Milky Beauty Tamannah Jailer.. మిల్కీ బ్యూటీ తమన్నాకి ప్రస్తుతం సీనియర్ హీరోల పక్కనే ఛాన్సులొస్తున్నాయ్. వరుసగా సూపర్ స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవి సరసన తమన్నా లేటెస్ట్‌గా స్ర్కీన్ షేర్ చేసుకుంది.
ఈ సందర్భంలోనే తమన్నాకి ఓ విచిత్రమైన ప్రశ్న ఎదురైంది. ఎందుకని సీనియర్ హీరోల పక్కనే నటిస్తున్నావు..? అని ప్రశ్నిస్తున్నారట తమన్నాని.
అందుకు తమన్నా చాలా తెలివిగా సమాధానమిచ్చింది. సీనియర్, జూనియర్ అనే తేడాతో ఎందుకు విబేధించి చూస్తారు.?
Milky Beauty Tamannah Jailer.. తప్పేంటంట.!
ఆయా పాత్రలను మాత్రమే చూడాలి. నటి అన్నాకా అన్ని రకాల పాత్రలూ చేయాలి. ఒక్కోసారి వయసుకు మించిన పాత్రలు కూడా చేయాల్సి వస్తుంది.

అలాగే, తక్కువ వయసున్న పాత్రల్లోనూ కనిపించాల్సి వస్తుంది. నేనే ఇప్పుడు 18 ఏళ్ల వయసున్న అమ్మాయి పాత్రలో నటించాల్సి వస్తుంది.
అప్పుడు లేని అభ్యంతరం సీనియర్ హీరోల విషయంలోనే ఎందుకొస్తుంది.? సీనియర్ హీరోలు మిడిల్ ఏజ్డ్ హీరోలుగా కనిపిస్తే తప్పేముంది.? వారి పక్కన నేను నటిస్తే అంతకన్నా తప్పేముంది.?
అని సూటిగా తమన్నా(Milky Beauty Tamannah) ప్రశ్నిస్తోంది. అవును నిజమే, నటనకు వయసుతో సంబంధం లేదు. ఆయా పాత్రల్లో ఆయనా నటీ నటులు ఎంతలా ఒదిగిపోయారు.?
దటీజ్ మిల్కీ బ్యూటీ.!
తమ నటనతో ఎంత మేర ప్రేక్షకుల్ని మెప్పించారు.? అన్నదే విషయం. అదే పాయింట్‌ని తమన్నా రైజ్ చేసే ప్రయత్నం చేసింది తమన్నా (Milky Beauty Tamannah).

ఇన్నేళ్ల సినీ కెరీర్‌లో తమన్నా నేర్చుకున్న పాఠాన్ని ఎంతో అందంగా ఇలా విడమరిచి చెప్పినట్లయ్యింది. అందుకే అందరూ తమన్నాని ముద్దుగా మిల్కీ బ్యూటీ అని పిలుచుకుంటారు మరి.
‘భోళా శంకర్’ ప్రమోషన్ల సందర్భంగా మెగాస్టార్ చిరంజీవి కూడా తమన్నాని పొగడ్తలతో ముంచెత్తేశారు. నటిగా అంత ఎక్స్‌పీరియన్స్ వున్నప్పటికీ, యాక్టింగ్‌లో తమన్నా డెడికేషన్ చాలా గొప్పది అన్నారాయన.
ఏ సన్నివేశాన్నయినా అర్ధం చేసుకుని, ఆయా సన్నివేశం, డైలాగ్ కోసం తమన్నా చేసే హార్ట్ వర్క్ ఏదైతే వుంటుందో అందుకు హ్యాట్సాఫ్ అన్నారు చిరంజీవి.