Mehreen Pirzada Gossip Queen.. హనీ ఈజ్ ది బెస్ట్.. అంటూ క్యూటు క్యూటుగా ‘ఎఫ్2’ సినిమాలో సందడి చేసిన మెహ్రీన్, ఇప్పుడు ఏకంగా గాసిప్ క్వీన్ అవతారమెత్తేసింది.
‘ఎఫ్3’ సినిమా షూటింగ్ స్పాట్‌లో గాసిప్ క్వీన్ ఎవరంటే అంతా ఠక్కున మెహ్రీన్ పేరే చెబుతారట. అంతలా గాసిప్స్ ఏం చెబుతుందోగానీ, మెహ్రీన్ కూడా ఈ ‘గాసిప్ క్వీన్’ ట్యాగ్‌ని ఎంజాయ్ చేసేస్తోంది.
‘నిన్ను అంతా గాసిప్ క్వీన్ అంటారట కదా.? నటి ప్రగతి మీద ఎలాంటి గాసిప్ సృష్టిస్తావ్.?’ అనడిగితే, ఏకంగా ప్రగతిని ఐటమ్ బాంబుగా మార్చేసింది మెహ్రీన్ (Mehreen Pirzada).
ఔనా.? నిజమా.? ప్రగతిని అలా మార్చేస్తారా.?
ప్రగతి (Actress Pragathi) అంటే, సీనియర్ నటి. ‘ఎఫ్3’ సినిమాలో కూడా నటించింది. చాలా సినిమాల్లో తల్లి, అత్త పాత్రల్లో కనిపిస్తుంటుంది ప్రగతి.
సోషల్ మీడియాలో ప్రగతి చేసే వర్కౌట్ విన్యాసాలకి ఫిదా అయ్యే ఫ్యాన్స్ చాలామందే వున్నారనుకోండి.. అది వేరే సంగతి. కేవలం, వర్కౌట్స్ మాత్రమే కాదు.. డాన్స్ కూడా చాలా బాగా చేసేస్తుంటుంది ప్రగతి.

ఒకటీ అరా సినిమాల్లో అలా అలా స్టెప్పులేసిన సందర్భమూ లేకపోలేదు ప్రగతి విషయంలో. ఇప్పుడు ఏకంగా ప్రగతిని ఐటమ్ బాంబుగా మార్చేసింది మెహ్రీన్ తన గాసిప్ ద్వారా.
Mehreen Pirzada Gossip Queen.. ఓన్లీ ఫన్.! నో ఫ్రస్ట్రేషన్.!
ఔను కదా, ప్రగతితో ఐటమ్ సాంగ్ ఎందుకు చేయించకూడదు.? అన్న డౌట్ ఏ దర్శకుడికైనా వస్తే ఏంటి పరిస్థితి.? ఇంకేముంటుంది.? మాంఛి మాస్ మసాలా సాంగ్ ఒకటి వస్తుందంతే.
ఏజ్ ఈజ్ జస్ట్ నంబర్.. అని ఈ మధ్య చాలామంది చెప్పేస్తున్నారు. సో, ప్రగతి కూడా అలాంటి మాటే చెప్పేసి, స్పెషల్ సాంగ్ చేసేస్తోనో.! జస్ట్ ఫన్.. నో ఫ్రస్ట్రేషన్.!
Also Read: మాళవిక మోహనన్ సంచలనం.. ఏకధాటిగా 18 గంటలు.!
ఇదంతా ఓ ఛానల్ టెలికాస్ట్ చేసిన స్పెషల్ ప్రోగ్రామ్‌లో సరదాగా, మెహ్రీన్ సహా ‘ఎఫ్3’ టీమ్ కలిసి చేసిన సందడి మాత్రమే. వెంకటేష్, సోనాల్ చౌహన్, తదితరులు ఈ ప్రోగ్రామ్‌లో చేసిన హడావిడి అంతా ఇంతా కాదు.!