Table of Contents
Money For Sale.. ఔను, డబ్బులు అమ్మబడును.! ఇదే విషయాన్ని స్పష్టంగా పేర్కొంటూ బోర్డులు కూడా పెట్టారు.!
డబ్బులు అమ్మడమేంట్రీ మీ మొహాలు మండ.! ప్రపంచంలో దేన్నయినా డబ్బుతో కొనవచ్చు. పదవులు కొనుక్కోవచ్చు.. ప్రాణాలు కూడా కొనుక్కోవచ్చు.!
సరదాగా కోడి పందాలు ఆడితే అదో లెక్క. కానీ, కోడి పందాల వ్యవహారం ఓ వ్యవనంగా మారిపోయింది. వేలు, లక్షలు కాదు, కోట్లు చేతులు మారుతున్నాయి కోడి పందాల్లో.!
Mudra369
బంధువుల్ని కొనుక్కోవచ్చు.. శృతృవుల బాధని తప్పించుకోవచ్చు.! డబ్బుతో వున్న ప్రయోజనాలు అన్నీ ఇన్నీ కావు. అది తెచ్చే అనర్థాలూ అన్నీ ఇన్నీ కావొచ్చు.
Money For Sale.. కానీ, ఎలా.?
కానీ, డబ్బుని ఎలా కొనగలం.? ఇదిగో, ఇలా కొంటామనీ.. ఇలా అమ్మేస్తామనీ అంటున్నారు ‘కేటుగాళ్ళు’.!
సంక్రాంతి అంటే, తెలుగు రాష్ట్రాల్లో కోడి పందాలే.. అన్న స్థాయికి ‘పండగ’ని దిగజార్చేశారు.! ఎవరు ఔనన్నా ఎవరు కాదన్నా ఇదే నిష్టుర సత్యం.
సరే, సరదాగా కోడి పందాలు ఆడితే అదో లెక్క. కానీ, కోడి పందాల వ్యవహారం ఓ వ్యవనంగా మారిపోయింది. వేలు, లక్షలు కాదు, కోట్లు చేతులు మారుతున్నాయి కోడి పందాల్లో.!
డబ్బుని కొనగలరు కూడా.!
ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలు ఆ పక్కనే వున్న కృష్ణా, గుంటూరు జిల్లాల్లోనూ ఈ కోడి పందాల దందా.. మూడు పువ్వులు ముప్ఫయ్ ఆరు కోట్ల కాయలన్నట్టు సాగుతోంది కథ.

ఈ ఏడాది స్పెషాలిటీ ఏంటంటే, సంక్రాంతి పండక్కి ‘మనీ ఫర్ సేల్’ అంటూ బోర్డులు పెట్టడం. క్రెడిట్ కార్డు అయినా, డెబిట్ కార్డు అయినా, వివిధ రకాలైన డిజిటల్ వ్యాలెట్లు అయినా ఇక్కడ చెల్లుబాటవుతాయ్.
‘ఇచ్చట డబ్బులు అమ్మబడును..’ అంటూ జాదూగాళ్ళు బోర్డులు పెట్టేశారు. ‘డబ్బులు కొనబడును’ అని కూడా బోర్డులున్నాయ్.
రాజకీయ అవినీతి.!
ఇంతకీ, పోలీస్ వ్యవస్థ అధికార యంత్రాంగం ఏం చేస్తోందిట.? ఆ ఒక్కటీ అడగకూడదంతే. ఎన్నికల్లో ఒక్కో ఓటుకీ పది వేల దాకా పంచాల్సి వస్తోంది కదా.! ఆ సొమ్ములెక్కడినుంచొస్తున్నాయ్ రాజకీయ నాయకులకి.?
Also Read: గోల్డెన్ గ్లోబ్: ‘నాటు’గా ‘ఆర్ఆర్ఆర్’ టీమ్ కొనేసిందా.?
ఆ రాజకీయ నాయకుల కనుసన్నల్లో అధికార యంత్రాంగం నడుస్తోంటే.! డబ్బుల అమ్మకాలు, కొనుగోళ్ళు నిస్సిగ్గుగా జరుగుతూనే వుంటాయ్ మరి.!
