Monkeys Dogs మీకు తెలుసా.? ఈ భూమ్మీద అత్యంత ప్రమాదరకరమైన జీవి ఏంటో.. డైనోసార్ల కంటే కూడా ప్రమాదకరమైనది.. ఆ జీవి పేరు ‘మనిషి’. ఎంత క్రూర మృగమైనా కొన్ని పరిధులకు లోబడి తన జీవనాన్ని సాగిస్తుంది. సాధు జంతువుల్ని, క్రూర మృగాలు వేటాడడం అనేది జీవన ధర్మం.
కానీ, ఈ భూమ్మీద ఏ క్రూర మృగం, మరే ఇతర ప్రమాదకర జీవి కూడా చేయనంత నష్టాన్ని ఈ భూమికి చేస్తున్నది మనిషి మాత్రమే. ఎవరు ఒప్పుకున్నా, ఎవరు ఒప్పుకోకున్నా ఇదే నిష్ఠుర సత్యం. అవును.. మనిషి కారణంగా ఈ భూమి మనుగడకు ప్రమాదం వచ్చింది. అలాగని ఎన్నో ఏళ్లుగా మనమే విశ్లేషించుకుంటూ ఉన్నాం.
Mokeys Dogs.. మనిషి మామూలోడు కాదు సుమీ.!
కానీ, వినాశకర చర్యల్ని మాత్రం మానుకోలేకపోతున్నాం. మహారాష్ర్టలోని ఓ గ్రామంలో వానరాలు, శునకాల పిల్లల్ని ఎత్తుకెళ్లి చంపేస్తున్నాయ్. ఒకటా.. రెండా.. దాదాపు మూడు వందల కుక్క పిల్లల్ని వానరాలు చంపేశాయని గ్రామస్థులు లబో దిబోమన్నారు.
పోలీసులు, అటవీ శాఖాధికారులు పరిస్థితిని సమీక్షించి విచారించి అదంతా నిజమేనని తేల్చారు. ఈ దారుణానికి ఒడికట్టిన వానరాల్ని పట్టుకున్నారు. ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, కోతుల పిల్లల్ని చంపేయడంతో శునకాల పట్ల జాతి వైరం పెంచుకుని వానరాలు ఇంత దారుణానికి దిగాయి.

ఎంత దుర్మార్గమైన విషయమో కదా. కాస్త లోతుగా ఆలోచించి చూస్తే, మనిషి కంటే, దారుణంగా ఏమీ ప్రవర్తించలేదు వానరాలు. దేశ రాజధాని ఢిల్లీలో నిర్భయ ఘటన ముందు ఇదెంత.? దేశాల మధ్య నడుస్తున్న ఆధిపత్య పోరు, తీవ్రవాదం ముందు కోతుల చర్యలు వెంట్రుక వాసి కూడా కావు.
Monkeys Dogs మనిషికంటే వానరం పెద్ద తప్పిదం చేసిందా.?
చెప్పుకుంటూ పోతే, చాలానే ఉన్నాయ్. సాటి మనిషి ఎదుగుదలను ఓర్వలేక కిడ్నాపులు, హత్యలు.. సమాజంలో ఎన్నో చూస్తున్నాం. అంటే, మనిషిని చూసి వానరాలు మారుతున్నాయనుకోవాలా.? ఏమో ఇదొక భావన మాత్రమే. కోతి నుంచి మనిషి ఆవిర్భవించాడని చెప్పుకుంటూంటాం. మనిషి నుంచి కోతి తన ఆలోచనలు మార్చుకుని తనను తాను సరికొత్తగా, వినాశకారిగా మార్చుకుంటోందంటే అది అత్యంత ప్రమాదకరమైన భావన.
అటవీ మార్గాల్లో ప్రయాణం చేసేటప్పుడు రోడ్డుకిరువైపులా కనిపించే వానరాలను చూసి, చేతిలో ఉన్న ఆహారపదార్ధాల్ని వాటికై విసరడం, మనలో చాలా మంది చేసే ఉంటాం. వాటికి అలవాటు పడుతున్న వానరాలు తమ సహజమైన ఆహారాన్ని వదిలి అడవుల నుంచి జనంలోకి దూసుకొస్తున్నాయ్. అంటే, అది కూడా మన పాపమే.
Also Read: సర్వరోగ నివారిణి ‘గాడిద గుడ్డు’.. ఔనా.?
మన తిండికి అలవాటు పడుతున్న వానరాలు మన ఆలోచనా తీరుకి (Monkeys Dogs) కూడా అలవాటు పడితే, అంత కన్నా వినాశనం ఇంకేముంటుంది.? ఇప్పుడొప్పుకుంటారా.? ఈ భూమ్మీద అత్యంత ప్రమాదకరమైన జవి మనిషి మాత్రమేనని.