Table of Contents
ఓ సంస్థ కోసం పని చేస్తూ, ఖాళీ సమయంలో ఇంకో పని చేయడం ద్వారా ఆర్థికంగా బలపడటం నేరమట.! అలాగని చెబుతోంది (Moonlighting) ‘మూన్ లైటింగ్’.!
సాఫ్ట్‌వేర్ రంగంలో ఇప్పుడిప్పుడే ఈ ‘మూన్ లైటింగ్’ గురించిన చర్చ జరుగుతోంది. చర్చ జరగడమేంటి.? చాలామందికి ఈ ‘మూన్ లైటింగ్’ పేరుతో ఆయా సంస్థలు ‘విడాకులు’ ఇచ్చేస్తేనూ.!
ప్రపంచంలో చాలా ప్రముఖ సంస్థలు, ఓ సంస్థలో పనిచేస్తున్న వ్యక్తులు తమ తీరిక సమయంలో భిన్నమైన ఆలోచనలు చేయడం ద్వారా పుట్టుకొచ్చినవే.
శ్రమ దోపిడీ.!
ఉద్యోగులందరూ కష్టపడిపోతున్నారా.? సంస్థల యాజమాన్యాలన్నీ ఉద్యోగుల్ని బాగా చూసుకుంటాయా.? ‘ఔను’ అనడం సబబు కాదు.
కానీ, మెజార్టీ ఉద్యోగులు కస్టపడి పని చేస్తారు. మెజార్టీ సంస్థలు.. ఉద్యోగుల శ్రమను దోపిడీ చేస్తాయి. ఇదీ వాస్తవం.

ఎవరైనా ఉద్యోగి ఓ సంస్థలో పని చేస్తున్నప్పుడు తన మేధస్సునంతా ఆ కంపెనీ కోసమే ఉపయోగించాలనడం మూర్ఖత్వం. దురదృష్టవశాత్తూ ఆ మూర్ఖత్వంతోనే ఒప్పందాలు జరుగుతున్నాయ్.
సాఫ్ట్‌వేర్ రంగంలో పని చేస్తున్న వ్యక్తి, ఓ ఫుడ్ ఛెయిన్ ప్రారంభించాలనుకుంటాడు. అది అతని అభిరుచి. ఆ రంగంలోకి ప్రవేశిస్తాడు ప్రత్యక్షంగానో, పరోక్షంగా. అది నేరమెలా అవుతుంది.?
Moonlighting.. గురివింద నైజం..
పెద్ద పెద్ద సంస్థల్ని నడిపే యజమానులు మాత్రం ఒకటికి పది కంపెనీలు తమ కనుసన్నల్లో నడిచేలా చూసుకుంటారు. అది తప్పు కానే కాదట.
ఆయా కంపెనీల్లో పని చేసే ఉద్యోగులు మాత్రం, తమ మేధస్సుని వినియోగించి వేరే ఆలోచనల వైపుకు తమ ఆలోచనల్ని మళ్ళించకూడదట.
Also Read: మీకు తెలుసా.? భూమ్మీద చీమల జనాభా 20 క్వాడ్రిలియన్స్.!
ఏ చోట ఉద్యోగం చేస్తున్నారో అక్కడ 100 శాతం ఎఫర్ట్ పెట్టినాగానీ, సదరు ఉద్యోగి మరో ఆలోచన చేసి ఆర్థికంగా బలపడకూడదన్న దుర్మార్గపు ఆలోచనని ఏమనాలి.?
పేరు మూన్ లైట్.! కానీ, ఇది రెడ్ లైట్.!
వినడానికి ‘మూన్ లైట్’ అనే పేరు బావుందిగానీ, మేధస్సుకి ఇది ముమ్మాటికీ రెడ్ లైట్.. అని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
Also Read: ఔరా.. ‘ఉంగరం’లో మీ ఆరోగ్యం.! టూ స్మార్ట్ సుమీ.!
‘మూన్ లైటింగ్’ పేరుతో ఉద్యోగులపై ఒత్తిడి తెస్తే, ఆయా సంస్థల ప్రొడక్టివిటీ నాశనమైపోతుందన్నది ఆ రంగ నిపుణులు, మానసిక వైద్య నిపుణులు కుండబద్దలుగొట్టి మరీ చెబుతున్నమాట.