Mental Bala Krishna.. ఒకే ఒక్క మాట.! నోరు జారిన ఫలితం.. మెంటల్ బాలకృష్ణ ట్రెండింగ్‌లోకి వచ్చేసింది. ఇంతకీ, ఎవరు ‘నట సింహం’ నందమూరి బాలకృష్ణని ఉద్దేశించి అలా విమర్శిస్తున్నది.? ఎందుకు.?
నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘వీర సింహా రెడ్డి’ సినిమా విజయోత్సవ వేడుకలో, ఆయన నోరు జారేశాడు. ‘అక్కినేని తొక్కినేని..’ అంటూ బాలయ్య చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి.
మరోపక్క.. ‘ఆ రంగారావు..’ అంటూ స్వర్గీయ ఎస్వి రంగారావు గురించీ తేలిగ్గా బాలయ్య మాట్లాడటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Mental Bala Krishna.. మెంటల్ బాలయ్య..
గతంలో.. అంటే, చాలాకాలం క్రితం.. నందమూరి బాలకృష్ణ ఇంట్లో కాల్పులు జరిగాయి. ఆ ఘటన సమయంలో బాలకృష్ణ మానసిక స్థితి సరిగ్గా లేదంటే, స్వయంగా ఓ ఆసుపత్రి ఆయనకు సర్టిఫికెట్ ఇచ్చింది.
మానసిక స్థితి.. అంటే మెంటల్ స్టేటస్ కదా.! సో, దాన్ని మెంటల్ సర్టిఫికెట్‌గా పేర్కొంటున్నారు. అందుకే, ‘మెంటల్ బాలయ్య’ (Nandamuri Bala Krishna) అంటున్నారు.

మానసిక వైద్య చికిత్సాలయం ఇచ్చిన సర్టిఫికెట్ అప్పట్లో ఆ కేసు నుంచి బాలయ్యను కాపాడింది. ఆ సర్టిఫికెట్ ఇప్పుడాయన్ని అభాసుపాలు చేస్తోంది.
హరికృష్ణని చూసి వదిలేస్తున్నాం..
అక్కినేని అభిమానుల్లో కొందరు, ‘మీ అన్నయ్య హరికృష్ణ మొహం చూసి నిన్ను వదిలేస్తున్నాం.. హరికృష్ణ, నాగార్జున.. అన్నదమ్ముల్లా వుండేవారు..’ అంటూ ‘సీతారామరాజు’ సినిమాలోని ఫొటోల్ని పోస్ట్ చేస్తున్నారు.

కేవలం అక్కినేని (Akkineni Nageswara Rao) అభిమానులే కాదు, స్వర్గీయ ఎస్వీయార్ (ఎస్వి రంగారావు) అభిమానులూ, నందమూరి బాలకృష్ణ మీద మండిపడుతున్నారు.
ఎస్వీ రంగారావు (SV Ranga Rao) అంటే విశ్వ నట చక్రవర్తి మరి.! మైకు పట్టుకుంటే బాలయ్యకు (Nandamuri Bala Krishna) మెంటలొచ్చేస్తుందనీ, ఆ పిచ్చితనంతో బాలయ్య ఏవేవో మాట్లాడతారనీ నెటిజన్లు రకరకాల కామెంట్లేస్తున్నారు.
Also Read: అక్కినేని.. తొక్కినేని.! నందమూరి ‘ముం..’మూరి.!
‘వీర సింహా రెడ్డి’తో వచ్చిన విజయం.. ఇలా నాశనమైందన్నమాట.! బాలయ్యా మజాకానా.?