Nayanthara ‘సినిమాల్ని ప్రమోట్ చేయడం అంటే నాకిష్టం వుండదు. నాకు అంత టైమ్ కూడా వుండదు..’ అని ఒకప్పుడు నిర్మొహమాటంగా చెప్పేసిన నయనతార, ఇప్పుడు మారిపోయింది.!
పెళ్ళయ్యాక నయనతారలో ఈ కొత్త మార్పు ఎందుకు వచ్చింది.? ఇద్దరు బిడ్డలకు తల్లి అయ్యాక నయనతారలో ఈ మార్పు రావడానికి కారణమేంటి.?
అయినా, పెళ్ళికీ.. పిల్లలకీ.. ఈ సినిమాలకీ లింకేంటట.? ఛాన్సే లేదు. దానికీ, దీనికీ లింకు పెట్టడం కూడా సబబు కాదు.!
కానీ, Nayanthara మారింది.!
ఔను, నయనతార మారిపోయింది. చాలా చాలా మారిపోయింది. తెలుగులోనూ సినిమాని ప్రమోట్ చేయడానికి ఓ ఇంటర్వ్యూలో కనిపించింది నయనతార.
చిరంజీవి సహా నాగార్జున, బాలకృష్ణ, వెంకకేష్, ప్రభాస్, ఎన్టీయార్, రవితేజ.. ఇలా తాను గతంలో కలిసి పనిచేసిన హీరోల గురించి భలే ముచ్చట్లు నయనతార చెప్పడం విశేషమే.
ఎన్టీయార్ డాన్సుల గురించీ, చిరంజీవి గొప్పతనం గురించి.. నయనతార చెబుతోంటే, మళ్ళీ మళ్ళీ నయనతార, తెలుగు మీడియాకి అందుబాటులో వుంటే బావుణ్ణని చాలామంది అనుకున్నారు.
ఈ కనెక్షన్ ఎప్పటిదాకా.?
‘కనెక్ట్’ సినిమా కోసం నయనతార తాను గతంలో పెట్టుకున్న నిబంధనల్ని సడలించి, సినిమా ప్రమోషన్ కోసం వచ్చింది. ఇదే పద్ధతి ముందు ముందు కొనసాగిస్తుందా.?
Also Read: ఉస్తాద్ పవన్ కళ్యాణ్.! మనల్ని ఎవడ్రా ఆపేది.?
ఏమో, అదైతే ప్రస్తుతానికి డౌటే. కానీ, సినిమాని ప్రమోట్ చేయడం అనేది నటీనటుల బాధ్యత. మరి, ఆ బాధ్యతని నయనతార గుర్తెరిగినట్లేనేమో.!