Smart Ring Oura..సరికొత్త ఆవిష్కరణలు ఎప్పటికప్పుడు ‘ఔరా.!’ అని అంతా ఆశ్చర్యపోయేలా చేస్తున్నాయి.
సరైన ఆహారపు అలవాట్లు, సమయానికి నిద్ర, తగినంత వ్యాయామం.. ఇవన్నీ చేసేంత తీరిక లేదుగానీ, ఆరోగ్యంగా వుండాలి కాబట్టి.. ఏవేవో చేసేస్తుంటాం.
కాన్నాళ్ళపాటు పొద్దున్నే జిమ్‌కి వెళ్ళడం.. బరువు పెరిగిపోయాం కాబట్టి, వున్నపళంగా తిండి మానేసి.. అనారోగ్య సమస్యలు కొనితెచ్చుకోవడం.. ఇవన్నీ ఈ రోజుల్లో సర్వసాధారణమైపోయాయి.
మన శరీరం ఏం కోరుకుంటోంది.? అన్నది మనకి ఎప్పటికప్పుడు తెలిసిపోతోంటే.! దాని కోసం ఓ స్మార్ట్ డివైజ్, చేతి వేలికి తొడిగే ఉంగరంలా వుంటే.! ఆ కిక్కే వేరప్పా.!
ఔరా.! అనిపిస్తోందా.? అయితే, ఆ స్మార్ట్ ఉంగరం సంగతేంటో తెలుసుకుందాం పదండిక.!
Smart Ring Oura.. సాదా సీదా ఉంగరం కాదిది.! ఔరా అనాల్సిందే.!
పేరులోనే ‘ఔరా’ వుంది. ఇదొక హెల్త్ కేర్ గాడ్జెట్స్ కంపెనీ నుంచి బయటకు వచ్చిన ఉంగరం. ఈ ఉంగరం, సాధారణంగా మనం వేలికి తొడుక్కునే ఉంగరంలానే వుంటుంది. కాకపోతే, ఇది చాలా స్మార్ట్.
సెన్సార్ల ఆధారంగా ఈ ఉంగరం పని చేస్తుంది. ఇందులో ఓ మైక్రో చిప్ వుంటుంది కూడా. సెన్సార్లు, మైక్రోచిప్‌కి అనుసంధానమై వుంటాయి. దాన్ని, ఓ యాప్ ద్వారా కనెక్ట్ చేస్తారు.

ఏ సమయానికి తినాలి.? ఏ సమయంలో నిద్రపోతే మంచిది.? వంటివన్నీ ఈ స్మార్ట్ రింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు.
రింగ్, దానికి అనుసంధానమై వున్న యాప్.. ఎప్పటికప్పుడు మన శరీరంలో జరిగే మార్పుల్ని గమనించి, అప్రమత్తం చేస్తుంది.
అంటే, హార్ట్ రేట్ పెరగడం లేదా తగ్గడం.. శరీర ఉష్ణోగ్రత.. నిద్రకు ఎంత సమయం కేటాయిస్తున్నాం.? ఎలాంటి కాంతిలో ఎంత సేపు వుంటున్నాం.. ఇవన్నీ స్మార్ట్ రింగ్ ద్వారా మనం తెలుసుకోవచ్చు.
స్మార్ట్ వాచీలు, బ్యాండ్స్‌తో పోల్చితే తేడా ఏంటంటే.!
స్మార్ట్ వాచ్‌లు, స్మార్ట్ బ్యాండ్స్ తరహాలోనే ఈ స్మార్ట్ రింగ్ కూడా పనిచేస్తుంది. అయితే, ఇంకాస్త అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ ఈ స్మార్ట్ రింగ్ కోసం వినియోగించారు. పలు రంగుల్లో ఈ డివైజ్ దొరుకుతుంది.
ఖర్చు ఎక్కువేగానీ, ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి.. ఖర్చు చేయగలిగినవారు వీటి వైపు బాగానే మొగ్గు చూపుతున్నారు.
యాప్ గతంలో ఉచితంగా అందుబాటులో వుండేది. ఇప్పుడు ఆ యాప్ కోసం కూడా ‘ఔరా’ స్మార్ట్ రింగ్ తయారీ కంపెనీ నెలవారీ సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలు వసూలు చేస్తోంది.
Also Read: నువ్వు నాశనం చేసిన మట్టి.! నిన్ను ఇంకా బతికిస్తోంది.!
తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఈ స్మార్ట్ రింగ్ ధరించడంతో, ఇప్పుడీ స్మార్ట్ రింగ్ తెలుగు నాట హాట్ టాపిక్ అయ్యింది. టైటానియంతో దీన్ని తయారు చేస్తారట.
ఔరా.. అన్పిస్తోంది కదూ.!