా పెళ్ళికి కొద్ది రోజుల ముందర.. షాకిచ్చింది.. పెళ్ళి పీటలెక్కడంలేదంటూ తేల్చి చెప్పేసింది.

మళ్ళీ సినిమాల్లో బిజీ అయిపోయి, ఒకటీ అరా సినిమాలతో ‘మమ’ అనిపించేస్తోందిప్పుడు.
వీలు చిక్కితే సోషల్ మీడియా వేదికగా ‘చక్కనైన’ ఫొటోల్ని షేర్ చేయడమే కాదు, తనదైన స్టయిల్లో ‘కథలు’ కూడా చెబుతుంటుంది తన కొటేషన్లతో.
తాజాగా, ఇదిగో ఇలా ఎరుపెక్కిన అందాన్ని సోషల్ మీడియాలో ఆవిష్కరిస్తూ, ‘నా అద్భుతమైన కథలో నేను..’ అంటూ తన గురించి తాను చాలా చాలా అందంగా చెప్పేసుకుంది.
ఏమాటకామాటే చెప్పుకోవాలంటే.. ఎరుపు రంగు ఆమెను భలే ఎలివేట్ చేస్తోంది కదూ.!

Also Read: సన్నీపాపకి కాసుల పంట.. వాళ్లకేమో నష్టాల మంట.!
చక్కనమ్మ ఏం చెప్పినా అందమే.! ఔను, అద్భుతమైన కథలు మెహ్రీన్.. ఆ కథలో ఆమే రాకుమారి.! ఆమెను అభిమానించేవారికీ ఆమె కలల రాకుమారే.!