ఇస్మార్ట్ రామ్ ఎనర్జీని ‘బచ్చన్’ బ్యూటీ మ్యాచ్ చేయగలదా.?

 ఇస్మార్ట్ రామ్ ఎనర్జీని ‘బచ్చన్’ బ్యూటీ మ్యాచ్ చేయగలదా.?

RAPO Bhagyashri Borse.. అందాల భామ భాగ్యశ్రీ బోర్సే.. గుర్తుందిగా.! ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. కానీ, తొలి సినిమా భాగ్యశ్రీని నిరాశ పరిచింది.

నిజానికి ఈ సినిమాతో భాగ్యశ్రీ బోర్సే మంచి ఫాలోయింగ్ సంపాదించుకుంది. పాటల్లో హుషారు చూపించింది. ఇప్పటికీ ఆ పాటలు మార్మోగుతూనే వున్నాయ్.

తొలి సినిమా ఫ్లాప్ కావడంతో భాగ్యశ్రీని అంతా మర్చిపోయారనుకున్నారు. కానీ, అలా జరగలేదు.

అంత సులువుగా భాగ్యశ్రీ బోర్సే అంద చందాలను తెలుగు ప్రేక్షకులు మర్చిపోలేదు. అయితే, సక్సెస్ వచ్చి వుంటే సీను మరోలా వుండేది.

RAPO Bhagyashri Borse.. భాగ్యశ్రీ బోర్సే పనైపోయిందనుకున్నారా.?

సక్సెస్ రాకున్నా.. తొలి సినిమాతోనే స్టార్‌డమ్ దక్కించుకున్న ముద్దుగుమ్మగా స్సెషల్ ఐడెంటిటీని సొంతం చేసుకుంది భాగ్యశ్రీ బోర్సే.

ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల్ని కవ్వించేందుకు సిద్ధమవుతోంది. అదే రామ్ పోతినేని 22 వ చిత్రం. ఈ సినిమా లేటెస్ట్‌గా లాంచ్ అయ్యింది.

దసరా కానుకగా అనౌన్స్ చేసిన ఈ సినిమాని వెరీ లేటెస్ట్‌గా పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. త్వరలోనే రెగ్యులర్ షూట్ స్టార్ట్ కానుంది.

‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ ఫేమ్ మహేష్ బాబు. పి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తుండగా, మైత్రీ మూవీస్ మేకర్స్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.

రామ్‌కి లక్కీ బ్యూటీ అవుతుందా.?

డెబ్యూ సినిమా సక్సెస్ కానప్పటికీ ప్రత్యేకంగా దక్కించుకున్న భాగ్యశ్రీ బోర్సే స్టార్ ‌డమ్ ఈ సినిమాకి ఖచ్చితంగా కలిసొచ్చే అవకాశం లేకపోలేదు.

అంతేకాదు, సినిమాని ప్రమోట్ చేయడంలోనూ భాగ్యశ్రీ బోర్సే తనదైన ప్రత్యేకతను చాటుకుంటుందన్న విషయం ‘మిస్టర్ బచ్చన్’ సినిమాతోనే ప్రూవ్ చేసుకుంది.

Also Read: ఫైరు కాదు.. ఫ్లవరు! తగ్గీ, తలొగ్గీ.. ప్లేటు ఫిరాయించేశావేంటి పుష్పా!

అదే స్ట్రాటజీని ఈ సినిమాకీ కంటిన్యూ చేయొచ్చు భాగ్యశ్రీ. ఇక, రామ్ విషయానికి వస్తే, ప్రస్తుతం వరుస డిజాస్టర్స్‌తో సతమతమవుతున్నాడు.

భారీ అంచనాలతో వచ్చిన ‘డబుల్ ఇస్మార్ట్’ దారుణంగా నిరాశపరిచింది. సో, ఈ సినిమా డెబ్యూ బ్యూాటీ భాగ్యశ్రీతో పాటూ, రామ్ పోతినేనికీ చాలా ప్రెస్టీజియస్ అని చెప్పొచ్చు.

Digiqole Ad

Related post