చావు తప్పి కన్ను లొట్టపోయిన చందాన మోనాల్ గజ్జర్ (Monal Gajjar Winner Akhil Sarthak Looser) ఎలిమినేషన్ నుంచి తృటిలో తప్పించుకున్న విషయం విదితమే. ‘ప్యాక్ యువర్ బ్యాగ్స్’ అని నాగ్, మోనాల్‌తోపాటు కుమార్ సాయికి చెప్పడంతో.. మోనాల్ ఎలిమినేషన్ ఖాయమని హౌస్‌మేట్స్ అనుకున్నారు.
ఇంకేముంది.? అఖిల్ సార్దక్ ‘కుళాయి’ తిప్పేశాడు. తీరా, మోనాల్ ఎలిమినేట్ అవలేదనని తెలిసి.. చాలా ఓవరాక్షన్ చేశాడు. మరి, అంతలా మోనాల్ మీద అభిమానం వుంటే, మోనాల్‌ని ఈ వారం నామినేషన్స్ నుంచి తప్పించొచ్చు కదా.? ‘నేను నామినేట్ అవను.. ప్లీజ్, నువ్వే నామినేట్ అవు.. నేను నీకంటే స్ట్రాంగ్ కదా..’ అంటూ చెత్త లాజిక్ చెప్పాడు అఖిల్.
Also Read: హారికని గెలిపించి, తానూ గెలిచిన అబిజీత్
అఖిల్ ఎంత ‘త్యాగజీవి’ అనేది అర్థమైపోయిందో ఏమో, డేరింగ్‌గా ముందడుగు వేసింది.. తానే నామినేట్ అవుతున్నట్లు ప్రకటించింది. ‘వాట్ ఏ పిటీ అఖిల్..’ అంటూ ఇప్పుడు బిగ్‌బాస్ వ్యూయర్స్ అఖిల్ సార్ధక్‌పై విమర్శలతో విరుచుకుపడుతున్నారు.
హౌస్‌లో ఏ రోజూ అఖిల్ సార్దక్ జెన్యూన్‌గా కనిపించలేదంటూ ఆయన మీద వున్న ‘ఫిర్యాదు’ ఇప్పుడు మరోమారు నిజమని తేలిపోయింది. వరుసగా నామినేట్ అవుతున్న మోనాల్‌ని నామినేషన్స్ నుంచి రక్షించాల్సిన ఛాన్స్ వస్తే, ఇక్కడ అఖిల్ తన స్వార్ధం చూసుకున్నాడు.
బిగ్‌బాస్‌లో ఇలాంటి కంటెస్టెంట్ ఎక్కువ రోజులు వుండడమంటే, ఇదంతా మానుప్యులేషన్ తప్ప.. ఇంకోటి కాదన్నది చాలామంది అభిప్రాయం.
కేవలం హౌస్‌లో మోనాల్ గజ్జర్‌తో ‘పులిహోర’ కలపడం తప్ప అఖిల్ సార్ధక్ చేసిందేమీ లేదని మెజార్టీ బిగ్‌బాస్ వ్యూయర్స్ అభిప్రాయపడుతున్న దరిమిలా, తన స్టామినా నిరూపించుకోవాల్సింది పోయి.. ఫన్నీగా మోనాల్ గజ్జర్‌ని డేంజర్ జోన్‌లోకి నెట్టేశాడు.
వావ్.. బహుశా ఇలాంటి కంటెస్టెంట్ గడచిన మూడు సీజన్లలో ఎక్కడా మనకి కన్పించలేదేమో.! అఖిల్‌ని అభిమానించే ఆ కాస్తో కూస్తో ‘ఫాలోవర్స్’ (పెయిడ్ బ్యాచ్ అనే విమర్శలున్నాయి) కూడా, మోనాల్ గజ్జర్‌ని అలా నామినేషన్స్‌లోకి నెట్టేయడాన్ని (Monal Gajjar Winner Akhil Sarthak Looser) జీర్ణించుకోలేకపోతున్నారు.