Mehreen Pirzada Egg Freezing.. ఎగ్ ఫ్రీజింగ్.. ఫ్రీజింగ్ ఎగ్స్.. పేరు ఏదైతేనేం.. ఇదొక మెడికల్ ప్రొసిడ్యూర్.! వైద్య విధానం.! ఇంకా సరిగ్గా చెప్పాలంటే, ‘ఎగ్స్’ భద్రపరచుకోవడం.!
యుక్త వయసులో వున్నప్పుడే ‘ఎగ్స్’ ఫ్రీజ్ చేసుకోగలిగితే, వయసు మీద పడ్డాక తల్లి అవ్వాలనుకునేవారికి పెద్దగా సమస్యలుండవు.
కాలం మారింది.! యుక్త వయసులో పెళ్ళిళ్ళు జరగడంలేదు. కెరీర్ వెంట పరుగులు పెడుతున్న దరిమిలా.. అమ్మాయిలైనా, అబ్బాయిలైనా పెళ్ళిని వాయిదా వేస్తున్నారు.
పోనీ, సరైన వయసులోనే పెళ్ళి చేసుకుంటున్నారనుకున్నా, పిల్లల్ని కనేందుకు సమయం తీసుకుంటున్నారు.
ఈ క్రమంలోనే ఫ్రీజింగ్ ఎగ్ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది. ఇదీ అసలు సంగతి.
Mehreen Pirzada Egg Freezing.. మెహ్రీన్ మీదనే ఎందుకిలా.?
ఎగ్ ఫ్రీజింగ్ విధానం గురించి పలువురు సెలబ్రిటీలు ఈ మధ్య గట్టిగా మాట్లాడుతున్నారు.
ఆయా సంస్థలకు బ్రాండ్ అంబాసిడర్లుగా మారిపోయినట్లే వ్యవహరిస్తున్నారా.? లేదంటే, తమ భవిష్యత్తు విషయమై జాగ్రత్త పడుతున్నారా.? అన్నది వేరే చర్చ.

అలా మాట్లాడుతున్నవారి లిస్టులో నటి మెహ్రీన్ పిర్జా కూడా చేరిపోయింది. ఈ విషయమై సోషల్ మీడియా వేదికగా ఓ వీడియో కూడా రిలీజ్ చేసింది మెహ్రీన్ పిర్జాదా.
అంతే, పెళ్ళి కాకుండానే తల్లవుతున్న మెహ్రీన్.. అంటూ, కుప్పలు తెప్పలుగా కథనాలు పుట్టుకొచ్చేశాయ్. దాంతో, ఒళ్ళు మండిపోయింది మెహ్రీన్‌కి.
తన మీద గాలి వార్తల్ని పోగేస్తున్న మీడియా సంస్థలకు క్లాస్ తీసుకుంది మెహ్రీన్ పిర్జాదా. ఎగ్ ఫ్రీజింగ్ అనేది మహిళా లోకానికి ఓ వరం.. అంటోంది మెహ్రీన్.
తానేమీ గర్భవతిని కాదనీ, పుకార్లు ఎవరూ నమ్మొద్దనీ మెహ్రీన్ పేర్కొంది. అదండీ అసలు సంగతి.!